Posts

Showing posts from August, 2021

నేడు "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి  "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి నేడు... ఆ సాహితీవేత్త గురించి కొన్ని విషయాలు.. తెలుగువారి కళాసాహిత్య సంగీత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన అపురూప కళారూపం హరికథ. కేవలం ఒక్క కళాకారుడు సంగీత, సాహిత్య, నృత్య, అభినయ కళాభినివేశంతో మృదంగం, వయోలిన్‌ వాద్య సహకారంతో శ్రోతలను ఆధ్యాత్మిక, కళాసాగరంలో ఓలలాడించే ఈ కళారూప సృష్టికర్త శ్రీనారాయణదాసు. ఒకనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో 1864 ఆగస్టు 31న ఆదిభట్ల జన్మించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన బలిజపేట మండలంలోని అజ్జాడ ఆయన జన్మ స్థలం. తను జన్మించిన అజ్జాడ గ్రామనామాన్ని తన పేరులో ఇముడ్చుకుని ఆ గడ్డను ధన్యం చేసిన మహనీయుడు. ఆదిభట్ల వేంకటచయనులు, లక్ష్మీనరసమాంబలు తల్లితండ్రులు. వంశపారంపర్యంగా అబ్బిన సంస్కృతీ సంప్రదాయాల వలన చిన్ననాటినుంచి అరుదైన సంగీత జ్ఞానమబ్బింది. భక్తి భాగవత కీర్తనలతోనే బాల్యం ప్రారంభమైంది. ఆ సంగీత సాహిత్య జ్ఞానంతోనే కేవలం 19వ ఏటనే తొలి హరికథా గానం చేసిన సంగీతజ్ఞుడు. తల్లి...

నేడు బాపు గారి వర్ధంతి..

Image
 కొంటెబొమ్మల బాపు గారికి వర్ధంతి నివాళి 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, రమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్...

నేడు ఆరుద్ర గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర  గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : ఆగస్టు 31, 1925 విశాఖపట్నం 👉మరణం : జూన్ 4, 1998 👉మరణ కారణము : మూత్ర పిండాలు పనిచేయక 👉ఇతర పేర్లు : భాగవతుల సదాశివశంకర శాస్త్రి 👉వృత్తి : కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు 👉మతం : హేతువాది 👉భార్య / భర్త : కె.రామలక్ష్మి 👉రచయిత అన్నాక అక్షరం మీద పట్టు ఉండటం సహజమే! అందుకే కొందరు రచయితలు సాహిత్యానికి సంబంధించిన చాలా ప్రక్రియలలో అడుగుపెడుతూ ఉంటారు. కొండొకచో విజయాన్నీ సాధిస్తుంటారు. కానీ సాహిత్యంలో సవ్యసాచిలా ఎడాపెడా తన ప్రాభవాన్ని చూపగలిగే ప్రతిభ అతికొద్దిమందికే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అలాంటివారి గురించి చెప్పుకునే సందర్భం వస్తే బహుశా ఆరుద్రతోనే ఆరంభించాలేమో!@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉ఆరుద్ర శ్రీశ్రీతో పోటీపడుతూ విప్లవకవితలు రాశాడు; ‘త్వమేవాహం’తో దాశరథికి దీటుగా నిజాం అకృత్యాలను ఎండగట్టాడు; ...

నేడు ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు💐 💐Happy birthday Sumalatha garu..💐 👉సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా  నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ  మరియు హిందీ చిత్రాలలో నటించింది. 👉1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది. 👉సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992  న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు....

నేడు అంజలీదేవి గారి జయంతి..

Image
 @🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​@ 🌹సినీపరిశ్రమలో తనదైన చెరగని ముద్రవేసి, సినీ రంగానికి అలుపెరుగని సేవ చేసిన అంజలీదేవి గారి జయంతి నేడు.. ఆమె గురించి కొంత సమాచారం మీకోసం..🌹 👉అభినవసీతమ్మ గా ప్రసిద్ది చెందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది. @శ్రీనివాస్@ 👉అంజలీ దేవి 1927 , ఆగష్ట్ 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.@శ్రీనివాస్@ 👉1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయిక గా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలన...

నేడు టాలీవుడ్ మెగాస్టార్ "చిరంజీవి" గారి జన్మదినం..

Image
 @🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​@ 💐💐💐టాలీవుడ్ మెగాస్టార్ "చిరంజీవి" గారికి జన్మదిన శుభాకాంక్షలతో..💐💐💐 💐💐💐 HAPPY BIRTHDAY CHIRANJEEVI GARU..💐💐💐 👉ఈ రోజు తెలుగు సినీ అభిమానుకు మెగా డే.... టాలీవుడ్ మెగాస్టార్, కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా చెరగని స్థానం సంపాదించుకున్న కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజు నేడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఎందరో సినీ మహానుభావుల్లో మెగాస్టార్‌ది ప్రత్యేక స్థానం. 40 ఏళ్ల సినీ ప్రస్థానం, 150 సినిమాలు..... ఈ మెగా జర్నీలో చిరంజీవి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. @శ్రీనివాస్@ 👉చిరంజీవి బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్... ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం. @శ్రీనివాస్@   🍁ఇష్టమైన హాబీ🍁 👉చిరంజీవికి ఇష్టమైన హాబీ ఫొటోగ్రఫి. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయారట. అయితే సినిమాల్లోకి వచ్చిన ఆ కోరిక తీరి...

నేడు సినీగేయ రచయిత "జాలాది రాజారావు" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ జీవితసత్యాలను పాటలుగా మలచిన సినీసాహిత్య మణిమకుటం,జాలాది గా ప్రసిద్ధుడైన "జాలాది రాజారావు"  గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. జాలాది అంటే జానపదమే గుర్తుకు వస్తుంది. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’... ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో జానపదాలు ఆయన కలం నుంచి జాలువారాయి... జానపదమే కాకుండా పుణ్యభూమి నాదేశం నమోనమామీ... ధన్యభూమి నాదేశం సదా స్మరామి... అంటూ దేశభక్తిని చూపి ధన్యజీవి అయ్యారు మన జాలాది. ఆయనది ఆదర్శ జీవితం. తండ్రితరం నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న సంప్రదాయం వారిది. ఇమ్మానియల్‌ (జాలాది నారాయణ చౌదరి), అమతమ్మ దంపతులకు ఐదో సంతానంగా జాలాది రాజారావు జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షకు గురై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కలం నుంచి జాషువా శైలి తొంగిచూస్తుంటుంది. జాలాది తన పాటల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారు.  కృష్ణా జిల్లా గుడివాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఆయనకు కులం అడ్డుగోడైంది, పాఠశాలలోకి రానివ్వకుండా బయట కూర్చొని ఇసుకలో అక...

నేడు తెలుగు కవి, అవధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి, రూపురేఖలు ఏర్పరచడంలో,  అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగు కవి, అవధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు... తిరుపతి వేంకట కవులుగా విశేషప్రాచుర్యం పొందిన వారిలో ఒకరు.  తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్దిన ఆయన దివాకర్ల తిరుపతిశాస్త్రిగారితో కలిసి తిరుపతి వేంకట కవుల జంటగా ప్రసిద్ధిచెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవిగా సాహిత్యసేవలందించిన ఆయన జయంతి నేడు... చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, అతని మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించాడు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతని వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు. పుట్టిన తేదీ, స్థలం : ఆగష్...

అందమా నీ పేరేమిటి అందమా..

Image
@శ్రీనివాస్ @ అందమా నీ పేరేమిటి అందమా.. చిత్రం : అల్లరి ప్రియుడు సంగీతం : ఎం.ఎం.కీరవాణి సాహిత్యం : వేటూరి గానం : బాలు,చిత్ర పల్లవి:: అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి...శిల్పమా బాపు గీసిన...చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా పరువమా నీ ఊరేమిటి పరువమా పరువమా నీ ఊరేమిటి పరువమా కృష్ణుని మధురా నగరమా కృష్ణ సాగర కెరటమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా చరణం::1 ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున సంగీతమా నీ నింగిలో విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ తెలుపుమా తెలుపుమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా తెలుపుమా నీ ఊరేమిటి పరువమా చరణం::2 భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషనే గాలిగా నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా ...

నేడు కళా ప్రపూర్ణ "వాణిశ్రీ" గారి పుట్టిన రోజు...

Image
 @sreenivas@ 💐💐💐నేడు కళా ప్రపూర్ణ "వాణిశ్రీ" గారి పుట్టిన రోజు.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలతో...💐💐💐 💐💐💐HAPPY BIRTHDAY VANISRI GARU..💐💐💐 👉అభినయానికి పెట్టింది పేరు ‘వాణిశ్రీ’ గారు..  మొదట చెల్లులి పాత్రతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన  వాణిశ్రీ గారు.. మరికొన్ని చిత్రాలలో ఆదర్శ గృహిణిగా నటించింది.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి తల్లిగా.. అత్తగా కూడా రాణించింది. ఆ కళా ప్రపూర్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె  జీవిత విశేషాలను తెలుసుకుందామా... 👉వాణిశ్రీ గారు.. 1948వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన నెల్లూరులో జన్మించారు. 1960 నుంచి 1970 వరకు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు తెలుగు చిత్ర సీమను ఏలారని చెప్పుకోవచ్చు. ఒక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటారు. అంతే కాదు.. వాణి శ్రీ గారు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె హెయిర్ స్టైల్. అప్పటి వరకు ఉన్న నటులెవరూ అలాంటి హెయిర్ స్టైల్ ప్రయత్నించలేదు. కానీ వాణిశ్రీ గారు మాత్రం పెద్ద కొప్పుతో కనిపించేది. అది ఆమెకు మాత్రమే సూట్ అవుతుందేమో అని అనిపించేది. @శ్రీనివాస్@  👉వాణిశ్రీ  గార...