నేడు ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు..

 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @


💐ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు💐


💐Happy birthday Sumalatha garu..💐



👉సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా  నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ  మరియు హిందీ చిత్రాలలో నటించింది.


👉1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.


👉సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992  న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.


👉చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్లో ఈమె ఒక పాత్ర పోషించింది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.


👉2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అబ్యర్ధిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.


💟💟💟💟💟💟💟💟💟💟

Comments