చినుకు చినుకు పడుతూ వుంటే...

 @శ్రీనివాస్@

నటశేఖర‌,సూపర్ స్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాట విందాం..

చినుకు చినుకు పడుతూ వుంటే...

చిత్రం : ఇద్దరూ అసాధ్యులే

సంగీతం : సత్యం

గానం : బాలు,సుశీల

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

చినుకు చినుకు పడుతూ వుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే

అయితే

జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ వుంటే  తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే

అయితే

జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ

ఆహా హా హహ హ హ హ హ హ హ

చేయి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే

చిక్కు కురులు చిక్కం వేయగా ఆ ఆ...

చేయి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే

చిక్కు కురులు చిక్కం వేయగా...

ఆఆ ఆఆ ఆఆ

ఊపిరాడలేదని నువ్వు  ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే

జేజేలు జేజేలు ఈ రోజుకు  ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే ఆ  ఆఆ

తడిసి తడిసి ముద్దవుతుంటే ఆ  ఆఆ

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే

జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ

సొంపులన్నీ దాచే మేర  ఒంటినంటి ఉన్నది చీర

తొలగిపోతే రట్టవుతుందిరా

సొంపులన్నీ దాచే మేర  ఒంటినంటి ఉన్నది చీర

తొలగిపోతే రట్టవుతుందిరా

ఆఆ ఆఆ ఆఆ

గుట్టుగున్న నిను చూస్తుంటే  కోంటె కోర్కె నాకొస్తుంటే

పదునైన పరువాన్ని ఆపేందుకు  పగ్గాలు లేవింక జంకెందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే ఆ  హా

తడిసి తడిసి ముద్దవుతుంటే ఆ  హా

ఒదిగి ఒదిగి ఒకటైపోతూష్ ఆ హా

ఒకరికొకరు చలిమంటైతే

జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..