నేడు ఎస్వీ రంగారావు గారి జయంతి..

 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @


🌹నేడు ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానటుడు గురించి కొన్ని విషయాలు..🌹



👉తెలుగు సినిమా రంగం లోనే కాదు బహుశా మొత్తం భారతీయ సినిమా రంగంలోనే ఎస్వీ రంగారావు పోషించినన్ని వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించిన నటులు అరుదు. దాదాపు అన్ని ఫిలిం బానర్లలో నటించి మెప్పించిన నటుడు మరొకరు కనిపించడు. జానపద, పౌరాణిక, సాంఘిక, కౌబారు, హాస్య సినిమాల్లో విలక్షణం పాత్రల్ని పోషించి మెప్పించిన నటుడు కూడా ఎస్వీఆరే. ఎలాంటి పాత్రలో నయినా సరిగ్గా ఒదిగిపోయి తను కాకుండా పాత్రనే ప్రతి ఫలింపచేసిన నటుడాయన. తన గంభీరమయిన గొంతుతో ఆయా పాత్రలకు, సన్నివేశాలకే కాదు మొత్తంగా సినిమాకే ఒక స్థాయి కల్పించిన అద్భుతమయిన నటుడు ఎస్‌.వి. రంగారావు. నాటకాల పైన ఆసక్తి, అనుభవం తప్ప ఎక్కడా ఎలాంటి నట శిక్షణ లేకుండానే తన అవగాహనతో పాత్రల ఔచిత్యాన్ని అర్థం చేసుకున్న ఎస్వీఆర్‌ తను నటించిన ప్రతి పాత్రకూ జీవం పోశాడు. సహజ నటనగా అందరూ పిల్చుకునే 'మెథడ్‌ ఆక్టింగ్‌'కి పర్యాయ పదంగా నిలిచాడు.@శ్రీనివాస్@

👉భారతీయ సినిమా తొలినాళ్ళలో ఇలాంటి మెథడ్‌ ఆక్టింగ్‌కి ప్రముఖ హిందీ నటుడు దిలీప్‌ కుమార్‌ ప్రసిద్ధుడు. ఆయన తన తరహా నటనతో హిందీ సినిమాకు కొత్త ఒరవడి కల్పించడమే కాకుండా తర్వాతి తరాల వారికి మార్గదర్శకంగా నిలిచాడు. దిలీప్‌ కుమార్‌కి సమానంగా ఎస్వీఆర్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెథడ్‌ ఆక్టింగ్‌తో మెప్పించాడు. నిజానికి మెథడ్‌ ఆక్టింగ్‌లో నటించిన నటులు కాకుండా ఆయా పాత్రల సాధికారిక రూపం మన ముందు నిలుస్తుంది. ఆయా పాత్రల బాహ్య రూపమే కాకుండా వాటి మానసిక స్థితికూడా తెరపైన ఆవిష్కరింప బడుతుంది. దానికి ఆయా నటులు, వారు పోషించే పాత్రలతో పాటు వాటి చుట్టూ వచ్చే పాత్రల్ని కూడా అవగాహన చేసుకొని తాము పోషించే పాత్రల స్థాయి పరిమితులు గమనిస్తూ నటిస్తారు. ఫలితంగా ఆ పాత్రలు సజీవంగా రూప్పుదిద్దుకుని సహజంగా కనిపిస్తాయి. ప్రేక్షకుల మనస్సులో చిర స్థాయిగా నిలిచిపోతాయి.@శ్రీనివాస్@

👉ఈ తరహా మెథడ్‌ ఆక్టింగ్‌కు సంబంధించిన ప్రస్తావన తెచ్చింది రష్యన్‌ నాటక రంగ నటుడు, దర్శకుడు కొన్స్తాంటిన్‌ స్టానిస్లావి. దాని గురించి ఆయన తన పుస్తకం 'ఏన్‌ ఆక్టర్‌ ప్రిపేర్స్‌, బిల్డింగ్‌ ఎ కారెక్టర్‌, అండ్‌ క్రియేటింగ్‌ ఎ రోల్‌' లో రాసాడు. ఆ తరహా నటన అమెరికాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అమెరికా నుంచి ప్రపంచ దేశాల్లోకి విస్తరించింది. అట్లా సహజసిద్దమయిన నటనకు సినిమాల్లో ప్రశస్థి లభించింది. అలాంటి ప్రక్రియను ఎస్వీఆర్‌ తన శైలిలో ముందుకు తీసుకెళ్ళాడు. భారతీయ సినిమాల్లో తొలి రోజులలోనే మెథడ్‌ ఆక్టింగ్‌కు పెద్ద పీట వేసిన కొద్దిమందిలో ఆయన ఒకడు.@శ్రీనివాస్@

🍁ఏ పాత్రకు ఆ పాత్రే...🍁

👉'సాహసం చేయరా డింభకా' అంటూ ఎస్వీఆర్‌ నేపాల మాంత్రికుడిగా 'పాతాళ భైరవి'లో పలికి, మాంత్రికుడంటే ఇట్లా ఉంటాడని తెలుగు సినిమాకు పరిచయం చేసాడు. తన కెరీర్‌ తొలి రోజుల్లోనే విలక్షణమయిన పాత్రను పోషించి ప్రత్యేకత చాటుకున్నాడు. ఇక పౌరాణిక పాత్రల విషయానికి వస్తే రావణ, దుర్యోధన, కీచక, నరక వంటి అనేక ప్రతి నాయక పాత్రల్ని అలవోకగా పోషించడమే కాకుండా ప్రతి పాత్ర పోషణలోను వైవిథ్యం చూపించాడాయన. ఎక్కడా మొనాటనీ లేకుండా విభిన్న లక్షణాల్ని ప్రకటించాడు ఎస్వీఆర్‌. 'అసందర్భ ప్రలాపి' అంటూ పాండవ వనవాసం దుర్యోధనుడిగా అన్న ఒక్క మాటతో అప్పటిదాకా భీముడు చేసిన భీకర ప్రతిజ్ఞల దృశ్యాన్ని తలకిందులు చేస్తాడు. ఎన్టీఆర్‌ కు ప్రతిగా అంత గొప్ప భావాలను పలికించగల నటుడు బహుశా ఎస్వీఆర్‌ ఒక్కడే. అంతే కాదు మాయాబాజారులో 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి.. చిన్నమయా.. వెయ్యి వీరతాడు' అంటూ ఘటోత్కజుడిగా విశ్వరూపం చూపిస్తాడు ఎస్వీఆర్‌. ఇక 'బంగారుపాప, పండంటికాపురం, లక్ష్మీనివాసం, గుండమ్మకథ' లాంటి సాంఘికాల్లో సాత్వికమయిన ఇంటిపెద్దయాన పాత్రల్లో ఒదిగిపోయి అండర్‌ ప్లే చేసినా ఆయనకే చెల్లింది. లేదా 'ఏరా డోంగ్రీ' అంటూ కౌబాయి సినిమాల్లో నటించినా ఎస్వీఆర్‌ తన పాత్రలకు విలక్షణతే కల్పించాడు. 'అందరూ దొంగలే' లాంటి సినిమాల్లో ఓ చిట్టి బాబు అంటూ హాస్యాన్ని పండించినా ఆ నటనలో ప్రత్యేకత ఎస్‌.వి.రంగారావుకే సొంతం. అట్లా పాత్రల పోషణలో కొత్తరీతిని ప్రవేశపెట్టి ఏ పాత్రకు ఆ పాత్రను విస్పష్టంగా చూపిన నటుడు ఎస్వీఆర్‌. రౌడీ పాత్రలంటే అరవడం, భీకరంగా నవ్వడం, మీసాలు దువ్వడం లాంటివి వున్న రోజుల్లో ఎస్వీఆర్‌ నిదానమయిన రౌడీగా తన రౌడీ తనాన్ని హావభావాల్లో చూపించాడు షావుకారులో. ఇక 'పెళ్లి చేసిచూడు' సినిమాలో విస్సన్న పాత్రలో తన సహజ నటనతో కారెక్టర్‌ పాత్రల పోషణకు తెలుగులోనూ, తమిళం లోనూ నూతన ఒరవడిని కల్పించాడు. 'తోడికోడళ్ళు' లో మతిమరుపు లాయర్‌ పాత్రలో ఆయన ఇమిడి పోయిన తీరు గొప్పది. 'సుఖదు:ఖాలు, తాతా మనవడు' లాంటి అనేక సినిమాల్లో ఎస్వీఆర్‌ పాత్రపోషణ ఆయన సహజ నటనకు తార్కాణం. ఆయన సినీ తెరపైన అన్ని రసాలూ పండించారు. హాస్య, శృంగార, రౌద్ర, భీభత్స, శోక, సాత్విక రసాలని అభినయించి చూపించారు.@శ్రీనివాస్@ 

👉ఎస్వీఆర్‌ సహ నటుడు గుమ్మడి మాటల్లో చెప్పుకోవాలంటే 'ఆంద్ర దేశంలో ఎస్వీఆర్‌ పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం' ఎందుకంటే ఆయన స్థాయి నటుడు యూరోప్‌లోనో అమెరికాలోనో వుంటే అంతర్జాతీయ గుర్తింపునూ అవార్డుల్నీ అందుకునే వాడు.@శ్రీనివాస్@

🍁సినీరంగ ప్రవేశం🍁

👉ఎస్వీ.రంగారావు 1918వ సంవత్సరం జులై 3న, కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సామర్ల లక్ష్మి, కోటేశ్వర రావులు. ఎస్వీఆర్‌ తండ్రి అబ్కారీ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసేవారు. ఎస్వీఆర్‌ ను అప్పటి బ్రిటిష్‌ ప్రెసిడెన్సీలో చదువుకోవడానికి పంపించారు. హిందూ కాలేజీలో డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నారాయన. తన 12వ ఏటనే రంగస్థలం పైన మక్కువ పెంచుకున్న ఎస్వీఆర్‌కు నటుడిగా ఎదగాలన్న కోరిక అప్పుడే కలిగింది. కాని చదువు పూర్తి కాగానే అగ్ని మాపక శాఖలో ఉద్యోగం రావడంతో చేరిపోయాడు. కానీ మనసంతా నటనమీదే. ఎస్వీఆర్‌ కోరికను గమనించిన వారి దగ్గరి బంధువు బి.వి.రామలింగం తాను తీయ తలపెట్టిన 'వరూధిని' చిత్రంలో కథానాయక పాత్రను ఇచ్చాడు. వెంటనే తన ఉద్యోగం మానేసి ఎస్వీఆర్‌ సేలం వెళ్ళాడు. మొదటి అవకాశమే గొప్ప అవకాశంగా భావించినప్పటికీ వరూధిని ఆర్థికంగా విజయవంతం కాకపోవడంతో ఎస్వీఆర్‌ నట జీవితానికి ఆటంకం ఏర్పడింది. మరే అవకాశమూ రాక పోవడంతో నిరాశతో వెనుతిరిగిన ఎస్వీఆర్‌ తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు చేసి జెంషెడ్‌పూర్‌ టాటా కంపెనీలో చేరిపోయాడు.@శ్రీనివాస్@

👉1947 ఎస్వీఆర్‌ లీలావతిని పెళ్ళిచేసుకున్నాడు. తర్వాత బి.ఎ.సుబ్బారావు తీస్తున్న సినిమాలో పాత్రకోసం ఆయనకు పిలుపు వచ్చింది. కాని సరిగ్గా అదే సమయంలో తండ్రి కాలం చేయడంతో వూరికి వెళ్లి తండ్రి కర్మకాండ పూర్తి చేసుకొని మద్రాస్‌ చేరుకొనే సరికి ఆయన వేయాల్సిన పాత్ర ఇంకొకరికి ఇచ్చేసారు. తర్వాత 'మనదేశం, షాహుకారు, పల్లెటూరి పిల్ల' లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా తన ముద్రను ప్రదర్శించాడు ఎస్వీఆర్‌. ఆ తర్వాత విజయా వారి 'పాతాళ భైరవి'లో నేపాల మాంత్రికుడి పాత్రలో అజరామరమయిన ఆయన నటన తనను సినిమా రంగంలో నిలబెట్టింది. ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆయనకు కలగలేదు. ఆ తర్వాత తెలుగు సినీరంగంలో ఆయన ఒక ఒరవడిగా, ఒక కల్ట్‌గా నిలిచిపోయాడు. తర్వాత 'మిస్సమ్మ, మాయాబజార్‌, సతీసావిత్రి, గుండమ్మ కథ, నర్తనశాల, పాండవ వనవాసం' లాంటి సినిమాలతో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కేవలం పౌరాణికాలే కాకుండా సాంఘిక చిత్రాల తోపాటు అన్ని బానర్‌ సినిమాల్లో నటించాడాయన.@శ్రీనివాస్@ 

👉తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ఎస్వీఆర్‌ నటుడిగా అనేక పాత్రలు చేశారు. 'శారద, అన్నయి, నానుమ్‌ ఒరు పెన్న్‌' లాంటి సినిమాలతో తమిళ ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించుకున్నారు. అట్లా తన 32 ఏళ్ల సినీ ప్రస్తానం లో ఎస్వీఆర్‌ దాదాపు 162 సినిమాల్లో (తెలుగులో 109, తమిళంలో 53 కు పైగా) నటించాడు.@శ్రీనివాస్@

👉నటుడిగానే కాకుండా ఎస్వీఆర్‌ దర్శకుడిగా కూడా తన ప్రతిభ కనబరిచారు. 'చదరంగం', 'బాంధవ్యాలు' ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు.@శ్రీనివాస్@

👉ఎస్వీ రంగారావుకి వ్యక్తిగతంగా సినిమా తర్వాత వేట, క్రికెట్‌లంటే అమితమయిన ఇష్టాలు. ఇక నాటక రంగం విషయం చెపాల్సిన పనిలేదు. పంజరంలో పక్షులు లాంటి నాటకాల్ని ఆయన విరివిగా ప్రదర్శించారు.@శ్రీనివాస్@

🍁అంతర్జాతీయ పురస్కారం🍁

👉నటుడిగా గొప్ప వైవిధ్యాన్ని వినూత్నతనీ ప్రదర్శించినప్పటికీ ఎస్వీఆర్‌ కు నటుడిగా రావాల్సినంత గుర్తింపుగానీ అవార్డులుగానీ రాలేదు. అట్లని వాటిపట్ల ఆయన ఎప్పుడూ అంతగా ఆశపడ్డట్టుగా, అవార్డుల కోసం ఎస్వీఆర్‌ వెంపర్లాడి నట్టు కూడా కనిపించదు. కాని జకార్తా లో 1963 లో జరిగిన ఆఫ్రో ఆసియన్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో 'నర్తనశాల'లో కీచక పాత్రకి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇంకా ఒకటీ అరా ఫిలింఫేర్‌ అవార్డులు, రాష్ట్ర స్థాయి నంది అవార్డులు వచ్చాయి. 

కాని ఒక మహానటుడికి ఇవ్వాల్సినంత గౌరవం సినిమా రంగం ఇవ్వలేదు. ప్రభుత్వాలు పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన ప్రతిభ మాసిపోలేదు. ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికీ ఆయన పోషించిన వైవిద్యభరితమయిన పాత్రలు చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఆయన కీర్తి అజరామరంగా నిలిచిపోయింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహం నెలకొల్పడం ఆ మహాత్ముడికి సమర్పించిన నివాళి. ఎస్వీఆర్‌ హఠాత్తుగా గుండె ఆగిపోవడం తో 18 జూలై 1974న చెన్నైలో మరణించాడు.@శ్రీనివాస్@

💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..