Posts

Showing posts from May, 2021

అందమే ఆనందం...

Image
 @శ్రీనివాస్@ సముద్రాల  రామానుజాచార్య (జూనియర్) గారి వర్ధంతి స్మృతిలో.. అందమే ఆనందం... చిత్రం :  బ్రతుకు తెరువు (1953) సంగీతం :  ఘంటసాల గీతరచయిత :  సముద్రాల (జూనియర్) నేపథ్య గానం : ఘంటసాల పల్లవి: అందమే ఆనందం... అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం... అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం... చరణం 1: పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం... పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం... ఒడిలో చెలి మోహన రాగం... ఒడిలో చెలి మోహన రాగం.. జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం... అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం... చరణం 2: పడిలేచే కడలితరంగం... ఓ... ఓ... పడిలేచే కడలితరంగం... వడిలో జడిసిన సారంగం...వడిలో జడిసిన సారంగం పడిలేచే కడలితరంగం...వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో... ఓ.. ఓ... సుడిగాలిలో ఎగిరే పతంగం... జీవితమే ఒక నాటక రంగం...జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం..

చినుకు చినుకు పడుతూ వుంటే...

Image
 @శ్రీనివాస్@ నటశేఖర‌,సూపర్ స్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాట విందాం.. చినుకు చినుకు పడుతూ వుంటే... చిత్రం : ఇద్దరూ అసాధ్యులే సంగీతం : సత్యం గానం : బాలు,సుశీల సాహిత్యం : ఆచార్య ఆత్రేయ చినుకు చినుకు పడుతూ వుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ చినుకు చినుకు పడుతూ వుంటే  తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ ఆహా హా హహ హ హ హ హ హ హ చేయి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే చిక్కు కురులు చిక్కం వేయగా ఆ ఆ... చేయి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే చిక్కు కురులు చిక్కం వేయగా... ఆఆ ఆఆ ఆఆ ఊపిరాడలేదని నువ్వు  ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే జేజేలు జేజేలు ఈ రోజుకు  ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకు చినుకు చినుకు పడుతూ వుంటే ఆ  ఆఆ తడిసి తడిసి ముద్దవుతుంటే ఆ  ఆఆ ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ సొంపులన్నీ దాచే మేర  ఒంటినంటి ఉన్నది చీర తొలగిపోతే...

నా కనులు ఎపుడూ కననె కనని

Image
@శ్రీనివాస్ @ నా కనులు ఎపుడూ కననె కనని చిత్రం : రంగ్ దే (2021) సంగీతం : దేవీశ్రీప్రసాద్   సాహిత్యం : శ్రీమణి  గానం : సిధ్ శ్రీరామ్ నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలా రేయిపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన ఎపుడూ లేనీ ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎపుడో రానీ ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందెనే గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూశానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలో నీ కథెంతో నీ గతంలో నా కథంతే ...

కుకు కుకు కుకు కుకు...

Image
@శ్రీనివాస్ @ కుకు కుకు కుకు కుకు చిత్రం : నిన్నే ఇష్టపడ్డాను (2003) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కూకూ మధుమాసం నేడేనా నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ కుకు కుకు కుకు కుకు కూకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కూకూ మధుమాసం నేడేనా ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు కమ్ముకొచ్చే ఇంతలో ఇలా ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలిచిందు లెంతసేపిలా కొంటె ఊసులు కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ కుకు కుకు కుకు కుకు కూకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కూకూ మధుమాసం నేడేనా ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు కొమ్మచాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ కుక...

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో..

Image
 @శ్రీనివాస్@ దాసరి గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతిలో ఈ పాటను విందాం... ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో.. Movie : Srivari muchatlu Music director: Chakravarthy Lyricist: Dasari Narayana rao Singers: Balu,Janaki పల్లవి: ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో పాడినదీ... ఒక రాధిక... పలికినదీ.. రాగ మాలిక ఇదే.. ఇదే.. ఇదే... నా అభినందన గీతికా ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో చరణం: 1 కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా పురివిప్పు నాట్యాలు నాట్యభారతి పాదాల పారాణి అద్దగా అడుగుల అడుగిడి స్వరమున ముడివడి అడుగే పైబడి మనసే తడబడి మయూరివై కదలాడగా... వయ్యారివై నడయాడగా ఇదే... ఇదే... ఇదే... నా అభినందన గీతికా ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో చరణం: 2 పయనించు మేఘాలు నిదురించు సృష్టినే మేలుకొలుపగా రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా స్వరమున స్వరమై పదమున పదమై పదమే స్వరమై స్వరమే వరమై దేవతవై అగుపించగా... జీవితమే అర్పించగా ఇదే... ఇదే... ఇదే... నా అభినందన గీతికా ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో పాడినదీ... ఒక రాధిక... పలికినదీ.. రాగ మాలి...

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా...

Image
 @శ్రీనివాస్@ ప్రముఖ గాయని ఉషా గారి పుట్టినరోజు సందర్భంగా.. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా... Movie: Santosham Singer: Usha Lyrics: Sirivennela Music: R P Patnaik నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవెం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా ! నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా రెక్క్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా ఎక్కడ వాలేను చెప్పు నువ్వే సావాసమా ! హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా ! నడకలు నేర్పిన ఆసవు కదా తడబదనీయకు ప్రతి దిన కథ వెతికే మనసుకు మమతే పంచుమా ! నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా అమ్రుతమనుకుని నమ్మడమే ఒక శాపమా ! నీ ఒడి చేరిన ప్రతి మది కి బాదే ఫలితమా తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా ! పెదవులపై చిరునవ్వుల దగ కనపడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా ! నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు...

మనిషి మారలేదు..

Image
 @శ్రీనివాస్@ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి స్మృతిలో.. కొన్ని పాటలు మనిషి గురించి, అతని ప్రవర్తన గురించి చాల బాగా వర్ణించాయి, అలాంటి పాటే ఒకటి గుండమ్మకథ సినిమాలోని ఈ వేషము మార్చెను పాట... మనిషి మారలేదు.. చిత్రం: గుండమ్మ కథ (1962) సంగీతం: ఘంటసాల గీతరచయిత: పింగళి నేపధ్య గానం: ఘంటసాల, లీల పల్లవి: వేషము మార్చెను... హోయ్.. భాషను మార్చెను... హోయ్.. మోసము నేర్చెనూ..ఉ..ఉ.... అసలు తానే మారెను... అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు.. మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు.. చరణం 1: కృరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను కృరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జండా పాతెను హిమాలయముపై జండా పాతెను ఆకాశంలో షికారు చేసెను అయినా మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు... చరణం 2: పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను కడలిని మించిన ఆశలు దాచెను వేదికలెక్కెను..వాదము చేసెను.. వేదికలెక్కెను..వాదము చేసెను.. త్యాగమె మేలని బోధలు చేసెను అయినా మనిషి మారలేదు ఆతని బాధ తీరలేదు.. చరణం 3: వేషమూ మార్చెను.. భాషనూ మార్చెను, మోసము నేర్చెను.. తలలే మార్చెను... అయినా మనిషి మారలేదు......

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన..

Image
@శ్రీనివాస్ @ ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన.. చిత్రం : నాన్నకు ప్రేమతో (2016) సంగీతం : దేవీశ్రీప్రసాద్ రచన : దేవీశ్రీప్రసాద్ గానం : దేవీశ్రీప్రసాద్, సాగర్ ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో.. ఈ పాటతో..

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం..

Image
@శ్రీనివాస్ @ నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం.. Movie Name: Shopping Mall Music: G.V.Prakash Kumar, Vijay Anthony Lyrics: Vennelakanti Singer: Haricharan, Chinmayee నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం.. నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే.. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం...

హరివరాసనం విశ్వమోహనం..

Image
@శ్రీనివాస్ @ హరివరాసనం విశ్వమోహనం.. చిత్రం : స్వామి అయ్యప్పన్(1975) సంగీతం : జి.దేవరాజన్ గానం : ఏసుదాస్ హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్ధనం నిత్య నర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం భక్తమానసం భరణ లోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళమృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రితజన ప్రియం చిందిత ప్రదం శృతివిభూషణం సాధు జీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

ఒక వేణువు వినిపించెను..

Image
@శ్రీనివాస్ @ ఒక వేణువు వినిపించెను.. చిత్రం : అమెరికా అమ్మాయి 1976 సంగీతం : జి.కె.వెంకటేష్ సాహిత్యం : మైలవరపు గోపీ గానం : జి.ఆనంద్ ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా.. ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా.. ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా.. సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో.. సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో.. నవమల్లిక చినబోయెనూ..నవమల్లిక చినబోయెనూ.. చిరునవ్వు సొగసులో!! ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా.. వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ.. వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ.. రేరాణియే నా రాణికీ..రేరాణియే నా రాణికీ.. పారాణి పూసెనూ!! ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా.. ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా?? ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా?? నా గుండెలో వెలిగించెనూ..నా గుండెలో వెలిగించెనూ.. సింగార దీపికా!! ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా.. ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా.. ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా!!

చెలిమిలో.. వలపు రాగం..

Image
@శ్రీనివాస్ @ చెలిమిలో.. వలపు రాగం.. చిత్రం : మౌనగీతం (1981) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, జానకి పపపపా.. పపపపాపా.. పపపపా.. పపపపాపా.. చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. రాగం భావం కలిసే ప్రణయగీతం పాడుకో.. పాప పపా పాడుతూ.. పాప పపా ఆడుకో.. పాప పపా చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. ఉయ్యాలలూగినానూ... నీ ఊహలో నెయ్యాలు నేర్చినానూ.. నీ చూపులో ఆరాధనై గుండెలో.. ఆలాపనై గొంతులో.. అలల లాగా కలల లాగా.. అలల లాగా కలల లాగా.. కదలి రాగా... చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. నులివెచ్చనైన తాపం... నీ స్నేహము ఎదగుచ్చుకున్న భావం.. నీ రూపము తుదిలేని ఆనందమూ.. తొణుకాడు సౌందర్యమూ.. శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. పదము కాగా చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. రాగం భావం కలిసే ప్రణయ గీతం పాడుకో.. పాప పపా పాడుతూ.. పాప పపా ఆడుకో.. పాప పపా పపపపా.. పపపపాపా.. పపపపా.. పపపపాపా..

వనిత..లత..కవిత..

Image
@శ్రీనివాస్ @ వనిత..లత..కవిత.. చిత్రం : కాంచన గంగ (1984) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : బాలు వనిత..లత..కవిత.. మనలేవు లేక జత.. వనిత..లత..కవిత.. మనలేవు లేక జత.. ఇవ్వాలి చేయూత .. మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత వనిత..లత..కవిత.. మనలేవు లేక జత.. పూలురాలి నేలకూలి... తీగబాల సాగలేదు.. చెట్టులేక... అల్లుకోక... పూవు రాదు నవ్వలేదు మోడు మోడని తిట్టుకున్నా... తోడు విడిచేనా? పులకరించే... కొత్త ఆశ  తొలగిపోయేనా? వనిత..లత..కవిత.. మనలేవు లేక జత.. ఆదరించే ప్రభుతలేక... కావ్యబాలా నిలువలేదు.. కవిత ఐనా... వనిత ఐనా... ప్రేమలేకా పెరగలేదు.. చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా? చేదు మింగి... తీపి నీకై పంచమరిచేనా? వనిత..లత..కవిత.. మనలేవు లేక జత.. తనది అన్న..గూడులేక కన్నెబాల బతకలేదు.. నాది అన్న తోడులేక... నిలువలేదు విలువలేదు పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా? వెలుగులోన... నీడలోన నిన్ను మరిచేనా.. వనిత..లత..కవిత మనలేవు లేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత

శ్రీ నృసింహ ద్వాదశనామస్తోత్రమ్..

Image
 @శ్రీనివాస్@ నేడు నృసింహ జయంతి సందర్భంగా... శ్రీ నృసింహ ద్వాదశనామస్తోత్రమ్.. హరిః ఓం.  అస్య శ్రీనృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య -  వేదవ్యాసో భగవాన్‌ ఋషిః -  అనుష్టుప్‌ఛ్ఛందః -  లక్ష్మీనృసింహోదేవతా,  శ్రీనృసింహ ప్రీత్యర్థే  జపే వినియోగః --- ధ్యానమ్: స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్! నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్!! ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్ర కేసరీ! తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః!!                  ||౧|| పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః! సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః!!           ||౨|| నవ ప్రహ్లాదవరదో దశమో౬నంతహస్తకః! ఏకాదశోమహారుద్రో ద్వాదశో దారుణ స్తథా!!          ||౩|| ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః!  మంత్ర రాజ ఇతి జ్ఞాతం సర్వపాపవినాశనమ్!!     ||౪|| క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణం!   రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే!!             ||౫|| గిరి...

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి..

Image
@శ్రీనివాస్ @ ఒంపుల వైఖరి సొంపుల వాకిలి.. చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ మోవినీ మగతావినీ ముడివేయనీయవా కాదని అనలేననీ ఘడియైన ఆగవా అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం లాలిలాలిలాలి ... లాలిలాలిలాలి లాలీ లాలీ ... లాలీ లాలీ కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా కష్టమే సేదతీరే నేస్తమే నోచనా నిగ్రహం నీరుగారే జ్వాల...

నీవే అమరస్వరమే.. సాగే.. శృతిని నేనే..

Image
 @శ్రీనివాస్@ నీవే అమరస్వరమే..  సాగే.. శృతిని నేనే.. చిత్రం : ఘర్షణ(1988) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీ గానం : బాలు, చిత్ర నీవే అమరస్వరమే..  సాగే.. శృతిని నేనే.. నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు నింగి వీడి నేల జారిన జాబిలి మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లె పూల బంధమీవు ఓ చెలి అంతులేనిదీ కథ అందరాని సంపద రాగ బంధనం అనురాగ చందనం అంతులేనిదీ కథ అందరాని సంపద రాగ బంధనం అనురాగ చందనం నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే..  సాగే.. శృతిని నేనే.. మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం తీయనైన ఆశలన్నీ నీ వరం తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం భావ రాగ భాష్యమే ఈ జీవితం పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించెనే పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలాపించెనే నూరేళ్ళు నీతో సాగాలి నేనే నీ గుండెల్లోనా నిండాలి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వేలిసేనే నీకోసం నీలో సర్వం న...

శ్రీ తుంబుర నారద నాదామృతం..

Image
@శ్రీనివాస్ @ శ్రీ తుంబుర నారద నాదామృతం.. చిత్రం : భైరవద్వీపం (1994) సంగీతం : మాధవపెద్ది సురేష్ సాహిత్యం : వేటూరి గానం : బాలు శ్రీ తుంబుర నారద నాదామృతం ఆఆఆ.. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం .. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతీ సోపానం శివుని రూపాలు భువికి దీపాలు. స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం సప్త వర్ణముల మాత్రుకగా శుక్త వర్ణముల డోలికగా సప్త వర్ణముల మాత్రుకగా శుక్త వర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై స ప స  గ రి గ ని ద ప మ గ గ ని గ మ గ రి స ని స సగమ గమప మపని స గరిసనిద రిసనిదప సనిదపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం స స స స స సనిప గరిస గ ప ని స గరిస .. నిసరి పనిస గపని రిగప గరిస సంగీతారంభ సరస హేరంబ స్వర పూజలలో షడ్జమమే . రి రి రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమాగారిస నిసరినిదమప మగరి నిదప మగరి శంభోకైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే గగా గారిసరి సద సాదప గగపదస మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమ...

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని...

Image
@శ్రీనివాస్ @ చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని... చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు(2003) సంగీతం : కీరవాణి సాహిత్యం : చంద్రబోస్ గానం : కళ్యాణి మాలిక్, సునీత చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో నువ్వే నాకు ముద్దొస్తావనీ నేనే నీకు ముద్దిస్తాననీ నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో వరహాల బాటలోనా.. రతనాల తోటలోన వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి నెల వంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ ముద్దుల్లోన ముద్దవుతాననీ నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి ...

రాముని అవతారం...

Image
@శ్రీనివాస్ @ రాముని అవతారం... చిత్రం :  భూకైలాస్ (1958) సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్ సాహిత్యం :  సముద్రాల (సీనియర్) గానం :  ఘంటసాల ద్వారపాలుర మరల దరిదీయు కృపయో... ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ... రాముని అవతారం... రవికులసోముని అవతారం.... రాముని అవతారం... రవికులసోముని అవతారం రాముని అవతారం... రవికులసోముని అవతారం సుజనజనావన ధర్మాకారం.. .దుర్జనహృదయవిదారం ... రాముని అవతారం దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ జన్మింతురు సహజాతులు మువ్వురు... జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా రాముని అవతారం ...రవికులసోముని అవతారం చదువులునేరుచు మిషచేత... చాపముదాలిచి చేతా విశ్వామిత్రుని వెనువెంట ... యాగముకావగ చనునంట అంతము చేయునహల్యకు శాపము అంతము చేయునహల్యకు శాపము వొసగును సుందర రూపం ... రాముని అవతారం...రవికులసోముని అవతారం   ధనువో జనకుని మనసున భయమో ధారుణి కన్యాసంశయమో దనుజులు కలగను సుఖగోపురమో... దనుజులు కలగను సుఖగోపురమో... విరిగెను మిథిలానగరమునా రాముని అవతారం రవికులసోముని అవతారం కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును ...

శ్రీరామ నామాలు శతకోటి..

Image
@శ్రీనివాస్ @ శ్రీరామ నామాలు శతకోటి.. చిత్రం : మీనా (1973) సంగీతం : రమేష్ నాయుడు రచన : ఆరుద్ర గానం : పి.సుశీల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి.. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు.. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు.. కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి.. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు.. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు కోతిమూకలతో.. ఆ ఆ ఆ కోతిమూకలతో లంక పై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు..రణధీరుడు శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి.. పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు.. పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..అఖిలాత్ముడు శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి శ్రీరామ నా...

జాబిలమ్మ నీకు అంత కోపమా..

Image
@శ్రీనివాస్ @ జాబిలమ్మ నీకు అంత కోపమా.. చిత్రం : పెళ్ళి (1997) సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు  జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలలుకన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయ...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..

Image
@శ్రీనివాస్ @ ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని.. చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని.. లాలా..లాలా..ల..లా..లా..లా..లా... విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమే వలపే పుడుతుంటే.. తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే... పూలే గంధం పూస్తుంటే ..ఏ.. తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా... ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని.. ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా... గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్.. నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం... గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే... సంధ్యారాగం అవుతుంటే... లయలే ప్రియమై పోతుంటే....హోయ్.. వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా... ఈ...

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి..

Image
@శ్రీనివాస్ @ నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి.. చిత్రం : నాగమల్లి (1980) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి రాకతో జీవనం రాగమై పలుకగా ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి వీణల్లే పాడు జాణల్లే ఆడు రసధునివై నీవు నాలోనా ఊగాలీ రాగ డోలా నీలో నాదాలు ఎన్నో విన్నాను పరువపు వేణువులీవెళా నువ్వేనా రాసలీల నేను వేణువై నిను వరింపగా అలిగిన అందెల సందడిలో నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి రాకతో జీవనం రాగమై పలుకగా ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి నువ్వే నా ఈడు నవ్వే నా తోడు కలిసిన కాపుర మీవేళ కావాలి నవ్య హేల నీలో అందాలు ఎన్నో గ్రంధాలు చదివిన వాడను ఈ వేళా నువ్వే నా కావ్య మాలా పువ్వు పువ్వున పులకరింతలే విరిసెను ...

నీలి మేఘమా.. అంత వేగమా..

Image
@శ్రీనివాస్@ నీలి మేఘమా.. అంత వేగమా.. చిత్రం : విలేజ్ లో వినాయకుడు (2009) సంగీతం : మణికాంత్ కద్రి సాహిత్యం : వనమాలి గానం : కార్తీక్ నీలి మేఘమా.. అంత వేగమా ఓ నిముషం ఆగుమా నేలకీ రంగులు నీ వరమా తూనీగా రెక్కలే పల్లకీగా.. ఊరేగే ఊహలే ఆపడం నా తరమా నీలి మేఘమా.. అంత వేగమా ఓ నిముషం ఆగుమా.. నేలకీ రంగులు నీ వరమా ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ .. ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ ఆ నదులూ .. విరిసే పొదలూ .. నా ఎదకూ ఆమెనే చూపినవి నీలి మేఘమా ..అంత వేగమా ఓ నిముషం ఆగుమా.. నేలకీ రంగులు నీ వరమా మదే కనని పాశం ఇలా ఎదురయిందా తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ.. నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి ఈ జతలో.. ఒకడై ఒదిగే.. ఓ వరమే చాలదా ఎన్నటికీ నీలి మేఘమా ..అంత వేగమా ఓ నిముషం ఆగుమా.. నేలకీ రంగులు నీ వరమా

గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా..

Image
@శ్రీనివాస్@ గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా.. చిత్రం : వసంతం (2003) సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్ సాహిత్యం : సిరివెన్నెల గానం : కె.ఎస్.చిత్ర గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ ఎన్నడూ ఆగని పయనమే నీదని కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న నిను నిలువరించినా ఓ స్వప్నమా అమావాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచిన ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మా ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరదా... గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీ రాక ఆపినా వాసంతమా ఏ కొండ రాళ్లైనా ఏ కోన ముళ్లైనా బెదిరేనా నీ వాన ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలుసుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా... గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ ...

పూచే పూలలోనా.. వీచే గాలిలోనా..

Image
@శ్రీనివాస్ @ పూచే పూలలోనా.. వీచే గాలిలోనా చిత్రం: గీత (1973) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: జి.కె.మూర్తి గానం: బాలు పూచే పూలలోనా.. వీచే గాలిలోనా నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే.. పూచే పూలలోన.. వీచే గాలిలోన నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే .. ఓ చెలీ .... ఓ చెలీ .... నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు నా ఊపిరై నీవు నాలోన సాగెవు నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే పూచే పూలలోన.. వీచే గాలిలోన నీ అందమే దాగెనే.. నీ అందెలే మ్రోగెనే ఓ చెలీ... ఓ చెలీ... ఎన్నో జన్మల బంధము మనదీ.. ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ.. నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే పూచే పూలలోన.. వీచే గాలిలోన నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో...

Image
@శ్రీనివాస్ @ చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... చిత్రం : ఖైదీ నంబర్ 786 (1988) సంగీతం : రాజ్-కోటి సాహిత్యం : భువనచంద్ర గానం : బాలు, జానకి చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో.. సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో.. సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. నా సలహా ఒకటే చలి వేళా ఓం నమః ఒడిలో చదవాలా నీ తరహా తెలిసే పిలగాడా యం యమః కలిశా కసితీరా ఆస్తో పాస్తో చదివించుకో కాస్తో కూస్తో కవ్వించుకో జోడు కుంపట్లు కావాలా ఈడె తంపట్లు వెయ్యాలా ఒకటే దుప్పట్లో దూరాలా నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల ఓ..ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో.. ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో.. ఎందిట్లో నా నడుమే కసిగా ఊగాలా నీ నడకే ఉసిగా సాగాలా నీ రు...

పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి...

Image
@శ్రీనివాస్ @ పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి... చిత్రం : అతడు (2005) సంగీతం : మణిశర్మ సాహిత్యం : సిరివెన్నెల గానం : శ్రేయాఘోషల్ పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి,ఝల్లుమంటూ ఉరికి మా కళ్ళలో, వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తారంగాల వొడిలో ఈళ్ళని మురిపించగా తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపెనేమో ఆహ్వానం నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం ఏమైందో ఇంతకాల...

కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా...

Image
@శ్రీనివాస్ @ కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా... Movie    :  Vaasu Lyrics    :  Pothula RaviKiran Music    :  Haris Jayaraj Singer   :  Devan చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చిరె చీ చీ చిరె చీ చీ ప్రియా ఓహ కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా... తొలి ప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మదురమా అరుదైన హృదయమా ఓహొ హొ ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు.. చిరె చీ చీ చిరె చీ చీ ప్రియా... తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అణువణువున పరిమళమో అడుగడుగున పరవశమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం ఔనంటూ కాదం...

నాలోనే పొంగెను నర్మదా..

Image
@శ్రీనివాస్ @ నాలోనే పొంగెను నర్మదా.. Movie :Surya s/o Krishnan Music :Harris Jayaraj Lyrics-Veturi Singers :Harish Raghavendra, Devan, V. Prasanna నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా ఓం శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా ఏదో ఒకటి నన్ను  కలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే ముసినవ్వా భోగమెల్లా నువు నిలిచిన చోటేదో వెల ఎంత పలికేనో నువు నడిచే బాటంతా మంచల్లే అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏమాయో నా మనసే నీకు వశమాయే వశమాయే నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా కంటి నిద్రే దోచుకెళ్ళావ్‌ దోచుకెళ్ళావ్‌ ...

మెల్లగా కరగని రెండు మనసుల దూరం..

Image
 @శ్రీనివాస్@ మెల్లగా కరగని రెండు మనసుల దూరం Movie :Varsham Music :Devi Sri Prasad Lyrics-Sirivennela Singers :SP Charan, Sumangali మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం  మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో తళ తళ నాట్యం ఇదేనా ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల స్థానం నీదేనా నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేదా నా పరువముని కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా త్వరపడే వయస్సునే నిలుపలేను ఇకపైనా విడుదలే వద్దనే ముడులు వేయనా మన కలయిక చెదరని చెలిమికి...

ఎంతెంత దూరం తీరం రాదా..

Image
 @శ్రీనివాస్@ ఎంతెంత దూరం తీరం రాదా..  Movie    :  Sainikudu Lyrics    :  Kula Sekhar Music    :  Haris Jayaraj Singers  :  Unni Krishnan, S P Balu, Kavita Krishnamurthy ఎంతెంత దూరం తీరం రాదా  ఇంకెంత మౌనం దూరం కాదా  ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా  ఈనాడు ఏకం అయితే వింతేగా  ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ  నీవైపు మళ్ళిందంటే మాయేగా  మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా  మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా  ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా  తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా  అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా  ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా  మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా  హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమ...

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే..

Image
@శ్రీనివాస్@ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే Movie    :  7/G Brundhavana Colony Lyrics    :  Siva Ganesh Music    :  Yuvan Shankar Raja Singer   :  Karthik కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే  ఒకవైపు చూపి మరువైపు దాచగ  అద్దాల మనసు కాదులే  చేతులు సంద్రాన్ని మూయలేవులే  ఇవి అద్దాల మనసు కాదులే  చేతులు సంద్రాన్ని మూయలేవులే  గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే  దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే  ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే  అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే  హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే  ఒకవైపు చూపి మరువైపు దాచగ  అద్దాల మనసు కాదులే  చేతులు సంద్రాన్ని మూయలేవులే  అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే  కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే  దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే  మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే  కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు స...

ఔనని అంటావో మరి కాదని అంటావో..

Image
 @శ్రీనివాస్@ ఔనని అంటావో మరి కాదని అంటావో Movie :Holi Music :R. P. Patnaik Lyrics :Kulasekhar Singers :RP Patnaik ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరు గాలి చేతికి ఇచ్చి ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా నా మసనే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా  నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ప్రేమన్నది ఊపిరి కాదా  అందరిలో ఉండేదేగా పరిచయమే లేదని అంటే వింతే కదా నువ్వున్నది నాలోనేగా  ఈ సంగతి విననే లేదా మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా ఎదనిండా ఆశలు ఉన్నా  ఎన్నెన్నో ఊసులు ఉన్నా ప్రేమ భాష రాదు అంటే నమ్మవా...

గో గో రై రై గోదావరిపై...

Image
@శ్రీనివాస్ @ గో గో రై రై గోదావరిపై... చిత్రం : గోపి గోపిక గోదావరి (2009) సంగీతం : చక్రి సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి గానం : చక్రి, వంశీ గో గో తననన గో గో గో గో తననన గో గో గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై గో గో తననన గో గో తననన గో గో తననన గో గో గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై తెరమరుగు నలుపునిక తుడిచెయ్ అదమరుపు ముసుగు నువ్వు వదిలెయ్ అలుపనని పరుగులకు జతవై కధ మలుపు వెనుకె నువ్వు పదవోయ్ దరికేసేయ్ జోర్సేయ్ వార్సేయ్ పడవై నువ్వై గో గో చక చక గో గో పద ఇక గో గో నిలవక గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై తననన తననన తననన తననన నువ్వెవరైనా నేనెవరైనా నవ్వులు ఒకటేలే...జాణ ఏ పెదవైనా ఏ ఎదకయినా సవ్వడి ఒకటేలే...కాదా వినవా వినవా గురువా మన అందరిదొకటే పడవ మనసు మమత కరువా జనమంతా ఒకటే అనవా చినుకు తడి తగిలిన చోట పరిమళం పుడుతుందంట తళుకు సిరిజల్లువు నువ్వై అల్లుకుపోమరి గో గో చక చక గో గో పద ఇక గో గో నిలవక గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై గో గో ర...

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…

Image
 @శ్రీనివాస్@ చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా… Movie: Sampangi Singers: Udit Narayan, Anuradha Sriram Music: Ghantaadi Krishna Lyrics: Varikuppala Yadagiri చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా… నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా… చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా… నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా… నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పోయావే… చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా… నెచ్చెలి పైటకు వెచ్చగ తాకే చిరుగాలినై… నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధురమై… కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై… హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై.. గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే… గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో… నా ప్రేమ రాశివి నువ్వే..ఆహాహా నా ఊపిరి చిరునామా నువ్వే… చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా… మనసా వాచా నీ మదిలోన కొలువుండనా… నా నిలువెల్లా దాసోహాలే చేసేయ్యనా… ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచెయ్యనా… ఏడడుగులతో కొంగు ముడివేస్తా ఏదేమైనా… నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా… నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా… నా రెండు కన్న...

ఒకమారు కలిసిన అందం…

Image
 @శ్రీనివాస్@ వేటూరి గారి స్మృతిలో హారిస్ జయరాజ్ గారి సంగీతానికి వేటూరి గారి సాహిత్యం..  ఒకమారు కలిసిన అందం… Movie: Ghajini Director: A.R.Murugadas Producer: B.Madhu Singer: Karthik Music: Harris Jayaraj Lyrics: Veturi Sundararama Murthy Star Cast : Suriya, Aasin, Nayanatara Music Label: Aditya Music నాననాననా నాన నననా… నాననాననా నాన నననా నాననాననా నాన నననా… తురుకు తురుకు తురుదుమ్ ఒకమారు కలిసిన అందం… అలలాగ ఎగిసిన కాలం ఒకమారు కలిసిన అందం… అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కనబడగానే… అంతే తడబడినానే కంటికెదురుగ కనబడగానే… అంతే తడబడినానే తన అల్లే కధలే పొడుపు… వెద జల్లే కళలే మెరుపు యదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూశానే… చూశానే చూశానే ఒకమారు కలిసిన అందం… అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కనబడగానే… అంతే తడబడినానే కంటికెదురుగ కనబడగానే… అంతే తడబడినానే పాత ప ద ని స దేనికది నస… నడకలు బ్రతకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరుతిండి… వాసనలు వాడుక చేసిందే కుచ్చి కూన చల్లగా (నీ సా)… నను తాకే కొండ మల్లికా (నీ సా) సరిజోడు నేన...

ఈ పాదం ఇలలోన నాట్య వేదం

Image
 @శ్రీనివాస్@ సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి గారి పాట విందాం... ఈ పాదం ఇలలోన నాట్య వేదం చిత్రం:  మయూరి (1985) సంగీతం:  బాలు గీతరచయిత:  వేటూరి నేపధ్య గానం:  ఎస్. పి. శైలజ పల్లవి: ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాల గమనాల గమకాల గ్రంధం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం... చరణం 1: ఈ పాదమే మిన్నాగు తలకు అందం ఈ పాదమే ఆ నాటి బలికి అంతం తనలోని గంగమ్మ ఉప్పొంగగా శిలలోనీ ఆ గౌతమే పొంగగా... పాట పాటలో తను చరణమైన వేళా కావ్య గీతిలో తను పాదమైన వేళా గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే... ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం చరణం 2: ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం వాగ్గేయ సాహిత్య సంగీతమై త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై ఆ పాదమే వరదయ్య నాట్య పధమై తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాల గమనాల గమకాల గ్రంధం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం

శంకరా... నాదశరీరా పరా..

Image
శంకరా... నాదశరీరా పరా.. Movie : Sankara bharanam Lyrics : veturi Singer : SP Balu శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా... విని తరించరా ... శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగ ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ.. శ...