Posts

Showing posts from December, 2021

నేడు ప్రముఖ నటుడు "జగ్గయ్య" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటుడు "జగ్గయ్య" గారి జయంతి.. కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1926 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు.గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచారు. నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే ఆ నాటి పార్కుల్లో ఉన్న రేడియోల దగ్గరకు జనం గుమి కూడేవారు. ఇప్పటికీ ఆ ముచ్చట గురించి ఆ నాటి జనం చెప్పుకుంటారు. ఇక చిత్రసీమలో జగ్...

నేడు పీపుల్స్ స్టార్ "ఆర్.నారాయణ మూర్తి" గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు పీపుల్స్ స్టార్ "ఆర్.నారాయణ మూర్తి" గారి పుట్టినరోజు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో... R.Narayana Murthy: తెలుగు తెరకు ఆదర్శాల ఇజాన్ని అద్ది.. జీవితంలో అదే నిజమని ఎగసిపడుతున్న ‘ఎర్ర సముద్రం’! సిద్ధాంతాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. వినేవారికి కూడా అబ్బో అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడానికి మాత్రం వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఆదర్శాలు వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం వాటికి చాలా దూరం ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే.. తీసే సినిమాల్లో ఎన్నో ఆదర్శాలు.. అద్భుతాలు.. చితికిన జీవితాలు.. అభ్యుదయ భావాలు.. ఇలా ఎన్నైనా తెరమీద ఒలకపోసేసి.. ప్రజల నుంచి ఆహా ఓహో అనిపించుకుని కాసులు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం ఒక్క ఆదర్శమూ ఆచరణలో కనిపించదు. చాలా అరుదుగా మాత్రమే ఈ రంగుల ప్రపంచంలో నేనున్నాను అంటూ దండోరా వేసుకుంటూ ఒకడు వస్తాడు. స్వతంత్ర భారతంలో ఎర్రదండును తీసుకుని రైతు రాజ్యం కోసం ఛలో అసెంబ్లీ అంటూ పీపుల్స్ వార్ కి లాల్ సలామ్ చేసి.. దానినే జీవన మార్గంగా మార్చుకుని తెర ముందూ.. వెనుకా.. ఒకేలా ఉం...

నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి.. సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే... నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించింది ఆమె... ఆమె ఎవరో కాదు మహానటి "సావిత్రి" గారు... నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె స్మృతి లో కొన్ని విషయాలు.. తాను ఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి చేరారు సావిత్రి గారు... నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పోటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వరరావు గారు... ఆమె అందమైన కళ్ళు కూడా అద్భుతమైన అభినయాన్ని చూపిస్తాయి. ఆమె నవ్వు పండు వెన్నెలలను కురిపిస్తాయి. ఆమె అందమైన ముఖం చంద్రబింబాన్నేతలపిస్తుంది. నటనలో తిరుగులేని మహానటి ఆమె. ఆ నటీ శిరోమణి ఎవరో కాదు మన తెలుగు ఆడ పడుచు సావిత్రి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సావిత్రి ఒక్కరే మహానటి. ఆమె మాత్రమే ఆ బిరుదులు, కితాబులకు సరితూనే నటీమణి అని చెప్పకతప్పదు.ఆమె ఇప్పటికీ తెలుగు తెర మీద సజీవంగానే కనీపిస్తుంది. ఎన్నో పాత్రలతో అలరిస్తుంది. సావిత్రి 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ లోని చిర్రావూరులో జన...

నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి వర్ధంతి.. మరపురాని భానుమతి! పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకొని వచ్చి పట్టం కట్టడం కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఈ నాటి ప్రకాశం జిల్లా దొడ్డవరంలో 1925 సెప్టెంబర్ 7న భానుమతి జన్మించారు. బాల్యం నుంచీ భానుమతి చాలా చురుగ్గా ఉండేవారు. ఇట్టే పద్యగద్యాలను అప్పచెప్పేవారు. ప్రౌఢకావ్యాలనైనా అవలీలగా వల్లించేవారు. ఇక చిన్నతనంలోనే సొంతగా రచనలు కూడా చేసేవారు. అందుకు కారణం ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య అనే చెప్పాలి. “కంటే కూతుర్నే కనాలిరా… మనసుంటే మగాడిలా పెంచాలిరా…” అంటూ ఈ నాడు పాటలు పాడుకో...

నేడు అమర గాయకుడు మహ్మద్ రఫీ గారి జయంతి…

Image
 నేడు అమర గాయకుడు మహ్మద్ రఫీ గారి జయంతి…     ‘ఏ దునియా ఏ మహెఫిల్ మేరే కామ్ కీ నహీ..’ ‘సుహానీ రాత్ ఢల్ చుకీ.. నాజానే తుమ్ కబ్ ఆవోగీ..’ వంటి మధురుమైన పాటలు.. సుమధుర గానం వినగానే గుర్తుకు వచ్చే పేరు  కీ.శే. మహ్మద్ రఫీ. బాలీవుడ్ ప్రముఖ పేర్లలో ఈయన పేరు వుంటుంది. తెలుగులో కూడా తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరించారు ఆ మహా గాయకుడు. ‘నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది’ వంటి ప్రజాదరణ పొందిన తెలుగు పాటలు పాడారు రఫీ. ఆయన గానానికి దేశంలోని అన్నీ భాషల్లో అభిమానులు వున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి 17 భాషల్లో ఆయన పాటలు పాడారు. ఇప్పటికీ ఆయన పాటలు రేడియోలో కమ్మగా పలకరిస్తాయి. 1950 నుంచి 1970 మధ్యకాలం మహ్మద్ రఫీ కాలం అని చెప్పొచ్చు. ఆయన లేకపోయినా ఆయన పాటలు అజరామరంగా నిలిచిపోతాయి. రఫీకి ముందు, తరువాత ఎందరు గాయకులు ఉన్నా, వచ్చినా ఆయన గాత్రంలోని మాధుర్యం ఆకట్టుకున్న తీరేవేరు. ఆయన పాటకు ఫిదా కానివారు లేరు. అలాంటి మహా గాయకుడి పుట్టినరోజు నేడు. 24 డిసెంబర్ 1924లో పంజాబ్‌లోని కోట్లా సుల్తాన్ పూర్‌లో జన్మించారు ఆయన. 31 జూలై 1980 లో మరణించారు.ఆయన తెలుగులో పాడిన సినిమాలు.. భక్త రామదాసు, భ...

నేడు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత "ఆదుర్తి సుబ్బారావు" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత "ఆదుర్తి సుబ్బారావు" గారి జయంతి.. తెలుగు సినీరంగంలో దిగ్దర్శకులను వేళ్లపై లెక్కించవచ్చు. వారిలో అగ్రభాగాన నిలుస్తారు ఆదుర్తిగా విఖ్యాతుడైన ఆదుర్తి సుబ్బారావు.  ఆదుర్తి రాజమహేంద్రవరంలో 1912 డిసెంబర్‌ 16న సత్తన్నపంతులు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య రాజమహేంద్రవరంలో, ఉన్నత విద్య కాకినాడలో జరిగింది. ముంబైలోని సెయింట్‌ గ్జేవియర్స్‌ కళాశాలలో మూడేళ్లపాటు ఫొటోగ్రఫీకోర్సు నేర్చుకున్నారు. ముంబైలో బొంబే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాసెసింగ్, ప్రింటింగ్‌ డిపార్టుమెంట్లలో పని చేసి వాటిపై అవగాహన పెంచుకున్నారు. ఉదయశంకర్‌ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘కల్పన’కు సహాయదర్శకునిగా ఆదుర్తి సినీరంగంలో కాలుమోపారు. ఆ చిత్రానికి ఎడిటర్‌ కూడా ఆయనే. అలా తెలుగువాడైన ఆదుర్తి సినీ ప్రస్థానం హిందీ చిత్రరంగంతో ప్రారంభమైంది. తెలుగులో ‘బాలానందం’ సినిమాకు సహాయదర్శకునిగా పనిచేశారు. ‘అమరసందేశం’ ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. అయితే అప్పట్లో అది పెద్ద విజయం సాధించలేదు. కానీ ఆదుర్తిలోని విషయజ్ఞత గుర్తించి అన్నపూర్ణ సంస్థ ఆయనకు ...

నేడు ప్రముఖ సినీ కళా దర్శకులు "తోట తరణి" గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ సినీ కళా దర్శకులు "తోట తరణి" గారి పుట్టినరోజు.. ఒత్తుగా పెరిగిన రింగు రింగుల జుట్టు... చుట్టుపక్కల వాతావరణాన్ని నిశితంగా గమనించే లోతైన కళ్ళు... మాటల కన్నా చేతిలోనే కుంచెతోనే ఎక్కువగా భావ వ్యక్తీకరణ చేస్తూ, ఎప్పుడూ దీక్షగా పనిలో మునిగిపోయి కనిపించే కళా దర్శకుడు తోట తరణిని చూస్తే, అచ్చంగా దీక్ష పట్టిన మహర్షిలాగానే ఉంటారు. తోట తరణి ఒక ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత.సుమారు 100 సినిమాలకు పైగా కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు. తోట తరణి స్వస్థలం బందరు. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహత్మ్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర ప్రఖ్యాత సినిమాలకు ఆయనే కళాదర్శకుడు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. తరణికి ఐదేళ్ళ వయసు నుండే కళారంగం మీద ఆసక్తి మొదలైంది. కాగితం దొరికితే ఏదో ఒక బొమ్మలు గీస్తుండే వాడు. ఆయన చదువుకూడా...

నేడు ప్రముఖ నటి "షావుకారు జానకి" గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటి "షావుకారు జానకి" గారి పుట్టినరోజు.. 90 వసంతాలు చూసిన షావుకారు జానకి! సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత సాహసం అనే చెప్పాలి. ఇక నటిగానూ తనదైన బాణీ పలికిస్తూ మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ మెప్పించారు జానకి. జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టి.వెంకోజీరావు, తల్లి సచీదేవి. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం అస్సాములో ఉన్నారు. అక్కడే జానకి విద్య సాగింది. తరువాత జానకి 14 ఏళ్ళ ప్రాయంలోనే మద్రాసు చేరారు. అప్పట్లో అక్కడి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్ గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని నాటకాల్లోనూ ఆమె నటించారు. కొంత...

నేడు "గొల్లపూడి మారుతీరావు" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు సినీ నటుడు, రచయిత, విలేఖరి, వ్యాఖ్యాత "గొల్లపూడి మారుతీరావు" గారి  వర్ధంతి.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు.. అవధుల్లేని మహా ప్రవాహం ఆయన జీవన పయనం. అనంతమైన మహా సముద్రం ఆయన అనుభవ సారం. అనేక అధ్యాయాల.. అసంఖ్యాక ప్రకరణాల ఉద్గ్రంథం ఆయన ప్రతిభాసామర్థ్యం. సామాన్య కుటుంబాన జన్మించి.. అక్షర సేద్యంలో రాణించి.. ఆపై అనేక రంగాల్లో అసమాన నైపుణ్యం చూపించారు. గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్ధిజీవులకు ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే నాగభూషణం లాంటి విలన్‌ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల, సినీ రచయితగా అనేక పాత్రలు పోషించారు.1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి విద్యార్థిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగంలోకి దూకేశారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. నాటక రచయితగా కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు.  మారుతీరావు పూర్తి పేరు వెంకట సూర్య మ...

నేడు 'రజనీకాంత్' గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు రజనీకాంత్ గారి పుట్టినరోజు నేడు...💐 💐Happy Birthday Rajani garu..💐 👉ఆరడుగుల అజానుబాహుడేమీ కాదాయన. ఆరు పలకల దేహం అంతకంటే చూపించలేడు. ఒక బక్క పలచటి రూపం. కానీ ఆ రూపానికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు. ఒక చిన్న మేనరిజమ్‌ ప్రదర్శిస్తే చాలు... అంతా పులకరించిపోతారు. ఎంతమంది స్టార్లు పుట్టుకొచ్చినా... తెరపై ఎవరెన్ని విన్యాసాలు చేసినా స్టైల్‌ అంటే మాత్రం గుర్తుకొచ్చేది ఒక్కరే. ఆయనే... రజనీకాంత్‌. దశాబ్ధాలుగా స్టైల్‌కి, ప్రత్యేకమైన మేనరిజమ్‌కీ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు రజనీ. ‘నాన్నా... పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’, ‘బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే’, ‘ఆ దేవుడు శాశించాడు, అరుణాచలం పాటిస్తాడు’, ‘నా దారి రహదారి...’ - ఇలాంటి సంభాషణలతో బాక్సాఫీసుని హోరెత్తించారు రజనీకాంత్‌. భారతదేశంలోనే కాదు... ఇతర దేశాల్లోనూ ఆయనకి అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తోందంటే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే రజనీకాంత్‌కి ఉన్న ఇమేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన అసలు పేరు శివా...

నేడు ప్రముఖ నటుడు "నూతన్ ప్రసాద్" గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹నేడు ప్రముఖ నటుడు "నూతన్ ప్రసాద్" గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు🌹 👉దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... నూటొక్క జిల్లాలకి అందగాడిని... దేవుడో దేవుడా... వంటి తన మార్క్‌ సంభాషణలతో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడు నూతన్‌ప్రసాద్‌. హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా, సహ నటుడిగా పలు రకాల పాత్రల్లో ఒదిగిపోయి తన శైలిని చాటుకొన్న నటుడీయన. ఎంతోమంది నటులకి గాత్రం కూడా అందించారు. నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు తడినాధ వరప్రసాద్‌. 1945, డిసెంబరు 12న కృష్ణాజిల్లా, కైకలూరులో జన్మించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘అందాల రాముడు’ చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత ‘నీడలేని ఆడది’లో నటించారు. కానీ ఈయనకి మంచి గుర్తింపు అంటే ‘ముత్యాల ముగ్గు’లో రావు గోపాలరావుతో కలిసి నటించిన ప్రతినాయక పాత్రతోనే లభించింది. ఆ తరువాత వరుసగా ఆ తరహా పాత్రలే లభించాయి. తనదైన శైలిలో సంభాషణల్ని పలకడం, ప్రతినాయక పాత్రలకి హాస్యంతో వన్నె అద్దం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి తదితర అగ్ర కథాన...

నేడు సావిత్రి గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ అలనాటి అందాల తార, చీర కట్టుకే అందాన్ని అద్దిన సినీ సితార “మహానటి సావిత్రి” గారి జయంతి నేడు... కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి, వెండితెరకి మహారాణి, నటనకు శిరోమణి అయిన ఓ బంగారు బొమ్మ సినీ జగతిలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఒక అందం అద్భుతమై కొన్ని దశాబ్దాలుగా వెండితెర వేలుపు అయితే ఆ అద్భుతం సావిత్రమ్మే. బయోపిక్ గా మారి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ విజయం ‘అమ్మాడి’ అయ్యుంటుంది. ఈనాటికి ఎందరి కలల లోనో ఆమె మహారాణి. ఆనాటి వారిని కదిలిస్తే మా సావిత్రి ఒక అద్భుతమేనమ్మా మీకేమి తెలుసు ఆ పసితనం వీడని బంగారు బొమ్మని చూడడానికి థియేటర్ లకు ఎన్నిసార్లు వెళ్లుంటామో అని మనసు నిండుగా ఆస్వాదిస్తూ ఆమె కబుర్లే. కళ్ళతోనే అభినయించిన ఏకైక వెండి తెర అభినేత్రి మహానటి సావిత్రి. అమాయకత్వం, ప్రేమ, దయ ఏకకాలంలో కురిపించే నేత్రాలు సావిత్రమ్మవి. ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన “దేవత”లో ఆమె నటన వర్ణనాతీతం. మహనీయుల్ని మర్చిపోలేము ఏ రంగం లో అయినా. అందర్నీ అలరించే సినీ...

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి.. తన గానామృతంతో ఆబాలగోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడే ప్రతి ఒక్కరి మనసును తాకుతాడు. జీవితంలో అనేక కష్టనష్టాను చవిచూసి, ఒక్కో మెట్టు ఎదిగి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయక దిగ్గజం 4 డిసెంబర్ 1922లో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో తెలుగు బ్రాహ్మణులలో వెలనాటి వైదిక అర్చక కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి సూర్యనారాయణ ఘంటసాలను భుజాలపై ఎక్కించుకుని భజన కార్యక్రమాలకు, భక్తి సంగీత కచేరీలకు తీసుకుని వెళ్లేవాడు. తండ్రి ఆ కచేరీలలో పాటలు పాడుతుండగా ఘంటసాల అందుకు అనుగుణంగా నాట్యం చేసేవారు. ఆ నాట్యానికి అందరూ ముగ్ధులై ప్రశంసిస్తూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ కన్ను మూశారు. ఘంటసాల పెద్ద సంగీత విద్వాంసుడు కావాలని సూర్యనారాయణ కోరిక. కానీ తండ్రి మరణంతో ఆ కుటుంబం తల్లి రత్తమ్మ తమ్ముడైన ర్యాలీ పిచ్చయ్య వద్దకు చేరింది. తాను సంగీత విద్వాంసుడు కావా...