నేడు ప్ర‌పంచ సంగీత దినోత్స‌వం

 @శ్రీనివాస్@


జూన్ 21న ప్ర‌పంచ సంగీత దినోత్స‌వం లేదా వ‌ర‌ల్డ్ మ్యూజిక్ డే


ప్ర‌తి ఏడాది జూన్ 21న ప్ర‌పంచ సంగీత దినోత్స‌వాన్ని ప్రప‌ంచ దేశాల‌న్ని ఘ‌నంగా జ‌రుపుకుంటాయి.



ప్రపంచంలో సంగీతానికి ఉన్న శక్తి దేనికీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. పాప్, రాక్, వెస్ట్రన్, జానపదం పేర్లు వేరైనా వాటిలో ఉన్న గొప్పదనం సంగీత ప్రియులకే తెలుస్తుంది. మూడు అక్షరాలున్న ఈ సంగీతం యొక్క శక్తి మాటల్లో చెప్పలేనిది. రాగం, తానం,పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. కాలాన్ని మరపించి, మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం. మన దేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉంది. భారత దేశం సంగీత దేశం. అయితే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేహం లేదు.


మనిషిని కదిలించే, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం,విషాద సమయాల్లో సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు.


మొదటిసారిగా మ్యూజిక్ డే ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. దీనిని 1982వ సంవత్సరం జూన్ 21 నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ రోజును ‘మ్యూజిక్ డే లేదా అంతర్జాతీయ సంగీత దినోత్సవం’గా ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. భారత దేశం సంగీత దేశం. మనదేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉన్నది. అప్పట్లో స్వయంగా కొంతమంది సంగీత విద్వాంసులు కావడంతో సంగీతకళకు ఎనలేని ఆదరణ లభించేది. రాజుల తరువాత సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద ఆలయాల్లో కచేరీలు ఇచ్చేవారు. ఇండియాలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీంతో పాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేహం లేదు.


సంగీతానికి మనసును రంజింపచేసే మహత్తు ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు, ఆఖరికి పశువులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్దులవ్వక మానరు. సంగీతంలో ఉండే రాగం వల్ల మనసు ఆహ్లాదం చెంది, కొత్త ప్రపంచంలో విహరింపచేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతంలో రోజు రోజుకు ఎన్నో కొత్త ప్రక్రియలు వస్తున్నా సంగీతం అనే కళకు బలం చేకూరుస్తున్నాయే తప్ప మరే విధమైన ఇబ్బందిని కలిగించటం లేదు. సంగీతంలో “స,రి,గ,మ,ప,ద,ని” అనే ఏడు స్వరాలే కీలకం, అక్కడ నుండే అనేక జనక రకాలు, వాటినుండి పుట్టిన అనేక జన్యరాగాలు ఉండనే ఉన్నాయి, ఇలా ఆ ఏడు స్వరాల నుండే సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది. ఎవరు సంగీతం నేర్చుకున్నా ఇక్కడ నుండి ప్రారంభం జరగాలి. ప్రస్తుతం అమలులో ఉన్న రాగాలన్నీ ఇక్కడ నుండి పుట్టినవే.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..