అందమా నీ పేరేమిటి అందమా..

@శ్రీనివాస్@

అందమా నీ పేరేమిటి అందమా..

చిత్రం : అల్లరి ప్రియుడు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు,చిత్ర



పల్లవి::

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి...శిల్పమా
బాపు గీసిన...చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా
కృష్ణ సాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం::1

ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా నీ నింగిలో
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా

చరణం::2

భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషనే గాలిగా
నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..