నేడు దక్షిణ భారత నైటింగేల్ "చిత్ర" గారి పుట్టినరోజు..
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
🎙🎼నేడు దక్షిణ భారత నైటింగేల్ "చిత్ర" గారి పుట్టినరోజు.. ఆ గానకోకిల గురించి కొన్ని విషయాలు..🎼🎙
💐HAPPY BIRTHDAY CHITRA GARU..💐
👉జన్మనామం : చిత్రా కృష్ణన్ నాయర్
👉ఇతర పేర్లు : చిత్ర,కన్నడద మగళు
👉జననం : 1963 జూలై 27 (వయస్సు: 55 సంవత్సరాలు)
తిరువనంతపురము, కేరళ, భారతదేశం
👉సంగీత రీతి: నేపథ్యగానము, కర్ణాటక సంగీతము
👉వృత్తి :గాయని
👉వాయిద్యం: గాత్రము
👉క్రియాశీలక సంవత్సరాలు : 1979–నేటి వరకు
👉ఉత్తమ నేపథ్య గాయనిగా అత్యధిక జాతీయ పురస్కారాలు అందుకొన్న గాయకురాలు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ నేపథ్యగాయనిగా పురస్కారాలు అందుకొన్న తొలి గాయని. బ్రిటిష్ పౌర్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి గౌరవం పొందిన తొలి భారతీయ మహిళ. చైనా ప్రభుత్వం నుంచి షాంఘై ఇంటర్నేషనల్ మ్యూజిక్ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క భారతీయ గాయని. లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో జరిగే ప్రతిష్టాత్మక సంగీత ప్రదర్శనలో పాల్గొన్న తొలి దక్షిణ భారతదేశ గాయని. 25 వేలకి పైగా పాటలు ఆలపించిన గాయని. - ఈ ఘనతలన్నింటినీ సాధించిన ఆ ప్రఖ్యాత గాయని ఎవరో కాదు... మన కె.ఎస్.చిత్ర. అవును... కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె ఏ భాషలోకి వెళ్లిన మన చిత్రే అంటారు. అంతగా ఆమె శ్రోతలకి చేరువయ్యారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, తులు, ఉర్దూ, సంస్కృతం, బడగ భాషలతో పాటు, విదేశీ భాషలైన మలయ్, లాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లిష్ భాషల్లో కూడా ఆమె పాటలు ఆలపించి, తన స్వర మాధుర్యాన్ని ప్రపంచం నలమూలల్లోని శ్రోతలకి రుచి చూపించారు. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ గౌరవం ఆమె పొందారు. తిరువనంతపురంలోని సంగీత కుటుంబంలో పుట్టి పెరిగారు చిత్ర. ఆమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఆమె తండ్రి కృష్ణన్ నాయరే తన తొలి గురువు అని చెబుతుంటారు చిత్ర. ఆమె అక్క కె.ఎస్.బీన, తమ్ముడు కె.మహేష్ కూడా నేపథ్య గాయకులే. తల్లి శాంత వీణ వాయిద్యకారులు. చిన్నప్పట్నుంచి ఆమె దగ్గర కూడా పాఠాలు నేర్చుకొన్నారు చిత్ర. డా.ఒమనకుట్టి దగ్గర కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకొన్న చిత్ర యూనివర్సిటీ ఆఫ్ కేరళ నుంచి సంగీతంలో బి.ఎ పట్టా అందుకొన్నారు. ఆ తర్వాత మాస్టర్స్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వ నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యారు. 1979లోనే మలయాళంలో ఎం.జి.రాధాకృష్ణన్ సారథ్యంలో ప్రైవేట్ ఆల్బమ్స్‌లో పాడారు. ‘అట్టహాసమ్’, ‘స్నేహపూర్వమ్ మీర’, ‘అంజన్ ఎక్కనరు’ చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. ఆతర్వాత ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాస్‌తో కలిసి దేశంలోనూ, విదేశాల్లోనూ సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 1992లో ‘రోజా’ చిత్రం కోసం తెలుగులో నాగమణీ నాగమణీ... అనే పాట ఆలపించి శ్రోతలకి చేరువయ్యారు. ఆ తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి పలు చిత్రాల్లో గీతాలు ఆలపించి విశేషంగా పేరు తెచ్చుకొన్నారు. ‘రుద్రవీణ’, ‘ఘర్షణ’, ‘వారసుడొచ్చాడు’, ‘మరణమృదంగం’, ‘గీతాంజలి’, ‘శివ’, ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’, ‘రుద్రనేత్ర’, ‘కోకిల’, ‘ప్రేమపావురాలు’, ‘అల్లుడుగారు’, ‘బొబ్బిలిరాజా’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘కొండవీటి దొంగ’, ‘లారీడ్రైవర్’, ‘దొంగ దొంగ’, ‘సూపర్ పోలీస్’, ‘డ్యూయెట్’, ‘మెత్తు’, ‘ప్రేమతో’.. ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో ఆమె పాటలు ఆలపించారు. ఈమధ్య విడుదలైన ‘శతమానం భవతి’, ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాల్లోనూ చిత్ర ఆలపించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఎక్కువ గీతాలు ఆలపించిన గాయని చిత్రనే కావడం విశేషం. ఇళయరాజా స్వరకల్పనలోనూ ఎక్కువ గీతాలు ఆలపించారు చిత్ర. తెలుగురాష్ట్రాల్లో సంగీత సరస్వతిగా కీర్తి ప్రతిష్టలు అందుకొంటున్న చిత్ర ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన విజయ్‌శంకర్‌ని వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక్కగానొక్క సంతానమైన నందన దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి మృతిచెందారు. ఎ.ఆర్.రెహమాన్ సారథ్యంలో జరుగుతున్న సంగీత ప్రదర్శన కోసం చిత్ర వెళ్లగా, ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 20 దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి శ్రోతల్ని ఉర్రూతలూగించారు చిత్ర.
💟💟💟💟💟💟💟💟💟💟

Comments
Post a Comment