‘అమ్మోరు’ ఘనత అదే...

 @శ్రీనివాస్@

‘అమ్మోరు’ ఘనత అదే...



ఫలానా చిత్రంలో గ్రాఫిక్స్‌ అదిరిపోయింది.. తెలుగు సినిమా హాలీవుడ్‌ స్థాయిని తలపించింది.. ఇటీవలే ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. 90ల్లోనే ఈ ఘనతను సాధించింది ‘అమ్మోరు’ చిత్రం. సౌందర్య ప్రధాన పాత్రలో దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. రమ్యకృష్ణ, సురేశ్‌, రామిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎస్‌ ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని కొత్త ప్రపంచాన్ని చూపించింది. కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమాజరీ (సీజీఐ) వినియోగించిన తొలి భారతీయ చిత్రమిదే. బ్రిటిష్‌ సాంకేతిక నిపుణులు పనిచేశారు. 1995 నవంబరు 23న విడుదలైంది ఈ చిత్రం. (1993లో శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మేన్‌’లో కొద్దిమేర మాత్రమే గ్రాఫిక్‌ ఉపయోగించగా ‘అమ్మోరు’కోసం పూర్తి స్థాయిలో వినియోగించారు.)

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..