నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి..

 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @


🌹దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, మహానటుడు, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా..🌹



👉అక్కినేని నాగేశ్వరరావు (సెప్టెంబర్ 20, 1923 - జనవరి 22, 2014) ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరైన అక్కినేని ధర్మపత్ని సినిమాతో సినీజీవితం ప్రారంభించారు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ సహా జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించారు.   అన్నపూర్ణతో అక్కినేని వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. 1944లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు.1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.  1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేనికే దక్కింది. అన్నపూర్ణ బ్యానర్‌లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అలాగే అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, మరియు నమ్మినబంటులో నటించి, తెలుగు నటసామ్రాట్‌గా పేరుపొందారు.ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారు.సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, మరియు కాలేజి బుల్లోడు లాభాలుపొందిన సినిమాలు. 1991 లో ఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన  విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త మరియు యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్ గా నిలిచింది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉తొలి చిత్రం - ధర్మపత్ని (1941లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది)@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉తొలి పౌరాణిక చిత్రం - సీతారామజననం (1944లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది)@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉ఆఖరి చిత్రం - మనం (అక్కినేని మూడు తరాల నటులతో నిర్మించిన ఈ చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది)@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉నటించిన టీవీ సీరియల్స్ - మట్టిమనుషులు, ఒకే ఒక్కడు@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉అక్కినేని పొందిన అవార్డులు, రివార్డులు - పద్మశ్రీ (1968), రఘుపతి వెంకయ్య  పురస్కారం (1980), రాజ్‌కపూర్ అవార్డు (1989), పద్మభూషణ్ (1988), దాదాసాహెబ్ ఫాల్కే * పురస్కారం (1991), అన్నా అవార్డు (1995),  ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (1988), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (1996), పద్మవిభూషణ్ (2011)@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


👉ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (ఉత్తమ నటుడు) - మరపురాని మనిషి (1973), ఆత్మబంధువులు (1987), ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (ఉత్తమ చిత్రం) - సుడిగుండాలు (1968) నంది పురస్కారాలు (ఉత్తమ నటుడు) - డాక్టర్ చక్రవర్తి (1964), అంతస్తులు (1965), సుడిగుండాలు (1967), మేఘసందేశం (1982), బంగారు కుటుంబం (1994) తెలుగు చలనచిత్రసీమలో తిరుగులేని ధ్రువతారగా వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న మరణించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@


💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..