నేడు ప్రముఖ గాయకుడు "మహమ్మద్ రఫీ" గారి వర్ధంతి..

 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @


🌹🎙నేడు ప్రముఖ గాయకుడు "మహమ్మద్ రఫీ" గారి వర్ధంతి.. ఆ మధుర గాయకుడిని గుర్తుచేసుకుంటూ కొంత సమాచారం..🎙🌹



👉భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా ‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ చనిపోతే ఆయన శవ యాత్రకు వర్షాన్ని లెక్క చేయకుండా పదివేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారంటే, అతడు ఎంతటి గొప్పవాడో ఊహించవచ్చు. ప్రేమగీతాలు, భక్తి గీతాలు, భజన పాటలు, విషాద గీతాలు, కవ్వాలీలు, గజళ్లు, జానపద గీతాలు, కవ్వింపు పాటలు... ఒకటేమిటి... రఫీ గొంతులోంచి వెలువడని విభిన్న రకాల పాటలు లేవంటే నమ్మాలి. వ్యక్తిగా సౌమ్యుడు, వినయ సంపన్నుడు, దాత, చెడు అలవాట్లు లేని సాధారణ పౌరుడు.


🍁వ్యక్తిగత సమాచారం🍁


👉జననం : డిసెంబరు 24, 1924


👉ప్రాంతము : కోట్లా సుల్తాన్ సింగ్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా


👉మరణం : 1980 జూలై 31 (వయసు 55)


👉సంగీత రీతి : హిందీ, ఉర్దూ మరియు ప్రాంతీయ గాయకుడు


👉వృత్తి :గాయకుడు

వాయిద్యం

నేపధ్యగాయకుడు


👉క్రియాశీలక సంవత్సరాలు : 1944–1980


👉తెలుగు చిత్రం ’ఆరాధన’లో ‘నా మది నిన్ను పిలచింది గానమె’ అనే పాట వింటే చాలు పాడిన గాయకుడెవరో ఇట్టే చెప్పొచ్చు. ‘భలే తమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారుగానీ, వేదాంతులైన గానీ... ఓర చూపు సోకగానె తేలిపోదురోయ్‌.. కైపులో...’ పాట వింటే దాని ప్రత్యేకత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా విలక్షణమైన గాత్రంతో పాటలకు ప్రాచుర్యాన్ని కలిపించిన మరపురాని గాయకుడు మహ్మద్‌ రఫీ. తెలుగు, హిందీ, ఉర్దూ మరాఠీ భాషలోపాటు 17 భాషల్లో గీతాలను ఆలపించాడు. ‘పద్మశ్రీ’ బిరుదును పొందాడు. మొదటి స్వాతంత్య్ర ఉత్సవాల్లో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా రజత పతకాన్ని పొందారు. విషాదగీతాలైనా, ప్రేమగీతాలైనా రఫీ గొంతులో కొత్త సోయగాలు అద్దుకున్నాయి. తెలుగులో ‘భక్తరామదాసు’, ‘కబీరు’, ‘భలేతమ్ముడు’, ‘రామ్‌రహీం’, ‘సలీం అనార్కలి’ లాంటి చిత్రాల్లో నేపథ్యగానం చేశారు. ఇక బాలీవుడ్‌లో ‘ఏ దునియా ఏ మోహఫిల్‌’ (హీరా రాంఝూ), ‘సుహానీ రాత్‌ ఢల్‌ చుకీ’ (దులారీ), ‘యే జిందగీ కే మేలే యే జిందగీ’ (మేలా), ‘బాబుల్‌ కీ దువా’ (నీల్‌ కమల్‌) చిత్రాల్లోని గీతాలను ఇప్పటికీ ఆయన అభిమానులు గుర్తుతెచ్చుకుంటారు. ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ చిత్రంలోని ‘క్యాహువా తేరా వాదా’ గీతానికి ‘జాతీయ పురస్కారం’ లభించింది. పలు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు. లతామంగేష్కర్, రఫీలు గాయక జోడీగా గుర్తింపు పొంది నేపథ్యగాన చరిత్రలోనే కొత్త ఒరవడిని సృష్టించారు. 1950 నుంచి ఇరవైఏళ్లపాటు రఫీ సినీరంగంలో ఎదురులేని గాయకుడిగా స్థానం సంపాదించుకొన్నాడు. సంగీత దర్శకులు నౌషద్‌అలీ, ఓపీ నయ్యర్, శంకర్‌జయ కిషన్, ఎస్‌డీ బర్మన్, రోషన్‌లతో కలిసి పనిచేశారు. ప్రైవేట్‌ ఆల్బమ్‌లను రూపొందించాడు. సుమారు 7,405 గీతాలను ఆలపించాడు. ‘ఆస్‌పాస్‌’ చిత్రంలోని ‘షామ్‌ ఫిర్‌ క్యూం ఉథాస్‌’ గీతాన్ని ఆలపించిన కొద్దిసేపటి తరువాత గుండెపోటుతో 1980 జులై 31న మృతి చెందారు. 


💟💟💟💟💟💟💟💟💟💟

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..