'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..
'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..
కళకి మాటొస్తే...
దొరకునా ఇటువంటి సేవ'..అంటూ ఆయన పాదాలపై పడి మూగగా రోధిస్తుంది.
నాట్యానికి నడకొస్తే...'
వే వేల గోపెమ్మలా.. మువ్వా గోపాలుడే..'అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది!..
సంగీతానికి శ్వాసనిస్తే...
ఆయన ఉచ్వాస నిఛ్వాసల్లో వేణుగానమై ప్రభాశిస్తుంది!..
సాహిత్యానికి ఓరూపం లభిస్తే..
ఆయనతో కలసి స్నేహం చేయాలని ఉవ్విళ్లూరుతుంది!..
ఆయనే... కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్.
అపారమైన గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి. కాస్త నిబద్దత వున్న వ్యక్తి.. సంగీత సాహిత్య ప్రధానంగా నిర్మించిన చిత్రాలు ఆయన కళా తృష్ణను చెప్పక చెప్తాయి. ఆయన చిత్రాలు పాటల రచయితలోని రచనా సామర్ధ్యాన్ని వెలికి తీస్తాయి. రచయిత తనను తాను వ్యక్థపరచుకునె అవకాశాన్ని కల్పిస్తాయనడంలో అనుమానం లేదు.
చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అలా తెలుగు ప్రేక్షకులు ఎప్పటి గుర్తుపెట్టుకునే ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్...
తెలుగు సినీ విశ్వానికి నాథుడై ఎన్నో స్వర్ణకమలాలను పూయించారు.వారంటే అభిమానం లేనివారెవ్వరు వుండరు.
సినిమా రంగాన్ని ఒక కళారంగంలా అందులో పనిచేసే అందరికీ గౌరవం వచ్చేలా చేసిన ఘనత వారికే.
చిత్ర పరిశ్రమ ద్వారా
మనకు అందించిన చిత్రాలు
తరతరాలకూ అమూల్యమైన నిఘంటువులే.
వారి వల్ల సంగీత, సాహిత్యాలకు, మంచి కధలకు
నాట్యానికి ఎంతో విలువ పెరిగింది.
సామాన్యులకు సైతం కళల పట్ల ఆసక్తి పెరిగింది.
ఎంత చెప్పినా వారి గురించి తక్కువే.
ఊరికే కళల గురించి ఆలోచన చేస్తే కళాతపస్వి కాలేరు.కళకు తన జీవితాన్ని అంకితం చేస్తేనే కాగలరు.
Comments
Post a Comment