🌹🎞️నేడు రావుగోపాలరావు గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు🎞️🌹
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹🎞️నేడు రావుగోపాలరావు గారి జయంతి.. ఆయన గురించి కొన్ని విషయాలు🎞️🌹 👉రావు గోపాలరావు.. నట విశ్వరూపంతో విలనిజానికే వన్నె తెచ్చిన లెజెండరీ నటుడు. విలనిజానికి వినోదాన్ని జోడించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఘనుడు. నటనకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకునే విశాల హృదయుడిగా ప్రజల మదిలో నిలిచిన రావుగోపాలరావు జయంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్న రావుగోపాలరావు 1937 జనవరి 14న కాకినాడ సమీపంలోని గంగనపల్లి గ్రామంలో జన్మించారు. మొదట బొమ్మలు గీసే ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు. సాహిత్యంపై మక్కువతో పుస్తక ప్రియుడిగా మారారు. శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి రచనల స్ఫూర్తితో సాహిత్య కళల సమాహారంగా పలు నాటకాలు రాశారు. ఆయన నాటకాలన్నీ సామాజిక ఇతివృత్తంతోనే ఉండటం విశేషం.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉'అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా' కాంపెనీని స్థాపించి తన స్నేహితులతో కలిసి నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. 'కీర్తిశేషులు' అనే నాటకం వేసి బాగా...