నేడు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి..
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
🌹✍️నేడు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి✍️🌹
👉మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస రావు. వీరు ఏప్రిల్ 30వ తేదీన 1910వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ. శ్రీరంగం సూర్యనారయాణకు దత్తత వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో పూర్తి చేశారు. 1925లో ఎస్ఎస్ఎల్సి పాసైనారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. 1931లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తి చేశారు. 1935లో విశాఖలోని ఎవిఎస్ కాలేజీలో అధ్యాపకులుగా చేరారు. 1938లో మద్రాసు, ఆంధ్రప్రదేశ్లో సబ్ ఎడిటర్గా చేరారు. తరువాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద, ఆంధ్రావాణి పత్రికలో వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంలో ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన పుస్తకం ‘మహాప్రస్తానం’. ఆయన 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ ఎన్నో రచనలు చేశారు. ఎన్నో తెలుగు చలన చిత్రాలకు పాటలు, మాటలు రాసినారు. పిల్లలు లేని కారణంగా 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజ అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నారు. 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరపున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ప్రసంగించిన తరువాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలలుపాటు ఆసుపత్రిలో ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగా పనిచేశారు. విప్లవ రచయితల సంఘం (విరసం)ను స్థాపించారు. చివరకు క్యాన్సరు వ్యాధితో బాధపడుతూ 1983 జూన్ 15న శ్రీశ్రీ పరమవదించారు. విశాఖపట్నం బీచ్రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహంను ప్రతిష్టించారు. విప్లవ కవిగా సాంప్రదాయ చంధోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, మహాకవిగా ఆయన గుర్తింపుపొందారు.@శ్రీనివాస్@
👉శ్రీశ్రీ పీడిత జనాల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. తనరచనలు ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేశారు. శ్రీశ్రీని ప్రతీ కవి, రచయిత స్ఫూర్తిగా తీసుకోవాలి. శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలి. మహాప్రస్థానం గ్రంథం ప్రతి ఒక్కరి ఇంటిలో పుస్తకాల గదిలో ఉండాలి. శ్రీశ్రీ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా చేద్దాం. సమాజ చైతన్యానికి మనవంతుగా కృషి చేద్దాం. శ్రీశ్రీ అడుగుజాడలలో నడుద్దాం. సాహిత్యాన్ని బ్రతికించుకుందాం.@శ్రీనివాస్@
🍁శ్రీశ్రీ కవితా సూక్తులు🍁
👉మౌనం కూడా ఆయుధమే..
ఎదుటి వారిని మానసికంగా మారుస్తుంది
నువ్వు పడుకున్న పరుపు
నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలోయ్!
కావున ఈ నిరాశామయలోకంలో
కదన శంఖం పూరిస్తున్నాను
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను
అందుకో ఈ చాచిన హస్తం
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహా ప్రస్థానం.
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే,
కాని గెలిచిందంతా న్యాయం కాదు.
కుదిరితే పరుగెత్తు
లేకపోతే నడువు
అదీ చేతకాకపోతే … పాకుతూ పో
అంతేగాని .. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు
నేను సైతం ప్రపంచానికి సమిధ నొక్కటి ఆహుతిచ్ఛాను
ఏచరిత్ర చూసినా ఏముంది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా?
వానాకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ కొరడుకట్టి ఆకలేసి కేక లేశానో!
💟💟💟💟💟💟💟💟💟💟

Comments
Post a Comment