నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "కీరవాణి" గారి జన్మదినం..
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
💐💐💐🎼🎹నేడు ప్రముఖ సంగీత దర్శకుడు "కీరవాణి" గారి జన్మదినం.. ఆయన గురించిన కొంత సమాచారం..🎹🎼💐💐💐
💐💐💐HAPPY BIRTHDAY KEERAVANI GARU..💐💐💐
👉తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్వరాల మధురవాణి ఎం.ఎం.కీరవాణి. ఓ రాగాన్నే పేరుగా పెట్టుకుని శ్రావ్యమైన సంగీతాన్ని, తెలుగు భాషలోని తియ్యదనాన్ని తన సంగీతం ద్వారా వినిపించగల దిట్ట ఆయన. ఎన్నో జనరంజకమైన గీతాలకు స్వరకర్తగా ప్రేక్షకుల హృదయాల్లో ఆయనది ప్రత్యేకస్థానం. సాహిత్య ప్రధానమైన గీతాలైనా, నేటి యువతను ఉర్రూతలూగించే మాస్ గీతాలైనా స్వరపరచి మెప్పించడం ఆయన ప్రత్యేకత. పాటలే కాక సన్ని వేశానికి తగ్గట్టు నేపథ్య సంగీతాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్నమయ్య సినిమాతో పండితులకే పరిమితమైన అన్నమాచార్య గీతాలను అందరికీ చేరువ చేశారు తన ప్రత్యేకమైన సంగీత బాణీలతో. ఈ మరకతమణి అందించిన సంగీతం ప్రేక్షకులకు హృదయోల్లాసం. ఆయన స్వరపరిచి గానం చేసిన పాటలు అలరించే ఆణిముత్యాలు.
👉పాట వినగానే ఇది కీరవాణి పాట అని ప్రేక్షకులు గుర్తుపట్టే విధంగా ఎన్నో గీతాలకు సంగీతాన్ని సమకూర్చారు. సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం అందించి ఉద్దండులైన గత కాలపు సంగీత దర్శకులు లేని లోటును భర్తీ చేశారంటే అతిశయోక్తి కాదు.
👉పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ పాట పల్లవి అంతా వయొలిన్ వాయిద్యంతో సమానంగా సాగుతుంది. క్లాసిక్‌గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు, మీనా తాతా మనవరాళ్ళుగా నటించిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోనిది. వేటూరి సాహిత్యానికి బాలు, చిత్ర గానం చేశారు.
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా అంటూ సాగే ఈ పాట వినగానే అడవిలో చిమ్మచీకటి... కొన్ని రకాల పక్షుల ధ్వనులు... అమాయకమైన ముఖంతో భయపడే శ్రీదేవి, జోలపాడే వెంకటేష్ చప్పున మదిలో మెదులుతాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటని బాలసుబ్రమణ్యం, చిత్ర ఆలపించారు.
👉కొన్ని పాటలు ఫాస్ట్‌బీట్‌లో ఉన్నా వినడానికి చాలా బావుంటాయి. సంగీత వాయిద్యాలెంత హోరెత్తినా కూడా సాహిత్యం కూడా అర్థమయ్యేట్టు ఉంటుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రంలో వేటూరి రాసిన గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేలా ఒకటి. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాటలో మోహన్‌లాల్ తొలిసారి తెలుగు సినిమాలో అది కూడా ఈ ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తారు. ఈ పాటలో మోహన్‌లాల్ గొంతుకు సరిగ్గా సరిపోయేట్లు, నిజంగా ఆయనే పాడారా అన్నట్టు బాలు, చిత్రలతో గాత్రం కలిపారు శ్రీ కుమార్.
👉జానపద బాణీలో ఉన్న పాట ఎక్కడున్నా మనసుకు ఆకట్టుకుంటుంది. అటువంటి పాటే ఆపద్బాంధవుడు చిత్రంలో ఔరా అమ్మకచల్లా ఆలకించి నమ్మడవెల్లా, అంత వింత గాథల్లో ఆనందలాలా. ఈ పాట మొదట్లో బారులు తీరిన పల్లె పడుచులు ఆలపించే జావళి పాటకు ప్రాణంగా నిలుస్తుంది. చిరంజీవి, మీనాక్షి శేషాద్రి నటించిన సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటను బాలు, చిత్ర ఆలపించారు.
👉కీరవాణి అందించిన బాణీల్లో మెలొడీ, మాస్ పాటలే కాదు ఏడిపించే పాటలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటి స్థానం మాత్రం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలిని తోడు లేడులే పాటదే. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యానికి కీరవాణి అందించిన బాణీ తోడై... ఎన్ని సార్లు విన్నా, ఎవరికైనా తెలియకుండానే కన్నీరొస్తుంది. ఇదే కాదు ఈ చిత్రంలోని ఏ పాట విన్నా చిత్రంలోని ప్రతి సన్నివేశం కళ్ళముందు కదలాడి హృదయం భారమౌతుంది.
👉ఒక జంట అనుబంధాన్ని, ప్రేమని అద్భుతంగా స్వరాల్లో కూర్చిన పాట తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో. ప్రేమికులు పాటలు ఎన్ని వచ్చినా కొన్నింటిని ఎన్నటికీ మర్చిపోలేం. ఆ కొన్నింటిలో ఇదీ ఒకటి. నాగార్జున, మనీషాకోయిరాలా, రమ్యకృష్ణ నటించిన క్రిమినల్ సినిమాలోని ఈ పాటకి సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం బాలు, చిత్ర.
👉మనసొక ఊహల పల్లకి. లెక్కలేనన్ని భావాల సమాహారం ఈ మనసు. ఈ మాట నిజమో కాదో తెలియాలంటే అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు పాట వినాల్సిందే. రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల నటించిన అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ పాట భావానికి తగ్గట్టు సంగీత దర్శకులు అందించిన బాణీ కూడా ప్రేక్షకుల మనుసును ఆకట్టుకుందనటంలో సందేహం లేదు.
👉కష్టాలను కూడా అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకనేలా చెప్పడం ఒక కళ. లాలూదర్వాజ లష్కర్ బోనాల్ పండక్కొస్తనని రాకపోతివి పాట వింటే ఈ పాట ఎవరైనా ఒప్పుకుని తీరతారు. పోలీసుల కష్టాలను ఏకరువు పెట్టే ఈ పాట వింటున్నా, చూస్తున్నా ఇది కష్టాలను గుర్తు చేసే పాటంటే నమ్మబుద్దికాదు. అంత వినసొంపైన ట్యూన్‌తో తెలంగాణ యాస సాహిత్యంతో అందరి మదిని దోచుకుంది. సుమన్, విజయశాంతి నటించిన మొండిమొగుడు పెంకి పెళ్ళాంః చిత్రంలోని ఈ పాటకి సాహిత్యం సాహితి, గానం ఎస్.పి.శైలజ.
👉మనసు - మమత చిత్రం నుండి సుందరకాండ, అనుకోకుండా ఓ రోజు, శుభసంకల్పం, ఛత్రపతి, యమదొంగ, స్టూడెంట్ నెం.1, అంతం, అన్నమయ్య,శ్రీరామదాసు, ఘరానా మొగుడు, రక్షణ, సుందరకాండ, అల్లరి బుల్లోడు, మనీ, వారసుడు, గంగోత్రి, మేజర్ చంద్రకాంత్, నా ఆటోగ్రాఫ్, అమ్మ చెప్పింది, పరదేశి, పెళ్ళి సందడి.... ఇలా ఎన్నో చిత్రాలకు సంగీతాన్నందించడమే కాక, కొన్ని ప్రత్యేకమైన పాటలను పాడి ప్రేక్షకులను మెప్పించారు కూడా.
💟💟💟💟💟💟💟💟💟💟

Comments
Post a Comment