నేడు "ఎస్.పి.శైలజ" గారి పుట్టినరోజు..
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
💐🎙గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, 5వేలకు పైగా పాటలు పాడి.. ఎన్నో మధురాతి మధురాలను అందించిన మేటి గాయని "ఎస్.పి.శైలజ" గారి పుట్టినరోజు నేడు.. ఆమె గురించి కొన్ని విషయాలు🎙💐
💐Happy Birthday Sailaja garu..💐
👉మాటే మంత్రము.. మనసే బంధము.. మనసు ఒక మందారం.. చెలిమి ఒక మకరందం.. లాంటి పాటలు వింటే చాలు.. ఆ గొంతులోని మాధుర్యంతో మనసు పులకరిస్తుంది.. లాలూ దర్వాజ లస్కరు బోనాల పండుగ, నాంపల్లి టేసనుకాడి రాజాలింగో లాంటి జానపదాలు విన్నప్పుడు పాటలోని జోరుతో శరీరానికి ఊపొస్తుంది. పాటతో మనసును, తనువును ఒక్కసారే పులకరింపచేయగల గాయని శైలజ....పాటల్లోనే కాదు.. పలకరింపులోనూ లాలిత్యాన్ని ఒలికించే గాయని ఎస్పీ శైలజ.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ గాయకులల్లో ఒకరైన శ్రీపతి పండితారాధ్యుల శైలజ (ఎస్ పి శైలజ ) గారు నేపథ్య గాయకురాలుగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సంగీతమే కాకుండా నాట్యం, నటన, డబ్బింగ్ రంగాలలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లా కొనేటమ్మపేట గ్రామంలో 1962 అక్టోబర్ 9 న పుట్టి చెన్నైలో పెరిగారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉తండ్రి హరికథ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తీ గారు, తల్లి శ్రీపతి పండితారాధ్యుల శకుంతలమ్మ గారు , అన్న ప్రముఖ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (ఎస్ పి బాలసుబ్రమణ్యం). 1989 లో నటుడు శుభలేఖ సుధాకర్(సురవజుల సుధాకర్) గారితో వివాహం జరిగింది. సురవజుల శ్రీకర్ వారి ఏకైక కుమారుడు .@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉1977 లో గాయకురాలిగా అరంగేట్రం చేసిన శైలజ గారు పెళ్లి కాకముందే ప్రముఖ గాయకురాలు ఎస్ పి శైలజ గా పేరు పొందారు. తన ఇంటిపేరు విషయం లో తన భర్త కూడా అభ్యంతరం తెలుపకపోవడంతో ఎస్ పి శైలజగా కొనసాగారు. ఇంటి పేరు విషయం లో మరికొన్ని కారణాలు కూడా దోహదం చేసాయి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉1983 లో విడుదలైన కల తపస్వి కె విశ్వనాథ్ గారి సాగర సంగమం చిత్రంలో కమల హాసన్ కూతురిగా నటించారు. నటిగా శైలజ గారికి ఏకైక చిత్రం ఇదే. నటనలో ఆసక్తి లేకపోయినా దర్శకుడు కె విశ్వనాధ్ మరియు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు ఆ పాత్ర కోసం భరతనాట్యం వచ్చిన శైలజ గారే కావాలని పట్టు పట్టడంతో అన్న బాల సుబ్రహ్మణ్యం సహకారం తో ఈ సినిమాలో నటించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉గాయకురాలుగా తీరిక లేకుండా ఉన్న సమయంలోనే డబ్బింగ్ ఆలోచన లేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఎన్నో సినిమాల్లో చాలా మంది నటీమణులకు తన స్వరాన్ని అందించారు. దర్శకుడు విజయ్ బాపినీడు గారి పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా లో మొదటిసారిగా నటి రాధికా గారికి డబ్బింగ్ చెప్పారు. తర్వాత నటి శ్రీదేవి, టబు, సోనాలి బింద్రే మరికొంత మంది నటీమణులకి డబ్బింగ్ చెప్పారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
👉తెలుగు చిత్రపరిశ్రమ కి ఎంతో మంది గాయకులని అందించిన సూపర్ సింగర్ టీవి షో సీసన్స్ 1,2,3 మరియు సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా న్యాయనిర్ణేత గా వ్యవహరించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@
💟💟💟💟💟💟💟💟💟💟
Comments
Post a Comment