ఈ పాదం ఇలలోన నాట్య వేదం

 @శ్రీనివాస్@


సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి గారి పాట విందాం...


ఈ పాదం ఇలలోన నాట్య వేదం


చిత్రం:  మయూరి (1985)

సంగీతం:  బాలు

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  ఎస్. పి. శైలజ



పల్లవి:


ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం

కాల గమనాల గమకాల గ్రంధం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం...


చరణం 1:


ఈ పాదమే మిన్నాగు తలకు అందం

ఈ పాదమే ఆ నాటి బలికి అంతం

తనలోని గంగమ్మ ఉప్పొంగగా

శిలలోనీ ఆ గౌతమే పొంగగా...


పాట పాటలో తను చరణమైన వేళా

కావ్య గీతిలో తను పాదమైన వేళా

గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే...


ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం


చరణం 2:


ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం

ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం

వాగ్గేయ సాహిత్య సంగీతమై

త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై


ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై

ఆ పాదమే వరదయ్య నాట్య పధమై

తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం


ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం

కాల గమనాల గమకాల గ్రంధం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..