మావిచిగురు తినగానే కోయిల పలికేనా..
@శ్రీనివాస్@
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి స్మృతిలో ఆయన రచన చేసిన గీతంతో మిత్రులందరికీ శుభరాత్రి..
మావిచిగురు తినగానే కోయిల పలికేనా..
చిత్రం: సీతామాలక్ష్మి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: బాలు, సుశీలమ్మ
సంగీతం: కె.వి.మహదేవన్
మావిచిగురు తినగానే కోయిల పలికేనా
కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిమేనా
ఏమో ఎమనునోగానీ ఆమని ఈ వని
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా
వన్నెలేకాదు వగలేకాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి గడసరి
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలు పులకరింతలు
ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ
పాటలోని కొన్ని పదాల అర్థాలు:
తొడుము = చిగురించు, to sprout
ఆమని = వసంతం, spring
వని = అడవి, forest
తెమ్మెర = చల్లగాలి, cool breeze
తారాట = play
బింకం = గర్వం, pride
బిడియం = సిగ్గు, shyness
పొంకం = ఠీవి, style
పోడిమి = elegance
విరి = పువ్వు, flower
దివిటీ = torch
Comments
Post a Comment