నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "రాహుల్‌ దేవ్‌ బర్మన్‌" గారి జయంతి..

 @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@


🌹🎼నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "రాహుల్‌ దేవ్‌ బర్మన్‌" గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు..🎼🌹



👉రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అదే... ‘ఆర్‌.డి. బర్మన్‌’ అంటే చాలు... హిందీ సినిమాల్లో యువతరాన్ని వెర్రెత్తించే పాటలు గుండెల్లో మార్మోగుతాయి. ఆయన స్వరపరచిన ప్రతి గీతం నాటికీ, నేటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. మూడు దశాబ్దాల పాటు హుషారైన పాటలెన్నో స్వరపరిచిన ఈయన దాదాపు సుమారు 331 చిత్రాలకు బాణీలను సమకూర్చారు. ఆర్డీ బర్మన్‌ ముద్దు పేరు ‘పంచందా’ (చిన్నప్పుడు ఆయన ఏడిస్తే స్వరం పంచమం స్థాయిలో ఉండేదని) అలా పిలిచేవారట. ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌ కుమారుడు. కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త, గాయకుడు. పాటల్ని ‘డిస్కో’, ‘రాక్‌’ వంటి కొత్తపుంతలను తొక్కించి భారతీయ సినిమా రంగాన్ని ఓలలాడించాడు. తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల చిత్రాలకూ సంగీతాన్ని అందించారు. వైవిధ్య భరితంగా సీసాలతో, వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో కూడా సంగీతాన్ని సృష్టించారు. తండ్రి ఎస్‌డీ బర్మన్‌ వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. బెంగాలీ అయినప్పటికీ బర్మన్‌కు హిందీ చిత్రాలంటే మక్కువ. తెలుగులో ‘అంతం’ సినిమాకు సహాయ సంగీత దర్శకులుగా బర్మన్‌ వద్ద కీరవాణి, మణిశర్మలు పనిచేశారు. డార్జిలింగ్‌లో షూటింగ్‌ సమయంలో పరిచయమైన అభిమాని రీతూపటేల్‌ను వివాహం చేసుకొన్నా, ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. 1980లో గాయని ఆశాభోస్లేను వివాహం చేసుకొన్నారు. బర్మన్‌ సంగీతం సమకూర్చిన మొదటిచిత్రం ‘తీస్రీమంజిల్‌’(1966)లో అన్ని పాటలూ ఆకట్టుకునేవే. ముఖ్యంగా ‘అజాజా...’ పాట ఇప్పుడు విన్నా యువత ఊగిపోతారు. ‘పడోసన్‌’ (1968) చిత్రంలో ‘మెరె సామ్‌నవాలే కిడికీ మే... ఎక్‌ చాంద్‌కి టుకడా రెహతా హై...’, ‘ఏక్‌ చతురనార్‌... బడె హోషియార్‌...’లాంటి పాటలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 1980 వరకు బర్మన్‌ ప్రస్థానం సాగింది. ఆయన స్వరాలు సమకూర్చిన ఆఖరు చిత్రం ‘1942 ఎ లవ్‌ స్టోరీ’ (1994). ఈ సినిమా ఆయన మరణించిన తరువాత విడుదలైంది. 2013లో భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. జూన్‌ 27, 1939లో జన్మించిన బర్మన్‌ తన 79వ ఏట జనవరి 4, 1994లో మరణించారు. 

💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..