Posts

Showing posts from July, 2021

నేడు ప్రముఖ గాయకుడు "మహమ్మద్ రఫీ" గారి వర్ధంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎙నేడు ప్రముఖ గాయకుడు "మహమ్మద్ రఫీ" గారి వర్ధంతి.. ఆ మధుర గాయకుడిని గుర్తుచేసుకుంటూ కొంత సమాచారం..🎙🌹 👉భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా ‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ చనిపోతే ఆయన శవ యాత్రకు వర్షాన్ని లెక్క చేయకుండా పదివేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారంటే, అతడు ఎంతటి గొప్పవాడో ఊహించవచ్చు. ప్రేమగీతాలు, భక్తి గీతాలు, భజన పాటలు, విషాద గీతాలు, కవ్వాలీలు, గజళ్లు, జానపద గీతాలు, కవ్వింపు పాటలు... ఒకటేమిటి... రఫీ గొంతులోంచి వెలువడని విభిన్న రకాల పాటలు లేవంటే నమ్మాలి. వ్యక్తిగా సౌమ్యుడు, వినయ సంపన్నుడు, దాత, చెడు అలవాట్లు లేని సాధారణ పౌరుడు. 🍁వ్యక్తిగత సమాచారం🍁 👉జననం : డిసెంబరు 24, 1924 👉ప్రాంతము : కోట్లా సుల్తాన్ సింగ్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా 👉మరణం : 1980 జూలై 31 (వయసు 55) 👉సంగీత రీతి : హిందీ, ఉర్దూ మరియు ప్రాంతీయ గాయకుడు 👉వృత్తి :గా...

నేడు "డా.సి.నారయణ రెడ్డి" గారి జయంతి..

Image
 @🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​@ 🌹తెలుగు అక్షరానికి గౌరవాన్ని తెచ్చిన అక్షర శిల్పి "డా.సి.నారయణ రెడ్డి" గారి జయంతి నేడు.. ఆ సరస్వతీ పుత్రున్ని గుర్తు చేసుకుంటూ..🌹 👉తెలుగు సినిమా పాటను పరిపుష్టం చేసిన కవుల్లో సి. నారాయణరెడ్డి ఒకరు. ఆయన కలానికి అన్ని వైపులా పదునే. ప్రణయ గీతాలు… ప్రబోధ గీతాలు…భావ గీతాలు…. భావోద్వేగ గీతాలు.. భక్తిగీతాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఆణిముత్యాలు కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలుగా పొదిగారు సినారే. 👉ఈ సాహితీ సార్వభౌముడు సృజించని సాహితీ ప్రక్రియ లేదు. గజల్స్ నుంచి గేయాలదాకా .. ఆయన చేయని ప్రయోగంలేదు. జనహితం.. సామాజిక ప్రయోజనం ఆయన పాటల్లో పల్లవిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. జనపథాలను పాటకట్టిన మేటికవి సినారే.@శ్రీనివాస్@ 👉కరీంనగర్‌ జిల్లా హన్మజీపేటలో 1931 జూలై ఇరవై తొమ్మిదిన జన్మించారు సి. నారాయణరెడ్డి. ఉర్దూ మీడియంలోనే చదవుకున్నారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. చిన్నప్పటి నుంచి రచనలపై మక్కువ చూపేవారు సినారె. 👉ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ...

పాడలేను పల్లవైనా భాషరాని దానను

Image
 @శ్రీనివాస్@ చిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా చిత్ర గారి పాట విందాం... పాడలేను పల్లవైనా భాషరాని దానను.. చిత్రం: సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా గానం: చిత్ర పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను  పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ ఊయలే తాళం పైరగాలే మేళం మమతే రాగం శ్రమజీవనమే భావం రాగమే లోకమంతా ఆ ఆ రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను రాగానిదేముంది రసికులు మన్నిస్తే తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే ఏ పాటైనా ఎద పొంగిపోదా ఏప్రాణమైనా తనివితీరిపోదా చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం ఆహూ ఊహూ రోకటి ప...

నేడు దక్షిణ భారత నైటింగేల్ "చిత్ర" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🎙🎼నేడు దక్షిణ భారత నైటింగేల్  "చిత్ర" గారి పుట్టినరోజు.. ఆ గానకోకిల గురించి కొన్ని విషయాలు..🎼🎙 💐HAPPY BIRTHDAY CHITRA GARU..💐 👉జన్మనామం : చిత్రా కృష్ణన్ నాయర్ 👉ఇతర పేర్లు : చిత్ర,కన్నడద మగళు 👉జననం : 1963 జూలై 27 (వయస్సు: 55  సంవత్సరాలు) తిరువనంతపురము, కేరళ, భారతదేశం 👉సంగీత రీతి:  నేపథ్యగానము, కర్ణాటక సంగీతము 👉వృత్తి :గాయని 👉వాయిద్యం: గాత్రము 👉క్రియాశీలక సంవత్సరాలు : 1979–నేటి వరకు 👉ఉత్తమ నేపథ్య గాయనిగా అత్యధిక జాతీయ పురస్కారాలు అందుకొన్న గాయకురాలు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ నేపథ్యగాయనిగా పురస్కారాలు అందుకొన్న తొలి గాయని. బ్రిటిష్‌ పౌర్లమెంట్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నుంచి గౌరవం పొందిన తొలి భారతీయ మహిళ. చైనా ప్రభుత్వం నుంచి షాంఘై ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క భారతీయ గాయని. లండన్‌లోని రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో జరిగే ప్రతిష్టాత్మక సంగీత ప్రదర్శనలో పాల్గొన్న తొలి దక్షిణ భారతదేశ గాయని. 25 వేలకి పైగా పాటలు ఆలపించిన గాయని. - ఈ ఘనతలన్నింటినీ సాధించిన ఆ ప్రఖ్యాత గాయని ఎవరో కాదు... మన కె.ఎస్‌.చిత్ర. అవ...

నేడు ప్రముఖ నటుడు "కైకాల స‌త్య‌నారాయ‌ణ‌" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐🎞️నేడు ప్రముఖ నటుడు "కైకాల స‌త్య‌నారాయ‌ణ‌" గారి పుట్టినరోజు💐🎞️ 💐🎞️HAPPY BIRTHDAY SATYANARAYANA GARU..🎞️💐 👉కైకాల స‌త్య‌నారాయ‌ణ‌..తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు.. న‌టుడుగా గ‌త ఏడాదికే ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భ‌క్త‌ప్రహ్లాద విడుద‌ల అయితే..1935.జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు.1959లో ఆయ‌న న‌టించిన చిత్రం సిపాయి కూతురు విడుద‌ల‌యింది. ఆ ర‌కంగా ఆయ‌న న‌టుడు అయి..61సంవ‌త్స‌రాలు కాగా..వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 25కి 85వ సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్నారు.@శ్రీనివాస్@ 👉తెలుగు సినిమా అభిమానులు అంద‌రికీ స‌త్య‌నారాయ‌ణ జీవిత చ‌రిత్ర సినిమా విశేషాలు తెలిసిన‌వే..అయినా సింహావ‌లోక‌నం చేసుకుందాం. హీరోగా సినిమా రంగానికి ప‌రిచ‌యం అయినా..ఆ సినిమా నిరాశ‌ప‌ర్చ‌డంతో విల‌న్ గా మార‌డానికి త‌ట‌ప‌టాయించ‌లేదు. జాన‌ప‌ద బ్ర‌హ్మ విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎన్నెన్నో జాన‌ప‌ద చిత్రాల్లో స‌త్య‌నారాయ‌ణ విల‌న్ పాత్ర‌లు పోషించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ పిక్చ‌ర్స్ లో కూడా విల‌న్ పాత్ర‌ల...

నేడు "దాశరథి కృష్ణమాచార్య" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి "దాశరథి కృష్ణమాచార్య" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు వ్రాసారు. ‘చల్లని సముద్ర గర్భం దాచిన బ...

నేడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి గర్వించదగ్గ చిత్రాల్లో నటించిన నవ్వుల రాజు,నటకిరీటి "రాజేంద్రప్రసాద్" గారి పుట్టినరోజు నేడు... ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆయన గురించి కొన్ని విషయాలు.. తెలుగు తెరపై సందడి చేసిన హాస్యనటులు ఎందరో ఉన్నారు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణారెడ్డి .. రాజబాబు .. పద్మనాభం .. అల్లు రామలింగయ్య హాస్యనటులుగా తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే అప్పట్లో హాస్యమనేది కథలో ఒక భాగంగా మాత్రమే ఉండేది. ఆ తరువాత హాస్యరసం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాస్యమే ప్రధానంగా సినిమాలు రావడం మొదలైంది. అలా హాస్య ప్రధానమైన కథల ద్వారా కథానాయకుడిగా తెలుగు తెరపై తమ జోరు చూపించినవారిలో రాజేంద్రప్రసాద్ ముందువరుసలో కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ.అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ ప...

నేడు "సౌందర్య" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలో, అలాగే బాలీవుడ్ లో సైతం తన పేరును చిరస్థాయిగా నిలిచి ఉండేలా చేసుకున్న "సౌందర్య" గారి జయంతి నేడు... ఆమె గురించి కొన్ని విషయాలు.. సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది  హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కూడా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ఆమె ఈ లోకాన్ని విడిచి 17 ఏళ్లవుతున్నాఇప్పటికీ ఆమెను మరిచిపోలేని అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతలా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆమె. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందు...

వీణ వేణువైన సరిగమ విన్నావా..

Image
 @శ్రీనివాస్@ రంగనాథ్ గారి జయంతి స్మృతిలో.. వీణ వేణువైన సరిగమ విన్నావా.. చిత్రం : ఇంటింటి రామాయణం సంగీతం : రాజన్ - నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు,జానకి వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల, చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలీవేళలో ఊపిరి తగిలిన వేళ, నే ఒంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే పలికే రాగమాల చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువునా అణువణువునా జరిగే రాసలీల ||వీణ వేణువైన|| ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో, వెలసే వనదేవత కదిలే అందం కవిత, అది కౌగిలి కొస్తే యువత నా పాటలో నీ పల్లవే నవత, నవ్య మమత ||వీణ వేణువైన||

సినీ నటుడు, దర్శకుడు, రచయిత "రంగనాథ్" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ సినీ నటుడు, దర్శకుడు, రచయిత "రంగనాథ్" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. తిరుమల సుందర శ్రీరంగనాథ్ (జూలై 17, 1949 - డిసెంబర్ 19, 2015) (T.S.S.Ranganath) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు.ఈయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. వీరు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించాడు. రంగ‌నాథ్ కుటుంబంలో ఎవ‌రు సినీ నేప‌థ్యం ఉన్న వారు కాక‌పోవ‌టంతో రంగ‌నాధ్ బాల్యం అంతా సాధారణంగానే గ‌డిచింది. తాతగార...

నేడు ప్రముఖ గాయకులు "విస్సంరాజు రామకృష్ణదాసు(వి.రామకృష్ణ)" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ గాయకులు "విస్సంరాజు రామకృష్ణదాసు(వి.రామకృష్ణ)" గారి వర్ధంతి.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు.. రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20 న విజయనగరంలో జన్మించారు. గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించారు. 1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాలు విశేష ఆదరణ పొందాయి. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ...

సుప్రసిద్ధ రచయిత,దర్శకులు "దాట్ల వెంకట నరసరాజు" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ సుప్రసిద్ధ రచయిత,దర్శకులు "దాట్ల వెంకట నరసరాజు" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 - ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు. డి.వి.నరసరాజు పెద్ద మాటకారిగా అనిపించరు కానీ, ఆయన పాత్రలు మాత్రం మాటలతో తెగ సందడి చేస్తుంటాయి. అట్లాగని అదేపనిగా ప్రాసల కోసం ప్రాయస కూడా కనిపించదు. జన సామాన్యంలోని పదాలతోనే అదను చూసి పదనుగా కలాన్ని పరుగులు తీయించడంలో మేటి డి.వి.నరసరాజు. తెలుగు పలుకుబడిని ఉపయోగించడంలో నరసరాజు అందెవేసిన చేయి. పాత సామెతలను సైతం పట్టుకువచ్చి సందర్భోచితంగా ప్రయోగించేవారు. నాటకరంగంలోనే నరసరాజు బాణీ భళా అనిపించుకుంది. ఆయన ప్రతిభ చూసిన దిగ్దర్శకులు కేవీ రెడ్డి తన ‘పెద్దమనుషులు’ చిత్రం ద్వారా నరసరాజును చిత్రసీమకు పరిచయం చేశారు. అప్పటి నుంచీ చివరి దాకా నరసరాజు పాళీ పరవశింపచేస్తూనే సాగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాల్లూరు నరసరాజు స్వస్థలం. చదువుకొనే రోజుల నుంచీ ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలించేవారు. అదే ఆయనలో హేతువాదాన్ని నెలకొల్పింది. ప్రఖ్యాత హేతువాది ఎమ్.ఎన్....

నేడు తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో.. తనికెళ్ళ భరణి.. వెరీమచ్​ ఫ్రెండ్లీ మరి! సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్​లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కన...

నేడు ప్రముఖ నటులు "గుమ్మడి వెంకటేశ్వరరావు" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటులు "గుమ్మడి వెంకటేశ్వరరావు" గారి జయంతి.. తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 - జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. గుమ్మడి పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. వందలాది చిత్రాలలో తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం ...

నేడు ప్రముఖ దర్శకులు "గురుదత్" గారి జయంతి..

Image
🌹నేడు ప్రముఖ దర్శకులు "గురుదత్"  గారి జయంతి..🌹

నేడు ప్రముఖ దర్శకులు "బాలచందర్" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర వంటి గొప్ప చిత్రాల సృష్టికర్త "కైలాసం బాలచందర్" గారి జయంతి నేడు... ఆ ప్రముఖ దర్శకులు గురించి కొన్ని విషయాలు.. 1930, జులై 9న తమిళనాడులోని తంజావూర్లో బాలచందర్ జన్మించారు. 1964లో రచయితగా  సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో దాదాపు 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే పలు టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో భలే కోడళ్లు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.  ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, జీవితరంగం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, చిలకమ్మ చెప్పింది తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.  రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముటీ, ప్రకాశ్ రాజ్లను చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో హిందీలో తొలి సారిగా పాటలు పాడించిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. అబద్ధం, రెట్టసుళి, ఉత్తమ విలన్ చిత్రాలలో బాలచందర్ నటించారు. ఆయన భార్య పేరు రాజం. వీరికి ముగ్గురు పిల్లలు. కైలాసం, ప్రసన్న అనే ఇద్...

నేడు 'సంగీత కళా సరస్వతి' మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ 🌹నేడు 'సంగీత కళా సరస్వతి' మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి.. ఆ మహానుభావున్ని గుర్తుచేసుకుంటూ..🌹 🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ🌹 👉తల్లిదండ్రులు:   మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ 👉స్వస్థలం: రాజోలు తాలూకా శంకరగుప్తం 👉జననం: 06 వ తేది ఆదివారం, జులై 1930 👉రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరం జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మళయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు.@శ్రీనివాస్@ 🍁బాల్యం మరియు నేపథ్యం🍁 👉బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని శంకరగుప్తంల...

నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "కీరవాణి" గారి జన్మదినం..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐💐💐🎼🎹నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "కీరవాణి" గారి జన్మదినం.. ఆయన గురించిన కొంత సమాచారం..🎹🎼💐💐💐 💐💐💐HAPPY BIRTHDAY KEERAVANI GARU..💐💐💐 👉తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్వరాల మధురవాణి ఎం.ఎం.కీరవాణి. ఓ రాగాన్నే పేరుగా పెట్టుకుని శ్రావ్యమైన సంగీతాన్ని, తెలుగు భాషలోని తియ్యదనాన్ని తన సంగీతం ద్వారా వినిపించగల దిట్ట ఆయన. ఎన్నో జనరంజకమైన గీతాలకు స్వరకర్తగా ప్రేక్షకుల హృదయాల్లో ఆయనది ప్రత్యేకస్థానం. సాహిత్య ప్రధానమైన గీతాలైనా, నేటి యువతను ఉర్రూతలూగించే మాస్‌ గీతాలైనా స్వరపరచి మెప్పించడం ఆయన ప్రత్యేకత. పాటలే కాక సన్ని వేశానికి తగ్గట్టు నేపథ్య సంగీతాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్నమయ్య సినిమాతో పండితులకే పరిమితమైన అన్నమాచార్య గీతాలను అందరికీ చేరువ చేశారు తన ప్రత్యేకమైన సంగీత బాణీలతో. ఈ మరకతమణి అందించిన సంగీతం ప్రేక్షకులకు హృదయోల్లాసం. ఆయన స్వరపరిచి గానం చేసిన పాటలు అలరించే ఆణిముత్యాలు.  👉పాట వినగానే ఇది కీరవాణి పాట అని ప్రేక్షకులు గుర్తుపట్టే విధంగా ఎన్నో గీతాలకు సంగీతాన్ని సమకూర్చారు. సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం అందించి ఉద్దండ...

నేడు ఎస్వీ రంగారావు గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹నేడు ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానటుడు గురించి కొన్ని విషయాలు..🌹 👉తెలుగు సినిమా రంగం లోనే కాదు బహుశా మొత్తం భారతీయ సినిమా రంగంలోనే ఎస్వీ రంగారావు పోషించినన్ని వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించిన నటులు అరుదు. దాదాపు అన్ని ఫిలిం బానర్లలో నటించి మెప్పించిన నటుడు మరొకరు కనిపించడు. జానపద, పౌరాణిక, సాంఘిక, కౌబారు, హాస్య సినిమాల్లో విలక్షణం పాత్రల్ని పోషించి మెప్పించిన నటుడు కూడా ఎస్వీఆరే. ఎలాంటి పాత్రలో నయినా సరిగ్గా ఒదిగిపోయి తను కాకుండా పాత్రనే ప్రతి ఫలింపచేసిన నటుడాయన. తన గంభీరమయిన గొంతుతో ఆయా పాత్రలకు, సన్నివేశాలకే కాదు మొత్తంగా సినిమాకే ఒక స్థాయి కల్పించిన అద్భుతమయిన నటుడు ఎస్‌.వి. రంగారావు. నాటకాల పైన ఆసక్తి, అనుభవం తప్ప ఎక్కడా ఎలాంటి నట శిక్షణ లేకుండానే తన అవగాహనతో పాత్రల ఔచిత్యాన్ని అర్థం చేసుకున్న ఎస్వీఆర్‌ తను నటించిన ప్రతి పాత్రకూ జీవం పోశాడు. సహజ నటనగా అందరూ పిల్చుకునే 'మెథడ్‌ ఆక్టింగ్‌'కి పర్యాయ పదంగా నిలిచాడు.@శ్రీనివాస్@ 👉భారతీయ సినిమా తొలినాళ్ళలో ఇలాంటి మెథడ్‌ ఆక్టింగ్‌కి ప్రముఖ హిందీ నటుడు దిలీప్‌ కుమార్‌ ప్రసిద్ధుడు. ఆయ...