Posts

ఆంధ్రా షెల్లీ... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నేడు...

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍ఆంధ్రా షెల్లీ... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నేడు.. ఆ గొప్ప కవి గురించి కొన్ని విషయాలు✍🌹 👉మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల ఎలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ ఎలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని ఎలా మోసుకొస్తుంది? ప్రియుని జాడ ఎలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన ఆ మేఘమాలది జాలిగుండె కాదా? సఖియ రాకుంటే వసంతమాసం ఆగుతుందా? మోయలేని హాయిని ఒక్క క్షణం మోయలేదా? ఆకాశపందిరిలో పెళ్లిజరిగితే దేవతలు పురోహితులుగా, అప్సరసలు పేరంటాళ్లుగ రావడం సాధ్యమా?... వీటన్నిటికీ సమాధానాలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావ కవితలే. మీగడ తరకల్లాంటి జుబ్బా, పంచెకట్టు, ఉత్తరీయం, బంగారు రంగు శరీరం, వెండి గిరజాల జుట్టుతో భావకవితా ప్రపంచానికి చక్రవర్తిలా, తన కవిత్వంలాగే అందంగా భాసిల్లిన పదనిర్దేశకుడు. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనుల విందుగా వస్తుంది. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చ...

నేడు "ఎస్.పి.శైలజ" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐🎙గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, 5వేలకు పైగా పాటలు పాడి.. ఎన్నో మధురాతి మధురాలను అందించిన మేటి గాయని "ఎస్.పి.శైలజ" గారి పుట్టినరోజు నేడు.. ఆమె గురించి కొన్ని విషయాలు🎙💐 💐Happy Birthday Sailaja garu..💐 👉మాటే మంత్రము.. మనసే బంధము.. మనసు ఒక మందారం.. చెలిమి ఒక మకరందం.. లాంటి పాటలు వింటే చాలు.. ఆ గొంతులోని మాధుర్యంతో మనసు పులకరిస్తుంది.. లాలూ దర్వాజ లస్కరు బోనాల పండుగ, నాంపల్లి టేసనుకాడి రాజాలింగో లాంటి జానపదాలు విన్నప్పుడు పాటలోని జోరుతో శరీరానికి ఊపొస్తుంది. పాటతో మనసును, తనువును ఒక్కసారే పులకరింపచేయగల గాయని శైలజ....పాటల్లోనే కాదు.. పలకరింపులోనూ లాలిత్యాన్ని ఒలికించే గాయని ఎస్పీ శైలజ.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ గాయకులల్లో ఒకరైన శ్రీపతి పండితారాధ్యుల శైలజ (ఎస్ పి శైలజ ) గారు నేపథ్య గాయకురాలుగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సంగీతమే కాకుండా నాట్యం, నటన, డబ్బింగ్ రంగాలలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లా కొనేటమ్మపేట గ్రామంలో 1962 అక్టోబర్ 9 న పుట్టి చెన్నైలో పెరిగారు.@𝒔𝒓𝒆𝒆𝒏...

ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు...

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : 1895 సెప్టెంబరు 28 గుంటూరు జిల్లా వినుకొండ 👉మరణం : 1971 జూలై 24 (వయసు 75) గుంటూరు 👉నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ 👉వృత్తి : రచయిత , కవి , సాహితీకారుడు 👉సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి 👉తండ్రి : వీరయ్య 👉తల్లి : లింగమ్మ 👉గుర్రం జాషువా జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు.జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు 19వ శతాబ్ధపు ప్రమ...

నేడు బాలీవుడ్ నైటింగేల్ "లతా మంగేష్కర్" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐🎙ఆ గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆ గొప్ప గాయణి.. బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్ గారు.. ఆమె పుట్టిన రోజు నేడు.. ఆమె గురించి కొన్ని విషయాలు🎙💐 💐🎙HAPPY BIRTHDAY LATHAMMA..🎙💐 👉జన్మనామం : లతా మంగేష్కర్ 👉జననం : 1929 సెప్టెంబరు 28 (వయస్సు: 89  సంవత్సరాలు) ఇండోర్, మధ్యప్రదేశ్ 👉ప్రాంతము : మహారాష్ట్ర 👉సంగీత రీతి : హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము 👉వృత్తి : గాయని 👉వాయిద్యం : నేపథ్య గాయిని 👉క్రియాశీలక సంవత్సరాలు : 1942 - ప్రస్తుతము 👉తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో.. ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తర...

నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ..

Image
 @శ్రీనివాస్@ నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ.. సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ బాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించారాయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ.  తండ్రి హరికథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగి...