నేడు ప్రముఖ సినీ రచయిత "పరుచూరి వెంకటేశ్వరరావు" గారి పుట్టినరోజు..

 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@


💐✍నేడు ప్రముఖ సినీ రచయిత "పరుచూరి వెంకటేశ్వరరావు" గారి పుట్టినరోజు.. ఆయన గురించి కొన్ని విషయాలు..✍💐



👉పరుచూరి సోదర ద్వయంలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూడా పరుచూరి వెంకటేశ్వరరావుని అగ్రజా అని పిలుస్తుంటారు. తెలుగు సినిమా కథల్ని, మాటని కొత్త పుంతలు తొక్కించిన ఘనత పరుచూరి సోదరులది. రచయితలకి స్టార్‌ హోదా తీసుకొచ్చారు. పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా.. దర్శకుడిగా, నటుడిగా కూడా తనదైన ముద్రని వేశారు. నాటక రంగం నుంచి వచ్చిన ఈయన 1978లో ‘చలిచీమలు’తో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 33 యేళ్ల కాలంలో మూడు తరాలు నటించిన 333 చిత్రాలకి పనిచేసి సరికొత్త రికార్డుని సృష్టించారు. ఈ ద్వయం చేసిన చిత్రాల సంఖ్య ఇప్పుడు 350కిపైనే. తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ రెవల్యూషనరీ రైటింగ్‌లో దిట్ట కాగా... పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం అందుకు భిన్నంగా భావోద్వేగాలు ఉట్టిపడేలా లోతైన భావాలతో రచన చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందిన పరుచూరి వెంకటేశ్వరరావు, ఏజీ ఆఫీసులో సెక్షన్‌ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందారు. ఈయన గన్నవరం తాలూకా మేడూరులో జన్మించారు.


👉నందమూరి తారక రామారావు 1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు 'పరుచూరి బ్రదర్స్' అని నామకరణం చేసి, తన సొంత చిత్రం 'అనురాగదేవత' ద్వారా రచయితులగా పరిచయం చేశారు.


💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..