నాలోనే పొంగెను నర్మదా..

@శ్రీనివాస్@

నాలోనే పొంగెను నర్మదా..

Movie :Surya s/o Krishnan

Music :Harris Jayaraj

Lyrics-Veturi

Singers :Harish Raghavendra, Devan, V. Prasanna

నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా
ఓం శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే
నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా

ఏదో ఒకటి నన్ను  కలచి ముక్కు చివరా మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయే ముసినవ్వా భోగమెల్లా
నువు నిలిచిన చోటేదో వెల ఎంత పలికేనో
నువు నడిచే బాటంతా మంచల్లే అయ్యేనో
నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు

ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే
ఇది కలయో నిజమో ఏమాయో
నా మనసే నీకు వశమాయే వశమాయే
నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా

కంటి నిద్రే దోచుకెళ్ళావ్‌ దోచుకెళ్ళావ్‌
ఆశలన్నీ జల్లివెళ్ళావ్‌
నిన్ను దాటిపోతూవుంటే పోతూవుంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవనసర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువు లేవో లేవు అనుకుంటే
నా హృదయం తట్టుకోలేదే

నాలోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మునిగిన తామరా
అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా పేరేలే కాంచనా
ఓం శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే

నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..