నేడు మధుర గాయని "జిక్కి" గారి జయంతి..
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
🌹🎙జిక్కి గారి గళం స్వరరాగ గంగా ప్రవాహం. వైవిధ్యమైన గాత్రంతో అవలీలగా గీతాలను ఆలపించడం జిక్కి గారి స్పెషాలిటీ. అలాగే తన మృధు మధుర స్వరంతో ప్రేక్షకులను రంజింప జేసిన ఈ గాయనీమణి పాడిన ప్రతీపాట.. ప్రతీగీతం.. మధురాతిమధురం. నేడు ఆ మధుర గాయని జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..🎙🌹
👉పులకించని మనసులను సైతం పులకింపజేసే మధుర స్వరం ఆమె సొంతం. పాట ఏదైనా తన గాత్రంతో వన్నెలద్దిన గొప్పగాయని. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా...అంటూ ప్రణయ గీతాలు ఆలపించినా....హాయి హాయిగా ఆమని సాగే.. అంటూ హాయి గొలిపే గీతాలను పాడినా.. జీవితమే సఫలము.. అంటూ తన గానంతో ప్రేక్షకుల వినోదాన్ని సఫలం చేసినా.. ఆమెకే సాధ్యం అనేలా చేసింది.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
👉పిల్లవాలు గజపతి కృష్ణవేణి... జిక్కి అసలు పేరు ఇది. సినిమాల్లోకి వచ్చాక జిక్కీగా సుప్రసిద్ధురాలు. దాదాపు పదివేలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ తదితర భాషలలో పాటలు పాడారు. జిక్కి మాతృభాష తెలుగు అయినప్పటికీ తమిళ్ భాష బాగా మాట్లాడగలిగేవారు.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
👉ఎన్నో మధుర గీతాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన జిక్కి.. 1935 నవంబర్ 3న తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో జన్మించారు. ఆమె పూర్తి పేరు.. పిల్లవాలు గజపతి కృష్ణవేణి. మాటల కంటే పాటలనే ఎక్కువ నేర్చింది జిక్కి. ఆమె సినీ ప్రస్థానం.. గాయనిగా కాకుండా నటనతో ప్రారంభం కావడం విశేషం. తన ఏడవయేటే గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన ‘పంతులమ్మ’ చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయిక లక్ష్మీరాజ్యంతో నటించడమే కాక, ఒక పాటకూడా పాడారు. అలా మొదలైన జిక్కి పాటల ప్రవాహం కడవరకు సాగుతూ వచ్చింది. ‘త్యాగయ్య’, ‘మంగళ సూత్రం’, ‘గొల్లభామ’ చిత్రాల్లో బాలనటిగా నటిస్తూనే పాటలు పాడారు జిక్కి. పదహారేళ్ల వయసు వచ్చాక.. పూర్తి స్థాయి గాయనిగా మారి నటనకు స్వస్తి చెప్పింది. సినిమాను ఒకే ఒక్క పాటతో సూపర్ హిట్ రేంజ్‌కి తీసుకెళ్లిన ఘనత జిక్కి గాత్రానిది. ‘రోజులుమారాయి’ చిత్రంలో ఆమె ఆలపించిన ‘ఏరువాక సాగారో’ పాట.. నేటికీ నిత్యనూతనం. అదీ జిక్కి గాన మహత్యం.జాన పదాలను ఆలపించడంలో జిక్కీ స్టైలే వేరుగా వుంటుంది.. దొంగరాముడు సినిమాలో ఘంటసాలతో కలిసి, జిక్కి ఆలపించిన ‘చిగురాకులలో చిలకమ్మ’ పాట.. ఆమె గాత్రమాధుర్యానికో మచ్చుతునక. ‘శ్రీకృష్ణ పాండవీయం’లో ఛాంగురే బంగారు రాజా అంటూ ఆమె పాడిన పాట ఆ చిత్ర విజయానికి ఎంతగానో దోహదం చేసింది. జిక్కీ.. ప్రముఖ గాయకుడు, సంగీతదర్శకుడు ఏ.ఎమ్.రాజాను వివాహమాడారు. పెళ్లి తర్వాత ఆమె గానప్రస్థానం.. శ్రోతలను మరింతగా అలరించింది. గాయనిగా ఆమె ప్రతిభ ఎల్లలు దాటి.. ఇతర భాషలకు సైతం ప్రవేశించింది. జిక్కి స్వరంలోంచి జాలు వారిన రాగాలకు ఎన్నో అవార్డులూ, రివార్డులూ వచ్చాయి. మద్రాసు కళాసాగర్ ఉగాది పురస్కారం, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే కళైమామణి అవార్డులు ఆమెను వరించాయి. పాడటంలో కొంత గ్యాప్ తీసుకున్న జిక్కీ.. బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కలయికలో వచ్చిన ‘ఆదిత్య 369’లో తిరిగి గళం విప్పింది. ఇందులో ఆమె పాడిన జాణవులే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘నిన్నేపెళ్లాడతా’ మూవీలో టైటిల్ సాంగ్ పాడింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కిన ‘మురారి’లో అలనాటి రామచంద్రుడు పాట గాయనిగా ఆమె చివరి పాట. కెరీర్ చివర్లో ఆమె పాడిన ఈ పాటలు ఆ మూవీ సక్సెస్‌లో కీరోల్ పోషించాయి. జిక్కి ఏ భాషలో పాడినా.. ఆ భాషపై పట్టు సాధించి.. స్పష్టమైన ఉచ్చారణతో పాడి ఆకట్టుకున్న మేటి గాయని జిక్కి. అనేక భారతీయ భాషలలో పాటలు పాడిందామె. సింహళలోనూ చక్కని పాటలు పాడిన ఘనత జిక్కీది. సంగీతంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా.. అవలీలగా పాడే ఆమె ప్రతిభ అసాధారణం. జిక్కి పాడిన ప్రతిపాట.. మధురాతి మధురంగా ఉండి.. శ్రోతలను అలౌకిక ఆనందాన్ని గురిచేస్తూనే ఉంది.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
👉జిక్కి గాత్రధారణ చేసిన కొన్ని తెలుగు సినిమాలు ఇవి.
‘మనదేశం’, ‘పల్లెటూరిపిల్ల’, ‘షావుకారు’, ‘సంసారం’, ‘పాతాళ భైరవి’, ‘నవ్వితే నవరత్నాలు’, ‘ధర్మదేవత’, ‘పల్లెటూరు’, ‘బ్రతుకు తెరువు’, ‘దేవదాసు’, ‘పరదేశి’, ‘ప్రతిజ్ఞ’, ‘రేచుక్కా’, ‘తోడుదొంగలు’, ‘దొంగరాముడు’, ‘రోజులు మరాయి’, ‘అనార్కలి’, ‘అర్ధాంగి’, ‘చిరంజీవులు’, ‘భలే రాముడు’, ‘ఏది నిజం’, ‘జయం మనదే’, ‘పెంకి పెళ్ళాం’, ‘సువర్ణ సుందరి’, ‘మాయాబజార్’, ‘భలే బావ’, ‘పాండురంగ మహత్యం’, ‘తోడి కోడళ్ళు’, ‘చెంచులక్ష్మి’, ‘మాంగళ్య బలం’, ‘కృష్ణ లీలలు’, ‘పెళ్లి కానుక’, ‘కృష్ణ ప్రేమ’, ‘శాంతినివాసం’, ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’, ‘శ్రీ సీతారామ కళ్యాణం’, ‘బాటసారి’, ‘శబాష్ రాజా’, ‘భీష్మ’, ‘గులేబకావలి కథ’, ‘సిరి సంపదలు’, ‘తిరుపతమ్మ కథ’, ‘లవకుశ’, ‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీమంతుడు’, ‘ఆదిత్య 369’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘నిన్నేపెళ్లాడతా’, ‘మురారి’ తదితర సినిమాలలో పాటలకు జిక్కి తన గాత్రాన్ని అందించారు.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
👉జిక్కి గాన ప్రతిభను గుర్తించి మద్రాస్ తెలుగు అకాడమీ ‘ఉగాది పురస్కారం’తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ‘కలై మా మణి’ పురస్కారాన్ని అందించింది.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
👉డైబ్బై ఏళ్ల తన జీవితంలో... యాబై ఏళ్లకు పైగాపాటలు పాడారామె. అన్నేళ్లపాటూ శ్రోతలను అలరించిన మధురగాయని.. 2004 ఆగష్టు 16న చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికంగా మనమధ్య లేకపోయినా పాటల రూపంలో నేటికీ ప్రేక్షకుల మదిలో సజీవంగా నిలిచేవున్నారు.@𝙨𝙧𝙚𝙚𝙣𝙞𝙫𝙖𝙨@
💟💟💟💟💟💟💟💟💟💟
Comments
Post a Comment