మెల్లగా కరగని రెండు మనసుల దూరం..

 @శ్రీనివాస్@


మెల్లగా కరగని రెండు మనసుల దూరం


Movie :Varsham


Music :Devi Sri Prasad


Lyrics-Sirivennela


Singers :SP Charan, Sumangali





మెల్లగా కరగని రెండు మనసుల దూరం

చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం

చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం

తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ


ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపని బంధం 

మెల్లగా కరగని రెండు మనసుల దూరం

చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం


నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో

తళ తళ నాట్యం ఇదేనా

ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ

చిటపటలో చిటికెల స్థానం నీదేనా

నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా

జతపడే స్నేహమై అనునయించనా

చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా


ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపని బంధం


ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేదా నా పరువముని

కనులకు కానుక ఇస్తున్నా

ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే

రుణపడిపోనా ఈ పైనా

త్వరపడే వయస్సునే నిలుపలేను ఇకపైనా

విడుదలే వద్దనే ముడులు వేయనా

మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా !

ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపని బంధం


మెల్లగా కరగని రెండు మనసుల దూరం

చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం

చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం

తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ


ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపని బంధం

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..