Posts

Showing posts from June, 2021

నేడు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి..

Image
@శ్రీనివాస్@ గుండమ్మ కథ,బాల భారతం, నర్తనశాల,పాండవ వనవాసం లాంటి అపురూప చిత్రాల దర్శకులు "కమలాకర కామేశ్వరరావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. కమలాకర కామేశ్వరరావు 1911, అక్టోబర్ 4 న బందరులో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించాడు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించాడు. కృష్ణా పత్రికలో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి...

వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు... 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు.  ఆ రోజుల్ని బట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరపు పెద్దలు. ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవి గారు. రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమె కూడా ఆ చర్చల్లో పాల్గొనేవారుట. మధ్యతరగతి మహిళల జీవితాల్లోని ఆటుపోట్లను అక్షరీకరించిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆవిడ.. ఛాయాదేవి డెభ్భైకుపైగా కథలు, యాత్రారచనలు, సాహిత్య వ్యాసాలు, నవలలు రచించారు. కుటుంబంలో ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షను ఎత్తిచూపుతూ ఆమె రాసిన ‘బోన్సాయ్‌ బ్రతుకు’ కథను 2000వ సంవ్సతరంలో పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా బోధించడం విశేష...

సుప్రసిద్ధ రచయిత,తెలుగు వారందరికీ సుపరిచితులు "ముళ్లపూడి వెంకటరమణ" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ సుప్రసిద్ధ రచయిత,తెలుగు వారందరికీ సుపరిచితులు "ముళ్లపూడి వెంకటరమణ" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్‌ కీపర్‌. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజింగ్‌ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత...

నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి.. ఆమె గురించి కొన్ని విషయాలు.. విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె సినీ నటుడు నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు.ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2...

నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త  "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. కాళ్ళకూరి నారాయణరావు… సుప్రసిద్ధ నాటక కర్త… సంఘ సంస్కర్త… ప్రథమాంధ్ర ప్రచురణకర్త… జాతీయవాది… ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు… ‘మహాకవి’ బిరుదాంకితుడు… ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు.తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ...

నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "రాహుల్‌ దేవ్‌ బర్మన్‌" గారి జయంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹🎼నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "రాహుల్‌ దేవ్‌ బర్మన్‌" గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు..🎼🌹 👉రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అదే... ‘ఆర్‌.డి. బర్మన్‌’ అంటే చాలు... హిందీ సినిమాల్లో యువతరాన్ని వెర్రెత్తించే పాటలు గుండెల్లో మార్మోగుతాయి. ఆయన స్వరపరచిన ప్రతి గీతం నాటికీ, నేటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. మూడు దశాబ్దాల పాటు హుషారైన పాటలెన్నో స్వరపరిచిన ఈయన దాదాపు సుమారు 331 చిత్రాలకు బాణీలను సమకూర్చారు. ఆర్డీ బర్మన్‌ ముద్దు పేరు ‘పంచందా’ (చిన్నప్పుడు ఆయన ఏడిస్తే స్వరం పంచమం స్థాయిలో ఉండేదని) అలా పిలిచేవారట. ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌ కుమారుడు. కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త, గాయకుడు. పాటల్ని ‘డిస్కో’, ‘రాక్‌’ వంటి కొత్తపుంతలను తొక్కించి భారతీయ సినిమా రంగాన్ని ఓలలాడించాడు. తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల చిత్రాలకూ సంగీతాన్ని అందించారు. వైవిధ్య భరితంగా సీసాలతో, వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో కూడా సంగీతాన్ని సృష్టించారు. తండ్రి ఎస్‌డీ బర్మన్‌ వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. బె...

నేడు "సాక్షి రంగారావు" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ కామెడీ విలన్, కమెడియన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ "సాక్షి రంగారావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్ , వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు.  ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి. జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’ సినిమాలో సాక్షి రంగారావు క్యారెక్టర్‌కు టిపికల్ మేనరిజం పెట్టారు. గంటకు 15...

రంగస్థల నటులు, వైద్యులు శ్రీ ముక్కామల అమరేశ్వరరావు గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ రంగస్థల నటులు, వైద్యులు శ్రీ ముక్కామల అమరేశ్వరరావు గారి జయంతి నేడు... ముక్కామల అమరేశ్వరరావు ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక సంస్థ నిర్వాహకుడు. ఇతడు 1917, జూన్ 27వ తేదీన భద్రాచలం సమీపంలో వున్న చోడవరం గ్రామంలో సీతారామమ్మ, సుబ్బారావు దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ముక్కామల సుబ్బారావు కూడా ప్రముఖ నటుడు. ఇతని తమ్ముడు ముక్కామల కృష్ణమూర్తి ప్రముఖ సినీనటుడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం సత్తెనపల్లి, అవనిగడ్డ, జగ్గయ్యపేట, తాడిపత్రిలలో జరిగింది. ఆ తరువాత గుంటూరు ఎ.సి.కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆ తరువాత 1941లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్.పట్టా పొందాడు. 1958 వరకు గుంటూరు గవర్నమెంటు ఆసుపత్రిలో స్పెషలిస్టుగా సేవలందించాడు. గుంటూరులోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతని వద్ద వైద్యసేవలనందుకుని స్వస్థత పొందిన ప్రముఖులలో అద్దంకి శ్రీరామమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, నండూరి సుబ్బారావు, తురగా పుండరీకాక్షుడు, మందపాటి రామలింగేశ్వరరావు మొదలైన వారు ఉన్నారు. ఇతనికి చదుకునే రోజుల నుండే నాటకాలలో నటించడానికి ఆసక్తి ఉండేది. తాడిపత్రిలో విద్యార్థిగా ఉన్నప్ప...

స్వరాల రాయుడు "రమేష్‌ నాయుడు" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ అద్భుత సంగీతాన్ని తెలుగు సంగీత ప్రియులకు పంచిన సంగీత దర్శకులు స్వరాల రాయుడు "రమేష్‌ నాయుడు" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. పసుపులేటి రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్‌ 3, 1987) 1970వ, 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి. రమేష్ నాయుడు 1933లో కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16 యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం బంద్వల్ పహీజా అనే మరాఠీ చిత్రం. ఈయన తెలుగు చిత్రరంగానికి సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం తరువాత మనోరమ (ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రెండు పాటలు పాడించారు) లాంటి ఒకటి ర...

నేడు ప్రముఖ నటుడు "ఉదయ్ కిరణ్" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటుడు "ఉదయ్ కిరణ్" గారి జయంతి.. ఆ కళ్లల్లో కోటి కాంతుల వెలుగులు.. నవ్వుల్లో కొండంత ఆత్మవిశ్వాసం.. నవ్వితే పడే బుగ్గ సొట్టల్లో ఎంతమంది అమ్మాయిల మనసులు నలిగిపోయాయో చెప్పలేం. అతి చిన్న వయసులోనే మోయలేని స్టార్డమ్. సినిమా సినిమాకు పెరుగుతున్న అభిమానులు, క్రేజ్.. అంతలోనే కొందరు పెద్దాళ్లున్నారే.. అతని జీవితంలోకి వచ్చారు.. వెళ్లిపోయారు.. వాళ్లు రావడానికి వెళ్లడానికి మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.. కానీ ఆ తర్వాత ఉదయ్ జీవితంలో ఒడిదుడుకులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకూ నడిసంద్రంలా ఉన్నవాడు కాస్తా.. ఎగిసి పడే కెరటంలా అయిపోయాడు.. ఆ కెరటం తీరం దాటి ఏడేళ్లు అయిపోయింది. ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి. చిత్రం.. ఈ సినిమాతోనే చిత్రంగా వచ్చాడు ఉదయ్. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా మనసంతా నిండి ఉన్న సినిమాపై ప్రేమతో పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏం చేయాలన్నా విజయమే కీలకం కదా. ఆ విజయం అతనికి తొలి సినిమాతోనే వచ్చింది. చిత్రంతో ఓవర్ నైట్ యూత్ లో పెద్ద స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్. ఇది అతను ఊహించనిది..ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమ కూడా ఊహించలేదు. కానీ ఊహించనివి జరగడమే కదా ...

నేడు ప్రముఖ నటి "శారద" గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటి "శారద" గారి పుట్టినరోజు.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆమె గురించి కొన్ని విషయాలు.. తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. మూడుసార్లు ఉత్తమనటిగా జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న అరుదైన నటి శారద. ఊర్వశి శారదగా ప్రాచుర్యం పొందిన ఆమె తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఉత్తమ నటి జాతీయ పురస్కారాలు ఊర్వశి పేరుతోనే డిజైన్‌ చేయడంతో, ఆ పురస్కారాల్ని ఎక్కువసార్లు అందుకొన్న ఆమె ఊర్వశి శారదగానే వినతికెక్కారు. 1945లో తెనాలిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి దేవి. ఆమె అమ్మమ్మ మద్రాసులో ఉండటంతో అక్కడే శారద బాల్యం గడిచింది. ఆరేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టారు. తల్లి ప్రోత్సాహంతోనే నాటక, సినమా రంగాల్లోకి అడుగుపెట్టారు. చిత్ర పరిశ్రమలో అప్పటికే సరస్వతి పేరుతో పలువురు నటీమణులు ఉండటంతో, శారద అనే నామకరణంతో సినీ ప్రయాణం ఆరంభించారు. 1955లో ‘కన్యాశుల్కం’లో చిన్...

కదిలే మేఘమా..

Image
 @శ్రీనివాస్@ స్వరమాంత్రికుడు ఎం.ఎస్. విశ్వనాథన్ గారి జయంతి సందర్భంగా ఆయన స్వరపరిచిన ఈ ఆణిముత్యం వినండి.. కదిలే మేఘమా.. చిత్రం : లైలా సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు పల్లవి :  ఉ హూ హూ... హూహూహూ ఆహాహా... ఆ... హా... హా .. ఆ.. ఆ ఏహె ఏహె.. ఒహో హో హో హో లలల లాలల లా.. హాహాహా హా హా కదిలే మేఘమా.. కవితా రాగమా కాళిదాస కమనీయ భావనా గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా కదిలే మేఘమా.. కవితా రాగమా కాళిదాస కమనీయ.. భావనా గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా చరణం 1 : నీ గగనవాణి.. ఎగిసిపోనీ శృతులుగా.. నా నవ్యగీతాలలో... నా నవ్యగీతాలలో నీ చెలితవేణీ.. కులికి పోనీ జతులుగా... నా భావనాట్యాలలో... నా భావ నాట్యాలలో ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా కదిలే మేఘమా.. కవితా రాగమా కాళిదాస కమనీయ.. భావనా గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా  చరణం 2 : నా కనులలోన.. కలలవానా కురిసినది నీ కన్నె పరవళ్ళతో...  నీ కన్నె పరవళ్ళతో నా మనసులోన విరహవీణ పలికినది నీ నీలి కన్నీళ్ళతో...  నీ నీలి కన్నీళ్ళతో అణువణువూ నినదించే...  అనురాగ సంకేతమా అణువణువూ నినదించే...

నేడు సంగీత మాంత్రికుడు "ఎం.ఎస్.విశ్వనాథన్" గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎼నేడు సంగీత మాంత్రికుడు "ఎం.ఎస్.విశ్వనాథన్" గారి జయంతి🎼🌹 👉సంగీ‌త‌మ‌నేది మాన‌వు‌డికి భగ‌వం‌తుడు ప్రసా‌దిం‌చిన వరం.‌ ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావా‌ల‌కైనా అద్దం‌ప‌ట్టేది సంగీ‌తమే.‌ వేదాలు కూడా సంగీత స్వరాలే.‌ రాళ్లను కూడా కరి‌గించే గాంధర్వం సంగీతం.‌ సంగీతం సాధిం‌చ‌లే‌నిది ఏదీ లేదు.‌ ఎందు‌కంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక.‌ రాగం, తాళం, స్వరం సమ్మి‌ళి‌త‌మై‌న‌ప్పుడు శ్రావ్య‌మైన సంగీతం ఉద్భ‌వి‌స్తుంది.‌ అటు‌వంటి సంగీ‌తా‌నికి శాశ్వ‌త‌త్వాన్ని అందిం‌చిన స్వర్ణ‌యు‌గపు సంగీత సామ్రాట్‌ ‌‘‌‘ఎమ్మెస్‌’‌’‌ అని అభి‌మా‌నంగా పిలి‌పిం‌చు‌కున్న కళా‌మ‌తల్లి కంఠా‌భ‌రణం ఎమ్మెస్‌ విశ్వ‌నా‌థన్‌.‌ జూన్‌ 24, 1928న కేర‌ళలో జన్మిం‌చిన ఎమ్మెస్‌ పన్నెండు వందల సిని‌మా‌లకు పైగా అద్భు‌త‌మైన సంగీ‌తాన్ని అందిం‌చిన కలై‌మా‌మణి.‌ @శ్రీనివాస్@ 👉విశ్వ‌నా‌థన్‌ సంగీ‌తంలో కని‌పిం‌చని ఆక‌ర్షణ ఏదో వుంది.‌ కాలం‌తో‌బాటు ఎమ్మెస్‌ తన సంగీత పంథా కూడా మార్చు‌కు‌న్నారు.‌ యువ‌త‌రాన్ని ఆక‌ర్షిం‌చ‌గ‌లి‌గారు.‌ అలా‌గని క్లాసి‌కల్‌ టచ్‌ని విడ‌నా‌డ‌లేదు.‌ తెలుగు సినీ రంగ విష‌యా‌నికి ...

నేడు దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ తెలుగు చిత్రసీమ వెలుగును దశదిశలా ప్రసరింపచేసిన అరుదైన  దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన  ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు. ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఊరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్ల...

నేడు గణేష్ పాత్రో గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ కుటుంబ అనుబంధాలను ఎంతో హృద్యంగా అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించే ప్రత్యేక కథా రచయిత గణేష్ పాత్రో గారి జయంతి నేడు... బాల్యం నుంచి కథలు రాయడం, నాటకాల్లో నటించడం అలవరచుకున్న గణేష్ పాత్రో స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీ పురం.. 1945 జూన్ 22న ఆదిలక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ దంపతులకు 17 మంది సంతానంలో పెద్ద వాడు గణేష్‌పాత్రో. ఈయన అసలు పేరు వేహ్రా సత్య గణ గంగ పోలీసు వెంకటరమణ మహా పాత్రో. బీఏ పట్టదారుడైన ఆయనకు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే చిత్ర రంగంలోకి వచ్చారు. నాటకాలు రాయడం, నటించడంపై మక్కువ చూపించే గణేష్ పాత్రోకు ప్రముఖ రంగ స్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు నటన కంటే రచనలపై దృష్టి సారించాలని సలహా ఇవ్వడంతో పలు కథలను రచించారు. పావల, కొడుకు పుట్టాల, ఆలోచించండి వంటి పలు నాటకాలను ఆయన రచించారు. తొలి నాటకం కొడుకు పుట్టాలకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఈ నాటకం పలు భాషల్లో అనువాదం అయింది. రేడియోల్లోనూ ప్రసారం అయింది. గణేష్ పాత్రో సినీ రంగ ప్రస్తానం 1965లో మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాన...

నేడు "అమ్రీష్‌పురి" గారి జయంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹నేడు విలక్షణ నటుడు "అమ్రీష్‌పురి" గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు..🌹 👉ఆకట్టుకునే ఆహార్యం... గంభీరమైన గొంతు... కళ్లలో కనిపించే క్రౌర్యం... కలిస్తే అమ్రీష్‌పురి. ప్రతినాయకుడి ప్రాతలో విలక్షణమైన విలనీని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. అమ్రిష్‌ పురి పూర్తి పేరు అమ్రిష్‌లాల్‌ పురి. హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తమిళ్, ఆంగ్లం వంటి భాషల్లో దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. ఫిలింఫేర్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. అమ్రీష్‌పురి సోదరులు కూడా నటులే. మదన్‌పురి, చమన్‌ పురిలు అమ్రీష్‌ కంటే ముందే నటులుగా నిలదొక్కుకున్నారు. వారిలా నటుడుగా మారాలనే అమ్రీష్‌ పూరి జలంధర్‌ నుంచి ముంబై వెళ్లాడు. మొదటి ప్రయత్నంలోనే కెమెరా ముందు పరీక్షలో విఫలం అయ్యాడు. దీంతో ముంబైలోనే ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటక ప్రదర్శనలిస్తూ నటనలో శిక్షణ పొందాడు. ‘సంగీత్‌ నాటక్‌ అకాడమీ’ అవార్డును 1979లో మొదటిసారి సొంతం చేసుకొన్నాడు. ‘ప్రేమ్‌ పూజారి’ చిత్రంతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ‘మేరీ జంగ్‌’తో మంచి గుర్తింపు తెచ...

నేడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ సహజ నటనతో వెండితెర మీద తనదైన ముద్ర వేసిన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి వర్ధంతి నేడు... రమణమూర్తి 1933 మే 20న శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం లుకులాం అగ్రహారంలో జన్మించారు. మొత్తం ఆరుగురు సంతానంలో ఈయన నాలుగోవారు. శంకరాభరణం చిత్రంలో శంకరశాస్త్రిగా చిరకీర్తి సంపాదించుకున్న జె.వి.సోమయాజులు ఈయనకు స్వయానా అన్నయ్య. రమణమూర్తికి చిన్ననాటి నుంచే నాటకాలమీద ఆసక్తి ఏర్పడింది. విజయనగరంలోని మహారాజా కళాశాలలో బీఎస్సీ చదువుతున్న రోజుల నుంచి నాటకాల్లో నటించడం, దర్శకత్వం వహించడం ప్రారంభించారు. తర్వాత తన అన్న సోమయాజులు, మరికొందరితో కలిసి ‘నటరాజ కళాసమితి’ స్థాపించారు. ‘ఎన్జీవో, కాళరాత్రి, దొంగాటకం, ఎవరు దొంగ?, కప్పలు, కీర్తిశేషులు, కాటమరాజు కథ’ లాంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. కన్యాశుల్కం నాటకం నిడివి ఎక్కువగా ఉండటంతో అప్పట్లో ఒక అంకాన్నే పదర్శిస్తూ ఉండేవారు. రమణమూర్తి భావం చెడకుండా ఎనిమిది గంటల ఆ నాటకాన్ని గంట నిడివికి కుదించారు. తొలిసారి 1953 ఏప్రిల్‌లో విజయనగరంలో కన్యాశుల్కం నాటకం వేశారు. అప్పటి నుంచి 1995 సెప్టెంబరు వరకు 42 ఏళ్ల పాటు ‘నటరాజ కళాసమితి’ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని దేశమం...

నేడు పరుచూరి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా..

Image
 నేడు పరుచూరి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా..

మొదలయ్యే హృదయం సవ్వడి.. గర్భాన తొలిగా..

Image
 @శ్రీనివాస్@ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా.. సర్వం తాళ మయం... చిత్రం : సర్వం తాళమయం (2019) సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : రాకేందు మౌళి గానం : హరిచరణ్ మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా గర్వాల ఆటే ఆడి ఆగేనే తుదిగా గగనాలే ఘర్జించేనూ తలబడితే మేఘాలే సంద్రాలే హోరెత్తేనూ కలబడితే అలలే దేహం ప్రాణం ఆడే క్షణం ఈ విశ్వం తాళ మయం సర్వం సర్వం తాళ మయం ఈ విశ్వం తాళ మయం తాళం లేక ఏది జగం మొలిచేటీ రెక్కల్లో పిలిచేనీ తాళం జలజలజల జారే కొండల ధ్వనిలోని చలనం గలగలగల పారే నదుల ధ్వనిలోని గమనం కుహుకుహు కూసే కోయిల ధ్వనిలోని మధురం కిలకిలకిల ఊగే కొమ్మల ధ్వనిలోని తన్మయం దేహం ప్రాణం ఆడే క్షణం ఈ విశ్వం తాళ మయం సర్వం సర్వం తాళ మయం ఈ విశ్వం తాళ మయం తాళం లేక ఏది జగం పిపీలికం సరాల నడకే వింటే స్వరతాళం కదా మొగ్గే తుంచి తేనే జుర్రేసే భ్రమరాల సడి తాళం వేయ్ రా నేల మేళాన మోగించే వాన నాట్యం చేసే చిటపట చినుకె నీలో నిప్పు చప్పుళ్ళే అవి నువ్వు నేనూ కాలాన్ని తాళం జన్మించాం కలసిన లయలో జీవించాం కల్లల లయలో థై థై థై దిథై లయలో తై తై తై.. తి త త ఈ విశ్వం తాళ మయం సర్వం సర్వం తాళ మయం ఈ విశ్వం తాళ మయం తాళం లేక ఏది జగం మొదలయ్యే హృదయ...

నేడు ప్రముఖ సినీ రచయిత "పరుచూరి వెంకటేశ్వరరావు" గారి పుట్టినరోజు..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 💐✍నేడు ప్రముఖ సినీ రచయిత "పరుచూరి వెంకటేశ్వరరావు" గారి పుట్టినరోజు.. ఆయన గురించి కొన్ని విషయాలు..✍💐 👉పరుచూరి సోదర ద్వయంలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూడా పరుచూరి వెంకటేశ్వరరావుని అగ్రజా అని పిలుస్తుంటారు. తెలుగు సినిమా కథల్ని, మాటని కొత్త పుంతలు తొక్కించిన ఘనత పరుచూరి సోదరులది. రచయితలకి స్టార్‌ హోదా తీసుకొచ్చారు. పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా.. దర్శకుడిగా, నటుడిగా కూడా తనదైన ముద్రని వేశారు. నాటక రంగం నుంచి వచ్చిన ఈయన 1978లో ‘చలిచీమలు’తో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 33 యేళ్ల కాలంలో మూడు తరాలు నటించిన 333 చిత్రాలకి పనిచేసి సరికొత్త రికార్డుని సృష్టించారు. ఈ ద్వయం చేసిన చిత్రాల సంఖ్య ఇప్పుడు 350కిపైనే. తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ రెవల్యూషనరీ రైటింగ్‌లో దిట్ట కాగా... పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం అందుకు భిన్నంగా భావోద్వేగాలు ఉట్టిపడేలా లోతైన భావాలతో రచన చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందిన పరుచూరి వెంకటేశ్వరరావు, ఏజీ ఆఫీసులో సెక్షన్‌ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందారు. ఈయన గన్నవరం తాలూకా మ...

నేడు ప్ర‌పంచ సంగీత దినోత్స‌వం

Image
 @శ్రీనివాస్@ జూన్ 21న ప్ర‌పంచ సంగీత దినోత్స‌వం లేదా వ‌ర‌ల్డ్ మ్యూజిక్ డే ప్ర‌తి ఏడాది జూన్ 21న ప్ర‌పంచ సంగీత దినోత్స‌వాన్ని ప్రప‌ంచ దేశాల‌న్ని ఘ‌నంగా జ‌రుపుకుంటాయి. ప్రపంచంలో సంగీతానికి ఉన్న శక్తి దేనికీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. పాప్, రాక్, వెస్ట్రన్, జానపదం పేర్లు వేరైనా వాటిలో ఉన్న గొప్పదనం సంగీత ప్రియులకే తెలుస్తుంది. మూడు అక్షరాలున్న ఈ సంగీతం యొక్క శక్తి మాటల్లో చెప్పలేనిది. రాగం, తానం,పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. కాలాన్ని మరపించి, మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం. మన దేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉంది. భారత దేశం సంగీత దేశం. అయితే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేహం లేదు. మనిషిని కదిలించే, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం,విషాద సమయాల్లో సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీ...

నేడు జంధ్యాల గారి వర్ధంతి..

Image
 నేడు జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా..

నేడు జంధ్యాల గారి వర్ధంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ "జంధ్యాల (జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి) గారి వర్ధంతి.. ఆయనను గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు🌹 👉తెలుగు తెరకు శ్రుతి‌మిం‌చని హాస్యంతో చక్క‌లి‌గిలి పెట్టి, ప్రేక్ష‌కుల హృద‌యా‌లలో గిలి‌గిం‌తలు రేపిన ‌‘హాస్య‌బ్రహ్మ’‌ జంధ్యాల! ‌‘‌‘మాటలు రాయ‌డ‌మంటే మాటలు కాదు’‌’‌ అని నమ్మి, హాస్యా‌నికీ.‌.‌.‌ అప‌హా‌స్యా‌నికి మధ్య ఉన్న సున్ని‌త‌మైన రేఖను గమ‌నించి సంభా‌ష‌ణా‌శ్రయ హాస్యాన్ని సృష్టిం‌చ‌డంలో పేరు‌పొం‌దిన పద‌హా‌ర‌ణాల తెలుగు రచ‌యిత, దర్శ‌కుడు జంధ్యాల! 👉జననం : జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి జనవరి 14 , 1951 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం 👉మరణం : జూన్ 19 ,2001 హైదరాబాదు 👉మరణ కారణము : గుండె పోటు 👉ఇతర పేర్లు : జంధ్యాల 👉ప్రసిద్ధి : తెలుగు సినిమా రచయిత, దర్శకుడు 👉ఇంటి‌పే‌రుతో ప్రసి‌ద్ధు‌డైన జంధ్యా‌లను మీ అసలు పేరే‌మిటి.‌.‌.‌ అని ఎవ‌రైనా అడి‌గితే ఆయన చెప్పే సమా‌ధానం ఆయ‌న‌లోని సహ‌జా‌త‌మైన హాస్య‌దృ‌క్ప‌ధా‌నికి నిద‌ర్శనం.‌ ‌‘‌‘నేను రామా‌నా‌యుడి సిని‌మాకు పని‌చే‌సే‌ట‌ప్పుడు నా పేరు జంధ్య...

కలకానిది.. విలువైనది..

Image
 @శ్రీనివాస్@ శ్రీ శ్రీ గారి వర్ధంతి స్మృతిలో.. కలకానిది.. విలువైనది.. చిత్రం :  వెలుగు నీడలు  సంగీతం :  పెండ్యాల గీతరచయిత :  శ్రీశ్రీ నేపథ్య  గానం :  ఘంటసాల  పల్లవి : కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు  చరణం 1 : గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే దానీ వదలివైతువా ఓ.. ఓ.. ఓ.. చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు  చరణం 2 : అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి.. కలవరించనేల ఓ.. ఓ.. ఓ.. సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో కలకానిది.. విలువనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు  చరణం 3 : అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ.. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ.. ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం కలకానిది.. విల...

నేడు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍️నేడు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి✍️🌹 👉మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస రావు. వీరు ఏప్రిల్ 30వ తేదీన 1910వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ. శ్రీరంగం సూర్యనారయాణకు దత్తత వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో పూర్తి చేశారు. 1925లో ఎస్ఎస్ఎల్సి పాసైనారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. 1931లో మద్రాస్ ‌విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తి చేశారు. 1935లో విశాఖలోని ఎవిఎస్ ‌కాలేజీలో అధ్యాపకులుగా చేరారు. 1938లో మద్రాసు, ఆంధ్రప్రదేశ్లో సబ్ ఎడిటర్గా చేరారు. తరువాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద, ఆంధ్రావాణి పత్రికలో వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంలో ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన పుస్తకం ‘మహాప్రస్తానం’. ఆయన 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ ఎన్నో ర...

తీయ తీయని కలలను కనడమే..

Image
@శ్రీనివాస్ @ తీయ తీయని కలలను కనడమే.. Movie   :  Sreeram Lyrics   :  Kulasekhar Music   :  R P Patnaik Singers:  Bombay Jayashri తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో తీయ తీయని ...

‘అమ్మోరు’ ఘనత అదే...

Image
 @శ్రీనివాస్@ ‘అమ్మోరు’ ఘనత అదే... ఫలానా చిత్రంలో గ్రాఫిక్స్‌ అదిరిపోయింది.. తెలుగు సినిమా హాలీవుడ్‌ స్థాయిని తలపించింది.. ఇటీవలే ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. 90ల్లోనే ఈ ఘనతను సాధించింది ‘అమ్మోరు’ చిత్రం. సౌందర్య ప్రధాన పాత్రలో దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. రమ్యకృష్ణ, సురేశ్‌, రామిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎస్‌ ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని కొత్త ప్రపంచాన్ని చూపించింది. కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమాజరీ (సీజీఐ) వినియోగించిన తొలి భారతీయ చిత్రమిదే. బ్రిటిష్‌ సాంకేతిక నిపుణులు పనిచేశారు. 1995 నవంబరు 23న విడుదలైంది ఈ చిత్రం. (1993లో శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మేన్‌’లో కొద్దిమేర మాత్రమే గ్రాఫిక్‌ ఉపయోగించగా ‘అమ్మోరు’కోసం పూర్తి స్థాయిలో వినియోగించారు.)

శ్రీకరమౌ శ్రీరామ నామం...

Image
@శ్రీనివాస్ @ శ్రీకరమౌ శ్రీరామ నామం... చిత్రం::శ్రీరామాంజనేయ యుద్ధం సంగీతం::K.V..మహాదేవన్  రచన::ఆరుద్ర గానం::P.సుశీల,B.వసంత తారాగణం::N.T.రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,B.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ. పల్లవి:: శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ చరణం::1 దధిక్షీరమ్ములకన్నా ఎంతో మధుర మధుర నామం సదా శివుడు ఆ రజతాచలమున సదా జపించే నామం కరకుబోయ తిరగేసి పలికినా కవిగా మలచిన నామం రా..మరా..మరామ..రామ రామ..రామ..రామ..రామ కరకుబోయ తిరగేసి పలికినా కవిగా మలచిన నామం రాళ్లు నీళ్లపై చీల్చిన నామం రక్కసి గుండెల శూల..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ చరణం::2 వేయి జపాల కోటి తపస్సుల విలువ..ఒక్కనామం..మ్మ్ నిండుగ దండిగ వరములొసంగే రెండక్షరముల..నామం ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం చల్లని నామం మ్రోగే చోట చెల్లదు..మాయాజాలం రామ..రామ..రామ..సీతా రామ..రామ..రామ..రామ రామ..రామ..రామ..సీతా రామ..ర...

నా గొంతు శృతిలోనా..

Image
@శ్రీనివాస్ @ నా గొంతు శృతిలోనా.. చిత్రం: జానకిరాముడు (1988) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు, చిత్ర పల్లవి: హా తానానె తననానా ఆ..... నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా... ఆ...నా గుండె లయలోనా చరణం 1: ఒక మాట పదిమాటలై అది పాట కావాలనీ ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలనీ అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలనీ కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ.... పాడవే.. పాడవే.. కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా...ఆ.. నా గుండె లయలోనా చరణం 2: ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ ప్రతిరేయి పసిపాపనై నీ ఒడినీ చేరాలనీ కోరికే ఒక జన్మ కావాలనీ అది తీరకే మరు జన్మ రావాలనీ కోరికే ఒక జన్మ కావాలనీ అది తీరకే మరు జన్మ రావాలనీ వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలనీ... పాడవే.. పాడవే.. కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మల...

ఈ అందానికి బంధం వేశానొకనాడు...

Image
@శ్రీనివాస్ @ నేడు జె.వి.రాఘవులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతిలో.. ఈ అందానికి బంధం వేశానొకనాడు... చిత్రం: జీవనతరంగాలు (1973) సంగీతం: జె.వి. రాఘవులు గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈ నాడు ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈ నాడు చరణం 1: నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను ఊహూ ఊహూ హూ హూ హూ నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు చెరలాయెను ...నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను... ఊహూ ఊహూ హూ హూ హూ ఈ అందానికి బంధం వేసానొకనాడు... ఆ బంధమే నాకందమైనది ...ఈ నాడు చరణం 2: నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్రధనస్సే విరిసింది ఏడు రంగుల ముగ్గులు వేసి ...నింగీ నేలను కలిపింది ప్రేమకు పెళ్ళే చేసింది ... ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమే నాకందమైనది ...ఈ నా...

నేడు జేవీ రాఘవులు గారి వర్ధంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹🎼ఘంటసాల గారికి ప్రియశిష్యుడు అయిన జేవీ రాఘవులు  గారి వర్థంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🎼🌹 👉‘జననీ జన్మ భూమిశ్చ...’, ‘అది ఒకటో నెంబరు బస్సు...’, ‘వీణ నాది.. తీగ నాది... తీగ చాటు రాగముంది’, ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ, ఎంతవరకీ బంధమూ’... ఈ పాటల్ని తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. రాబోయే తరాలు కూడా పాడుకొనే పాటలు ఇవి. వీటి సృష్టికర్త ఎవరో కాదు... ఘంటసాల ప్రియశిష్యుడైన జె.వి.రాఘవులు. ఇప్పుడు ఆపాత మధురాలు అనిపించే అనేక పాటల వెనక ఉన్న సంగీత దర్శకుడు జేవీ రాఘవులు. ఘంటసాల, కె.వి.మహదేవన్, ఎం.ఎస్‌.విశ్వనాథన్, రామానాయుడు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ తదితరుల చిత్రాలకి సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పనిచేసిన వ్యక్తి. గాయకుడిగా వంద సినిమాలకి, సంగీత దర్శకుడిగా 172 సినిమాలకి పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో పుట్టిన జేవీ రాఘవులు విజయవాడ రేడియో స్టేషన్‌లో లలిత గీతాలు పాడి ప్రాచుర్యం పొందారు. అక్కడే ఆయన ఘంటసాల దృష్టిలో పడ్డారు. మద్రాసు రావాలనుకొంటే నా దగ్గరికి వచ్చేయమంటూ ఆయనకి అడ్రస్‌ ఇచ్చి వెళ్లారట ఘం...

నేడు సినీ నిర్మాత "రామనాయుడు" గారి జయంతి..

Image
 @🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​@ 🌹ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన మహామనిషి "రామనాయుడు" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు గుర్తకు చేసుకుందాం..🌹 👉తళుకు బెళుకుల సినిమా రంగంలోకి ఎందరో వస్తుంటారు.. మరెందరో కనుమరుగైపోతుంటారు. కానీ అతి కొద్దిమందే ఆ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి, ఆఖరు క్షణం వరకు దాని బాగోగుల కోసం తపిస్తారు. అజాతశత్రువుగా, అందరికీ తలలో నాలుకగా పేరు తెచ్చుకుంటారు. సమకాలీన తెలుగు సినిమా రంగంలో ఆ గౌరవం దక్కించుకున్న వ్యక్తి... దగ్గుబాటి రామానాయుడు. సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయినీ తిరిగి సినిమా రంగానికే వెచ్చించిన కొద్దిమంది సిసలైన సినిమా వ్యక్తుల్లో రామానాయుడు ఒకరు. మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినా వ్యక్తిగత పరిశ్రమ, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చనేదానికి ఆయనే ఉదాహరణ. 👉నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సినీపంపిణీదారుగా, ప్రదర్శకుడిగా, సేవాకార్యక్రమ నిరతుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక కోణాలున్నాయి రామానాయుడు గారికి. రామనాయుడు గారి జీవిత గమనం తొలి నుంచీ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన పుట్టింది ప్రకాశం జిల్లా కారంచేడులో.. 1936 జూన్ 6న...