Posts

Showing posts from January, 2022

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..

Image
 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ 🌹చలనచిత్ర యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి నేడు... ఆ మహానటున్ని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు మీకోసం..🌹 👉అతనిలా నటించగల విలక్షణ నటుడు ప్రపంచంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాల్లో అతడు నటించని పాత్రలేదు. భీష్ముడు, సుయోధనుడు, రావణుడు, భీముడు, కర్ణుడు వంటి పాత్రల్ని హీరోచిత పాత్రలుగా మలిచి ఆ పాత్రల గొప్పతనాన్ని ప్రేక్షకులకు పంచిన ఆదర్శనటుడాయన. తేజస్సు మూర్తీభవించిన స్ఫురద్రూపి. ఆయన రూపమే సమ్మోహనాకారం... అది ఒక గ్రీకు శిల్పం. చిత్రసీమలో ఆయన ఒక సంచలనం. ‘‘పుణ్యపురుషులు యుగానికొకరే పుడతారు’’ అన్నట్లు మన చలనచిత్ర యుగానికి ఆయనే యుగపురుషుడు.... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన అందరినీ సంభోంధించేది ‘‘బ్రదర్‌’’ అని కానీ అందరికీ ఆయనే పెద్దన్న. రాజకీయంలో బడుగు జీవులకు ఆపధ్బాంధవుడు. తిరుమల - తిరుపతి సందర్శించే భక్తజనకోటికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసిన అన్నపూర్ణుడు.@శ్రీనివాస్@ 👉పౌరాణికం.. జానపదం.. సాంఘికం... పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంల...

నేడు హాస్య బ్రహ్మ "జంధ్యాల" గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎞️🎥"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చెప్పిన హాస్య బ్రహ్మ "జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🎥🎞️🌹 👉జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్‌’ రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్‌ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా బహుమతి లభించింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పత్రికలకు కథలు రాసి చిరు పారితోషికాలు కూడా అందుకున్న ఘనుడు. స్కూలు ఫైనల్‌ చదువుతుండగా ‘ఆత్మాహుతి’ అనే నాటకం రాశాడు. అదే జంధ్యాల తొల...

తెలుగువారి అందాలనటుడు "శోభన్ బాబు" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ తెలుగువారి అందాలనటుడు  "శోభన్ బాబు" గారి జయంతి నేడు... తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా...డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో... ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. వెండితెర అభిమన్యుడు శోభన్ బాబు జయంతి సందర్భంగా ఒక్కసారి అందమైన జ్నాపకాల్లోకి వెళ్దాం. శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. ఎన్.టి.ఆర్ హీరోగా చేసిన దైవబలంలో శోభన్ బాబు ఓ చిన్న పాత్ర ధరించారు. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీ...

🌹🎞️నేడు రావుగోపాలరావు గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు🎞️🌹

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎞️నేడు రావుగోపాలరావు గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు🎞️🌹 👉రావు గోపాలరావు.. నట విశ్వరూపంతో విలనిజానికే వన్నె తెచ్చిన లెజెండరీ నటుడు. విలనిజానికి వినోదాన్ని జోడించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఘనుడు. నటనకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకునే విశాల హృదయుడిగా ప్రజల మదిలో నిలిచిన రావుగోపాలరావు జయంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్న రావుగోపాలరావు 1937 జనవరి 14న కాకినాడ సమీపంలోని గంగనపల్లి గ్రామంలో జన్మించారు. మొదట బొమ్మలు గీసే ఆర్టిస్టుగా కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. సాహిత్యంపై మక్కువతో పుస్తక ప్రియుడిగా మారారు. శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి రచనల స్ఫూర్తితో సాహిత్య కళల సమాహారంగా పలు నాటకాలు రాశారు. ఆయన నాటకాలన్నీ సామాజిక ఇతివృత్తంతోనే ఉండటం విశేషం.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉'అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా' కాంపెనీని స్థాపించి తన స్నేహితులతో కలిసి నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. 'కీర్తిశేషులు' అనే నాటకం వేసి బాగా...

తెలుగు వారి సీతమ్మ "అంజలీదేవి" గారి వర్ధంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ తెలుగు వారి సీతమ్మ "అంజలీదేవి" గారి వర్ధంతి నేడు... తన నటనా జీవితాన్ని 8 సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై ప్రారంభించిన అంజలీ దేవి 1947లో గొల్లభామ సినిమాతో చిత్రపరిశ్రలో అడుగుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్ట్ 27న జన్మించిన అంజలీదేవి  అసలు పేరు అంజనీకుమారి. మంచి నర్తకి కూడా అయిన అంజలీదేవి 28 హిందీ, 11 తమిళ సినిమాల్లో నటించారు.  తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషలలో దాదాపు  500 సినిమాలలో నటించారు. వాటిలో 400 వరకు హీరోయిన్గానే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు  పి. ఆదినారాయణ రావును ఆమె వివాహం చేసుకున్నారు.  తెలుగు సినిమా ఉత్సదశలో ఉండగా అంజలీదేవి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. లవకుశ చిత్రంలోని సీత పాత్ర ద్వారా మంచిగుర్తింపు పొందారు. ఈ సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా ఆమె రాష్ట్రపతి గోల్డ్మెడల్ అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకు అంజలీదేవి గుర్తుకు వస్తారు. పౌరాణిక పాత్రలలో ముఖ్యంగా సీతగా, రుక్మిణిగా ఆమె నటన అద్భుతం. ఆమె హీరోయిన్గా నటించిన బాలరాజు, అనార్కలి, కీలుగుర్రం, లక్ష్మమ్మ కథ, స్వర్ణసుందరి, రక...

నేడు "ఏ ఆర్ రెహమాన్" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🎼🎙💐ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు "రెహమాన్" గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు💐🎙🎼 💐HAPPY BIRTHDAY RAHMAN GARU..💐 👉జన్మ నామం : ఏ.ఎస్. దిలీప్ కుమార్ 👉ఇతర పేర్లు : ఎ.ఆర్. రెహ్మాన్  👉రంగం :  సినిమా సంగీతం, నాటక సంగీతం, ప్రపంచ సంగీతం  👉వృత్తి  :  కంపోజర్, సంగీత దర్శకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్, గాయకుడు, వాయిద్యకారుడు, అరేంజర్, ప్రోగ్రామర్  👉వాద్యపరికరం :  కీబోర్డు 👉క్రియాశీల కాలం : 1992 – ప్రస్తుతం 👉వెబ్‌సైటు :  ఎ.ఆర్.రహ్మాన్.కామ్ 👉రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీ...