నేడు సుత్తి వీరభద్రరావు గారి జయంతి..
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸@ 🌹మామిడిపల్లి వీరభద్రరావు అంటే గుర్తుపట్టేవాళ్లు తక్కువే కావొచ్చు కానీ... సుత్తి వీరభద్రరావు అంటే మాత్రం ఆయన రూపం, రకరకాల పాత్రల్లో ఆయన పంచిన వినోదాలు వెంటనే గుర్తుకొస్తాయి.నేడు ఆయన జయంతి సందర్భంగా కొన్ని విషయాలు గుర్తుచేసుకుందాం..🌹 👉పశ్చిమ గోదావరి జిల్లా ఆయనపురంలో 1947 జూన్ 6న వీరభద్రరావు జన్మించారు. ఆ తల్లి తండ్రులకు వీరభద్రరావు ఒక్కడే కుమారుడు. ఆయనకీ ఇద్దరు చెల్లెల్లు. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబం విజయవాడకు తరలిపోయింది. విజయవాడ ఎకెటిపి స్కూల్లో విద్యని అభ్యసించిన వీరభద్రరావు ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి నటన పట్ల అభిరుచి గల వీరభద్రరావు వీలు చిక్కినప్పుడల్లా తన ఇష్టాన్ని తీర్చుకునేందుకు ఉత్సాహం చూపించేవారు. స్కూల్, కాలేజ్ స్థాయిలోనే రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అభిరుచి విస్తరించి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, వేలిదెండ్ల హనుమంతాచార్య గ్రంధాలయ ప్రాంగణంలో నాటక ప్రదర్శలను వేసేస్థాయిలో ప్రగతి సాధించింది. డిగ్రీలో సహా విద్యార్థి అయిన జంధ్యాలతో కలసి విశ్వవిద్యాలయ స్థాయిలో నాటక పోటీలకు కూడా వీరభద్రరావు సమాయత్తమ...