Posts

Showing posts from November, 2021

నేడు కమలహాసన్ గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ విశ్వనటుడు కమల్‌హాసన్‌‌ గారి పుట్టినరోజు నేడు...  Happy Birthday Kamal garu.. పుట్టినరోజు అందరికీ పండుగే. మరి పుట్టింది ఎందుకు అని తెలిసేది ఎందరికి అని ప్రశ్నించాడో మహాకవి. అలా పుట్టుకను సార్థకం చేసుకున్న మహా నటుల్లో కమలహాసన్ ఒకరు. కమలహాసన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈయన పుట్టింది నటన కోసమేనా? అలాంటి నటనకు గౌరవాన్ని ఆపాదించడానికేనా? నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికేనా? అని అనిపిస్తుంది. నాలుగేళ్ల పసి వయసులోనే నటననే కళామతల్లి ఒడి చేరిన కమల్ తొలిచిత్రంతోనే బాల నటుడిగా (కలత్తూర్ కన్నమ్మ) రాష్ట్రపతి అవార్డును, బంగారు పతకాన్ని అందుకున్నారు. కళలకు సంబంధం లేని కుటుంబంలో పుట్టిన కమల్ నేడు భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంత ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు. 1954 నవంబర్ 7న రామనాథపురం జిల్లా పరమకుడిలో జన్మించిన కమలహాసన్ తండ్రి డి.శ్రీనివాసన్ న్యాయవాది. ఆయన సోదరులు చారుహాసన్, చంద్రహాసన్ న్యాయవాదులే. సోదరి నళిని క్లాసికల్ డాన్సర్. నాలుగేళ్ల వయసు...

నేడు మధుర గాయని "జిక్కి" గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎙జిక్కి గారి గళం స్వరరాగ గంగా ప్రవాహం. వైవిధ్యమైన గాత్రంతో అవలీలగా గీతాలను ఆలపించడం జిక్కి గారి స్పెషాలిటీ. అలాగే తన మృధు మధుర స్వరంతో  ప్రేక్షకులను రంజింప జేసిన ఈ గాయనీమణి పాడిన ప్రతీపాట.. ప్రతీగీతం..  మధురాతిమధురం. నేడు ఆ మధుర గాయని జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..🎙🌹 👉పులకించని మనసులను సైతం పులకింపజేసే మధుర స్వరం ఆమె సొంతం. పాట ఏదైనా తన గాత్రంతో వన్నెలద్దిన గొప్పగాయని. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా...అంటూ ప్రణయ గీతాలు ఆలపించినా....హాయి హాయిగా ఆమని సాగే.. అంటూ హాయి గొలిపే గీతాలను పాడినా.. జీవితమే సఫలము.. అంటూ తన గానంతో ప్రేక్షకుల వినోదాన్ని సఫలం చేసినా.. ఆమెకే సాధ్యం అనేలా చేసింది.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@ 👉పిల్లవాలు గజపతి కృష్ణవేణి... జిక్కి అసలు పేరు ఇది. సినిమాల్లోకి వచ్చాక జిక్కీగా సుప్రసిద్ధురాలు. దాదాపు పదివేలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ తదితర భాషలలో పాటలు పాడారు. జిక్కి మాతృభాష తెలుగు అయినప్పటికీ తమిళ్‌ భాష బాగా మాట్లాడగలిగేవారు.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@ 👉ఎన్నో మధుర గీతాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన జిక్కి.. 1935 నవంబర్ ...

మావిచిగురు తినగానే కోయిల పలికేనా..

Image
 @శ్రీనివాస్@ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి స్మృతిలో ఆయన రచన చేసిన గీతంతో మిత్రులందరికీ శుభరాత్రి.. మావిచిగురు తినగానే కోయిల పలికేనా.. చిత్రం: సీతామాలక్ష్మి సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: బాలు, సుశీలమ్మ సంగీతం: కె.వి.మహదేవన్ మావిచిగురు తినగానే కోయిల పలికేనా కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిమేనా ఏమో ఎమనునోగానీ ఆమని ఈ వని తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా వన్నెలేకాదు వగలేకాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి గడసరి ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో పలకరింతలు పులకరింతలు ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ పాటలోని కొన్ని పదాల అర్థాలు: తొడుము = చిగురించు, to sprout ఆమని = వసంతం, spring వని = అడవి, forest తెమ్మెర = చల్లగాలి, cool breeze తారాట = play బింకం = గర్వం, pride బిడియం = సిగ్గు, shyness పొంకం = ఠీవి, style పోడిమి = elegance విరి = పువ్వు, flower దివిటీ = torch