అందమే ఆనందం...
@శ్రీనివాస్@
సముద్రాల రామానుజాచార్య (జూనియర్) గారి వర్ధంతి స్మృతిలో..
అందమే ఆనందం...
చిత్రం : బ్రతుకు తెరువు (1953)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సముద్రాల (జూనియర్)
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి:
అందమే ఆనందం... అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం 1:
పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
ఒడిలో చెలి మోహన రాగం...
ఒడిలో చెలి మోహన రాగం..
జీవితమే మధురానురాగం...
జీవితమే మధురానురాగం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం 2:
పడిలేచే కడలితరంగం... ఓ... ఓ...
పడిలేచే కడలితరంగం...
వడిలో జడిసిన సారంగం...వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం...వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో... ఓ.. ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం...
జీవితమే ఒక నాటక రంగం...జీవితమే ఒక నాటక రంగం
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం..
Comments
Post a Comment