నేడు 'రజనీకాంత్' గారి పుట్టినరోజు..

 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @


💐దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు రజనీకాంత్ గారి పుట్టినరోజు నేడు...💐


💐Happy Birthday Rajani garu..💐



👉ఆరడుగుల అజానుబాహుడేమీ కాదాయన. ఆరు పలకల దేహం అంతకంటే చూపించలేడు. ఒక బక్క పలచటి రూపం. కానీ ఆ రూపానికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు. ఒక చిన్న మేనరిజమ్‌ ప్రదర్శిస్తే చాలు... అంతా పులకరించిపోతారు. ఎంతమంది స్టార్లు పుట్టుకొచ్చినా... తెరపై ఎవరెన్ని విన్యాసాలు చేసినా స్టైల్‌ అంటే మాత్రం గుర్తుకొచ్చేది ఒక్కరే. ఆయనే... రజనీకాంత్‌. దశాబ్ధాలుగా స్టైల్‌కి, ప్రత్యేకమైన మేనరిజమ్‌కీ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు రజనీ. ‘నాన్నా... పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’, ‘బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే’, ‘ఆ దేవుడు శాశించాడు, అరుణాచలం పాటిస్తాడు’, ‘నా దారి రహదారి...’ - ఇలాంటి సంభాషణలతో బాక్సాఫీసుని హోరెత్తించారు రజనీకాంత్‌. భారతదేశంలోనే కాదు... ఇతర దేశాల్లోనూ ఆయనకి అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తోందంటే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే రజనీకాంత్‌కి ఉన్న ఇమేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. అక్కడే కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసిన ఆయన నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఆయన యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్‌’లో తొలి అవకాశం అందుకొన్నారు. ఆ తరువాత కన్నడలో ‘కథా సంగమ’ అనే చిత్రం చేశారు. తెలుగులో మళ్లీ బాలచందర్‌ దర్శకత్వంలోనే ‘అంతులేని కథ’, తమిళంలో ‘మూడ్రు ముడిచు’ అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. 1977లో రజనీకాంత్‌ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే చేశారు. తొలుత ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. తిరుగులేని మాస్‌ కథానాయకుడిగా ఎదిగారు. ఆయన 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. ‘దళపతి’, ‘నరసింహ’, ‘బాష’, ‘ముత్తు’, ‘పెదరాయుడు’, ‘అరుణాచలం’ తదితర చిత్రాలు తమిళంతో పాటు, తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. ఆయన నటించిన ‘2.ఓ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించింది. రజనీ కథానాయకుడిగా భారతదేశంలోనే అత్యధిక వ్యయంతో చిత్రం తెరకెక్కిందంటే ఆయన స్థాయి అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్‌ కథానాయకుడిగా కోట్లాది మంది గుండెల్లో ఉన్నా... తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకొన్నా... సాధారణ జీవితాన్ని కొనసాగించడానికే ఇష్టపడతారు.తన బాల్యమిత్రుడి ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి సాధారణంగా గడపడం, వీలైనప్పుడల్లా హిమాలయాలకి వెళ్లి ధాన్యం చేయడం ఆయనకి అలవాటు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం ఆయన అభిమానులకి మరింతగా నచ్చుతుంటుంది. 1981లో లతని వివాహం చేసుకొన్న రజనీకాంత్‌కి ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్‌ పురస్కారాల్ని స్వీకరించారు రజనీ.


💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..