వీణ వేణువైన సరిగమ విన్నావా..

 @శ్రీనివాస్@


రంగనాథ్ గారి జయంతి స్మృతిలో..


వీణ వేణువైన సరిగమ విన్నావా..



చిత్రం : ఇంటింటి రామాయణం

సంగీతం : రాజన్ - నాగేంద్ర

సాహిత్యం : వేటూరి

గానం : బాలు,జానకి


వీణ వేణువైన సరిగమ విన్నావా

తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల, చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యాలీవేళలో


ఊపిరి తగిలిన వేళ, నే ఒంపులు తిరిగిన వేళ

నా వీణలో నీ వేణువే పలికే రాగమాల

చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ

నా తనువునా అణువణువునా జరిగే రాసలీల

||వీణ వేణువైన||


ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత

నీ రాకతో నా తోటలో, వెలసే వనదేవత

కదిలే అందం కవిత, అది కౌగిలి కొస్తే యువత

నా పాటలో నీ పల్లవే నవత, నవ్య మమత

||వీణ వేణువైన||

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..