Posts

Showing posts from September, 2021

ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు...

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : 1895 సెప్టెంబరు 28 గుంటూరు జిల్లా వినుకొండ 👉మరణం : 1971 జూలై 24 (వయసు 75) గుంటూరు 👉నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ 👉వృత్తి : రచయిత , కవి , సాహితీకారుడు 👉సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి 👉తండ్రి : వీరయ్య 👉తల్లి : లింగమ్మ 👉గుర్రం జాషువా జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు.జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు 19వ శతాబ్ధపు ప్రమ...

నేడు బాలీవుడ్ నైటింగేల్ "లతా మంగేష్కర్" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐🎙ఆ గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆ గొప్ప గాయణి.. బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్ గారు.. ఆమె పుట్టిన రోజు నేడు.. ఆమె గురించి కొన్ని విషయాలు🎙💐 💐🎙HAPPY BIRTHDAY LATHAMMA..🎙💐 👉జన్మనామం : లతా మంగేష్కర్ 👉జననం : 1929 సెప్టెంబరు 28 (వయస్సు: 89  సంవత్సరాలు) ఇండోర్, మధ్యప్రదేశ్ 👉ప్రాంతము : మహారాష్ట్ర 👉సంగీత రీతి : హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము 👉వృత్తి : గాయని 👉వాయిద్యం : నేపథ్య గాయిని 👉క్రియాశీలక సంవత్సరాలు : 1942 - ప్రస్తుతము 👉తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో.. ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తర...

నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ..

Image
 @శ్రీనివాస్@ నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ.. సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ బాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించారాయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ.  తండ్రి హరికథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగి...

ఏ జన్మదో ఈ సంబంధమూ..

Image
@శ్రీనివాస్ @ ఏ జన్మదో ఈ సంబంధమూ.. చిత్రం:: రక్షణ సంగీతం:: కీరవాణి రచన:: వేటూరి గానం:: కీరవాణి,చిత్ర పల్లవి:: ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగామో ఈ సంగీతమో మనసే కోరే..మాంగళ్యం తనువే పండే..తాంబూలం  ఈ ప్రేమ యాత్రలో..ఓఓ ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం::1 ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యెళ్ళ తీపి బంధం మా ఇంటి లోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం::2 లతలు రెండు విరులు ఆరై విరిసె...బృందావని కళలు పండి వెలుగులాయె కలిసి...వున్దామని వేశంగి..మల్లె చిలకే సీతఅంగి వేళ చినుకై హేమంత సిగ్గులోలికి కవ్వింతలాయె కలతే ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలిదో..ఓ ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగామో ఈ సంగీతమో మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం  ఈ ప్రేమ యాత్రలో.. ఓఓ ఏ జన్మదో ఈ సంబంధమూ

టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు..

Image
 @శ్రీనివాస్@ టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు.. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఎనలేని సేవలు.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు.. కాసాని ఈశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో "ఈశ్వర్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు.పోస్టర్‌ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది. ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వచ్చింది. పాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్ధాంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్ద పెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారు.ఆయన భార్య పేరు వరలక్ష్మి. వీరికి ఇద్దరు ...

నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, మహానటుడు, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా..🌹 👉అక్కినేని నాగేశ్వరరావు (సెప్టెంబర్ 20, 1923 - జనవరి 22, 2014) ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరైన అక్కినేని ధర్మపత్ని సినిమాతో సినీజీవితం ప్రారంభించారు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ సహా జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించారు.   అన్నపూర్ణతో అక్కినేని వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. 1944లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు.1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు....

నేడు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ గారి జయంతి.. కర్ణాటక సంగీత ఝరి..ఎన్నటికీ వాడని మల్లెల సౌరభ సంగీత సుగంధం..ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతుంది. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. ప్రముక కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబర్ 16న మధురై జన్మించింది ఈ మధుర గాంధర్వ కళాకారణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ఆమె ఆహార్యం ఎన్నటికీ మరువరానిది. నుదుటిని కుంకుమతో..తలలో ఎప్పుడూ మల్లెపూలతో గొంతెత్తి పాడుతున్న ఆమె ఆహార్యం భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది. 11 డిసెంబర్ 2004లో చెన్నై కన్నుమూశారు సుబ్బులక్ష్మి. తమిళనాడు మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది సుబ్బులక్ష్మి. చిన్నారి సుబ్బులక్ష్మిని ఆమె తల్లి ముద్దుగా కుంజమ్మ అని పిలుచుక...

ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..

Image
 @శ్రీనివాస్@ ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన.. ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన.. మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు.అంతే! మళ్లీ సాయంత్రం. ఫ్రెష్ష్‌గా స్నానం చెయ్యడం.ధవళ వస్త్రాలు ధరించడం.. సిగరెట్ వెలిగించడం. ‘‘ఎందాకా వచ్చాం?’’ ‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’ ‘‘మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా! ఆ మొదలు దొరకడం లేదు.’’ ‘‘ఓ మాట అనండి!’’ ‘‘వేడి కాఫీ చెప్పు!’’ ‘‘మాట అనమంటే ఇదా!’’ ఇలా వుంటుంది ఆయన ధోరణి. పాట పూర్తికాదు. గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి. ‘‘పాట’’ పుట్టదు. హోటలుకి అద్దె పెరిగిపోతుంది. ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు. సరిగ్గా ఇలా జరిగింది, పద్మశ్రీ పి పుల్లయ్యగారి ముర...

నేడు మనసు కవి "ఆచార్య ఆత్రేయ" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు మనసు కవి "ఆచార్య ఆత్రేయ" గారి వర్ధంతి.. "ఒకరికిస్తే మరలి రాదు... ఓడిపోతే మరచిపోదు... గాయమైతే మాసిపోదు... పగిలిపోతే అతుకుపడదు..."- అంటూ మనసును, దాని తీరును ఆచార్య ఆత్రేయ అలతి అలతి పదాల్లో అందరికీ అర్థమయ్యేలా వివరించారు... అంత బాగా మరొకరు పదబంధాలను పేర్చలేరేమో అనిపిస్తుంది!... పులకించని మదిని సైతం పులకింపచేసే గానాన్ని మనకు అందించి పరవశింప చేశారు ఆత్రేయ... మనసు భాష తెలిసిన కవి ఆత్రేయ... మనసు మూగది అని అందరూ అంటూ ఉంటారు... కానీ, ఆ మనసుకూ ఓ భాష ఉంటుందని పామరుని చేత కూడా పలికించగల సత్తా ఆత్రేయ కలానికే ఉందని నిరూపించారు... ఆ మూగమనసు భాషను ఆత్రేయ పలికించిన తీరు ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది...   'మనసుకు తెలిసిన భాష' ఎలాంటిది?... ఓ మనసును మరో మనసుతో ముడివేసే శక్తి ఆ భాషకే ఉందని ఆత్రేయ భావన... ఇంతకూ మాటలు రాని మనసు నేర్చిన భాష ఎలాంటిది అంటే అక్కడా తనదైన చమత్కారం చూపించారు ఆత్రేయ... అదే మన మనసుల్ని తాకి తడి చేస్తూ ఉంటుంది...   మనసు భాష మౌనమేనని తేల్చారు ఆత్రేయ... అయితే ఆ మౌనం ఎన్నెన్నో విధాలుగా సాగుతూ ఉండడమే విచిత్రం... మనసు గమనాన్ని సైతం తన ప...

నాలుగు పదుల ‘ముద్దమందారం’

Image
 @శ్రీనివాస్@ నాలుగు పదుల ‘ముద్దమందారం’ (సెప్టెంబర్ 11తో ‘ముద్దమందారం’కు 40 ఏళ్ళు) మాటల రచయితగా పలు పదవిన్యాసాలతో ఆకట్టుకున్నారు జంధ్యాల. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణలు పలికించి జనానికి సంతోషం పంచిన జంధ్యాల ‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం’వంటి కళాత్మక చిత్రాలకూ పండితపామరుల ఆకట్టుకొనే రచన చేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి, దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ‘ముద్దమందారం’ చిత్రం రూపొందింది. తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారానే ప్రదీప్, పూర్ణిమ జంటను చిత్రసీమకు పరిచయం చేశారు జంధ్యాల. 1981 సెప్టెంబర్ 11న ‘ముద్దమందారం’ విడుదలై విజయం సాధించింది. ‘ముద్దమందారం’ కథ విషయానికి వస్తే – ఓ పెద్దింటి అబ్బాయి, పేదింటి పిల్లను ప్రేమిస్తాడు. ఆ అబ్బాయి తండ్రేమో మరో ధనవంతురాలయిన అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తే కోట్లు వస్తాయని ఆశిస్తాడు. ఇది తెలిసిన ప్రేమజంట ఎగిరిపోతుంది. ఓ ఊరిలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని హీరో, హీరోయిన్ తాతకు ఉ...

నేడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యానారాయణ గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యానారాయణ గారి జయంతి.. తెలుగు సాహిత్యరంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, చరిత్ర సృష్టించిన ఎందరో మహానుభావులు వున్నారు. కేవలం తెలుగుసాహిత్యానికే తమ జీవితాన్ని అంకితం చేసినవారు కూడా ఎందరో వున్నారు. అయితే విశ్వనాథ సత్యానారాయణను ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన చేపట్టని సాహిత్యప్రక్రియ అంటూ ఏదీ లేదు... కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు.. ఇలా అన్నింటిలోనూ ఆయన పాండిత్యం, ప్రతిభలు జగమెరుగినవి. అందువల్లే.. 20వ శతాబ్దంలో ఆంధ్రసాహిత్యానికి ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి ఆయనే పెద్ద దిక్కుగా భావిస్తారు. అంతెందుకు.. తెలుగు అభ్యుదయ కవి అయిన శ్రీశ్రీ కూడా విశ్వనాథను ‘‘మాట్లాడే వెన్నముక’’గా వర్ణించారు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈయన.. కవి సామ్రాట్ బిరుదును పొందారు. జీవిత చరిత్ర : 1895 సెప్టెంబరు 10వ తేదీన కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో నివాసమున్న శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు విశ్వనాథ జన్మించారు. ఈయన భార్య వరలక్ష్మమ్మ....

నేడు ప్రముఖ సంగీత దర్శకులు "చక్రవర్తి" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ సంగీత దర్శకులు "చక్రవర్తి" గారి జయంతి.. ఆకాశపు దారులెంట హడావుడిగా పరుగెత్తే సంగీతాన్ని భూమార్గం పట్టించిన సంగీత దర్శకుడు ఆయన. తెలుగు సినిమా పాటను.. ఉర్రూతలూగించి.. పరుగులెత్తించి.. శాసించి.. రికార్డింగ్ డాన్సు చేయించిన స్వర చక్రవర్తి. స్వర సామ్రాజ్యాన్ని నిజంగానే చక్రవర్తిలా ఏలారు చక్రవర్తి.. ఆయన జయంతి సందర్భంగా ఆయన సుస్వరాల సంగీతం ఒక సారి గుర్తు చేసుకుందాం. సప్తస్వరాలు ఏడే ఉంటాయి. కానీ వాటికి స్పష్టమైన గమకాలివ్వడం ఎండాకాలం ఎడారిలో పరుగెట్టినంత కష్టం.. అలాంటిది వాటితో సరసాలాడగలిగిన చాతుర్యం ఆయన సొంతం.. అలాగే సయ్యాటలాడగలిగేంతటి సాహసం ఆయనకు ఉందనడమూ అంతే నిజం.. అంతెందుకు వాటితో అహోరాత్రాలను గడిపిన అనుభవమూ ఓ తియ్యటి వాస్తవం.. ఒక్కమాటలో చెబితే, చక్రవర్తి రాగ రాజ్యాన్నేలిన రారాజు.. ఒకే ఏడాది 66 సినిమాలకు బాణీలు కట్టిన ఘనత చక్రవర్తిది. ప్రపంచంలో మరే సంగీత దర్శకుడు అందుకోలేని అరుదైన రికార్డది. ఒక పుష్కరకాలమంతా తెలుగునాట చక్రవర్తి రికార్డులే మారుమోగాయి. ఎన్టీఆర్ స్టెప్పులకు.. జయమాలిని చిందులకు ఆయన బాణీలే టానిక్ లా పని చేశాయి. చిరంజీవి వేగానికి.. కొత్త తరం దూక...

నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతి గారి జయంతి నేడు... చిత్రపరిశ్రమలో కేవలం నటిగానే కాకుండా... నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని వంటి అన్నిరంగాల్లో రాణించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది భానుమతి రామకృష్ణ! సత్తా వుంటే ఆడవాళ్లు కూడా ఏమైనా సాధించవచ్చుననే నమ్మకాన్ని కలిగింది. తమ ప్రతిభను నిరూపించుకోవడంలో మహిళలు కూడా పురుషులకంటే ఏమాత్రం తక్కువేమీ కాదని మాటలతోనే కాదు.. చేతలతో కూడా చేసి నిరూపించిన మహిళ! తాను నటించిన ఎన్నో చిత్రాల్లో హీరోలతోపాటు సమానంగా అన్ని సన్నివేశాల్లో నటించి.. ‘‘అన్ని కళలు తెలిసిన ఓ ధీర వనిత’’గా పేరు సాధించారు. జీవిత చరిత్ర : 1925వ సంవత్సరంలోని సెప్టెంబర్ నెలలో ప్రకాశం జిల్లా, ఒంగోలులో భానుమతి జన్మించింది. ఆమె తండ్రి పేరు బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. ఆయన శాస్త్రీయ సంగీత ప్రియుడు - గొప్ కళావిశారదుడు కూడా! తన తండ్రి వద్దనుంచే భానుమతి కూడా సంగీతాన్ని అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబంలో పెరిగినప్పటికీ.. ఆమె తన 13వ ఏటలోనే 1939లో విడుదలైన ‘‘వరవిక్రయం’’ అనే సినిమాలో నటించింద...