నేడు ప్రముఖ గాయకులు "విస్సంరాజు రామకృష్ణదాసు(వి.రామకృష్ణ)" గారి వర్ధంతి..
@శ్రీనివాస్@
నేడు ప్రముఖ గాయకులు "విస్సంరాజు రామకృష్ణదాసు(వి.రామకృష్ణ)" గారి వర్ధంతి.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు..
రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20 న విజయనగరంలో జన్మించారు. గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించారు.
1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.
అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాలు విశేష ఆదరణ పొందాయి.
తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు.
ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన చిత్రాల్లో గాత్రమందించారు. ముఖ్యంగా.... భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్ర వేసుకున్నారు. మహాకవి క్షేత్రయ్య, దానవీరశూరకర్ణ, అమరదీపం, శ్రీమద్‌విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాలరాముడు, తాతా మనవడు, భక్తతుకారం, శారద, భక్తకన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.
కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడిన వీరు 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Comments
Post a Comment