ఏ జన్మదో ఈ సంబంధమూ..
@శ్రీనివాస్@
ఏ జన్మదో ఈ సంబంధమూ..
చిత్రం:: రక్షణ
సంగీతం:: కీరవాణి
రచన:: వేటూరి
గానం:: కీరవాణి,చిత్ర
పల్లవి::
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే..మాంగళ్యం
తనువే పండే..తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో..ఓఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
చరణం::1
ఒకరి కోసం ఒకరు చూపే
మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం
వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం
వెయ్యెళ్ళ తీపి బంధం
మా ఇంటి లోన పాదం
పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన
పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ
చరణం::2
లతలు రెండు విరులు ఆరై
విరిసె...బృందావని
కళలు పండి వెలుగులాయె
కలిసి...వున్దామని
వేశంగి..మల్లె చిలకే
సీతఅంగి వేళ చినుకై
హేమంత సిగ్గులోలికి
కవ్వింతలాయె కలతే
ఈ పూల రుతువంత
ఆ తేటి దో ఈ తోట మాలిదో..ఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే.. మాంగళ్యం
తనువే పండే.. తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో.. ఓఓ
ఏ జన్మదో ఈ సంబంధమూ
Comments
Post a Comment