Posts

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

Image
 'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు.. కళ‌కి మాటొస్తే... దొర‌కునా ఇటువంటి సేవ'..అంటూ ఆయ‌న పాదాల‌పై ప‌డి మూగ‌గా రోధిస్తుంది.  నాట్యానికి న‌డ‌కొస్తే...' వే వేల గోపెమ్మ‌లా.. మువ్వా గోపాలుడే..'అంటూ ఆయ‌న చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తుంది!.. సంగీతానికి శ్వాస‌నిస్తే...  ఆయ‌న ఉచ్వాస నిఛ్వాస‌ల్లో వేణుగాన‌మై ప్ర‌భాశిస్తుంది!.. సాహిత్యానికి ఓరూపం ల‌భిస్తే..  ఆయ‌న‌తో క‌ల‌సి స్నేహం చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంది!.. ఆయ‌నే... క‌ళాత‌ప‌స్వి కాశీనాథుని విశ్వ‌నాథ్.  అపారమైన గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి. కాస్త నిబద్దత వున్న వ్యక్తి..  సంగీత సాహిత్య ప్రధానంగా నిర్మించిన చిత్రాలు ఆయన కళా తృష్ణను చెప్పక చెప్తాయి. ఆయన చిత్రాలు పాటల రచయితలోని రచనా సామర్ధ్యాన్ని వెలికి తీస్తాయి. రచయిత తనను తాను వ్యక్థపరచుకునె అవకాశాన్ని కల్పిస్తాయనడంలో అనుమానం లేదు. చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడ...

నేడు సంగీత సరస్వతి పుత్రుడు "ఘంటసాల వెంకటేశ్వరరావు" గారి వర్థంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు సంగీత సరస్వతి పుత్రుడు "ఘంటసాల వెంకటేశ్వరరావు" గారి వర్థంతి.. 15వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య తరువాత తిరుమల తిరుపతి దేవ స్థానంలో అంతటి ఘన గౌరవాన్ని పొందిన ఏకైక గాన గంధర్వుడు ఘంటశాల వెంకటేశ్వరరావు మాత్రమే. అన్నమయ్య తరువాత శ్రీ వారి గర్భగుడి లో మూలవిరాట్ సమీపంలో కూర్చుని గానాలాపన చేయగల అదృష్టం ఒక్క ఘంటశాలకు మాత్రమే దక్కింది.కేవలం గొప్ప గాయకుడు అయినంత మాత్రాన ఆయనకు ఈ అపూర్వ అదృష్టం దొరకలేదు. ఆయన విగ్రహంలో, చూపులో, మాటలో పాటలో ఏదో తెలియని ఒక అనిర్వచనీయమైన దైవత్వం ఉట్టిపడుతుంది. కేవలం కారణజన్ములలో మాత్రమే కనిపించే ఆధ్యాత్మిక ఔన్నత్యం ఘంటసాల గానంలోనూ, వ్యక్తిత్వంలోనూ కనిపించేవి. అందుకేనేమో ఆ గాన గంధర్వుడికి ఆ ఏడుకొండల వాడి పద సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడి హోదాలో గానాలాపన చేసే అదృష్టం దక్కింది. ఇక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆ మహనీయుని ప్రస్థానంలోని ప్రతి విశేషము తెలుగు వారికి సుపరిచితమే. తెలుగు పాటకు శాశ్వత చిరునామాగా నిలిచిన అమరగాయకుడు ఘంటసాల మూర్తి, కీర్తి, స్ఫూర్తి తెలుగువారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. తెలుగు సిన...

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹చలనచిత్ర యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి నేడు... ఆ మహానటున్ని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు మీకోసం..🌹 👉అతనిలా నటించగల విలక్షణ నటుడు ప్రపంచంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాల్లో అతడు నటించని పాత్రలేదు. భీష్ముడు, సుయోధనుడు, రావణుడు, భీముడు, కర్ణుడు వంటి పాత్రల్ని హీరోచిత పాత్రలుగా మలిచి ఆ పాత్రల గొప్పతనాన్ని ప్రేక్షకులకు పంచిన ఆదర్శనటుడాయన. తేజస్సు మూర్తీభవించిన స్ఫురద్రూపి. ఆయన రూపమే సమ్మోహనాకారం... అది ఒక గ్రీకు శిల్పం. చిత్రసీమలో ఆయన ఒక సంచలనం. ‘‘పుణ్యపురుషులు యుగానికొకరే పుడతారు’’ అన్నట్లు మన చలనచిత్ర యుగానికి ఆయనే యుగపురుషుడు.... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన అందరినీ సంభోంధించేది ‘‘బ్రదర్‌’’ అని కానీ అందరికీ ఆయనే పెద్దన్న. రాజకీయంలో బడుగు జీవులకు ఆపధ్బాంధవుడు. తిరుమల - తిరుపతి సందర్శించే భక్తజనకోటికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసిన అన్నపూర్ణుడు.@శ్రీనివాస్@ 👉పౌరాణికం.. జానపదం.. సాంఘికం... పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంల...

నేడు హాస్య బ్రహ్మ "జంధ్యాల" గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎞️🎥"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చెప్పిన హాస్య బ్రహ్మ "జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🎥🎞️🌹 👉జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్‌’ రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్‌ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా బహుమతి లభించింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పత్రికలకు కథలు రాసి చిరు పారితోషికాలు కూడా అందుకున్న ఘనుడు. స్కూలు ఫైనల్‌ చదువుతుండగా ‘ఆత్మాహుతి’ అనే నాటకం రాశాడు. అదే జంధ్యాల తొల...

తెలుగువారి అందాలనటుడు "శోభన్ బాబు" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ తెలుగువారి అందాలనటుడు  "శోభన్ బాబు" గారి జయంతి నేడు... తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా...డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో... ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. వెండితెర అభిమన్యుడు శోభన్ బాబు జయంతి సందర్భంగా ఒక్కసారి అందమైన జ్నాపకాల్లోకి వెళ్దాం. శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. ఎన్.టి.ఆర్ హీరోగా చేసిన దైవబలంలో శోభన్ బాబు ఓ చిన్న పాత్ర ధరించారు. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీ...