నేడు అంజలీదేవి గారి జయంతి..
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸@
🌹సినీపరిశ్రమలో తనదైన చెరగని ముద్రవేసి, సినీ రంగానికి అలుపెరుగని సేవ చేసిన అంజలీదేవి గారి జయంతి నేడు.. ఆమె గురించి కొంత సమాచారం మీకోసం..🌹
👉అభినవసీతమ్మ గా ప్రసిద్ది చెందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది. @శ్రీనివాస్@
👉అంజలీ దేవి 1927 , ఆగష్ట్ 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.@శ్రీనివాస్@
👉1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయిక గా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణసుందరి అనార్కలి లో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993) మరియు పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియ లో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది..ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు . ఆమెకు ఇద్దరు కుమారులు. @శ్రీనివాస్@
👉అంజలీ దేవి చెన్నైలో 13 జనవరి 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు.@శ్రీనివాస్@
🍁అవార్డులు🍁
👉ఫిలింఫేర్ అవార్డ్
👉ఉత్తమ నటి - తెలుగు – అనార్కలి (1955)
👉ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
👉ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
👉ఉత్తమ నటి - తెలుగు – జయభేరి (1959)
👉ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
👉రఘుపతి వెంకయ్య పురస్కారం - 2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత గురించి.
👉రామినేని పురస్కారం - 2006.
👉ANR జాతీయ పురస్కారం - 2008.
💟💟💟💟💟💟💟💟💟💟

Comments
Post a Comment