నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸@ 🌹చలనచిత్ర యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి నేడు... ఆ మహానటున్ని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు మీకోసం..🌹 👉అతనిలా నటించగల విలక్షణ నటుడు ప్రపంచంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాల్లో అతడు నటించని పాత్రలేదు. భీష్ముడు, సుయోధనుడు, రావణుడు, భీముడు, కర్ణుడు వంటి పాత్రల్ని హీరోచిత పాత్రలుగా మలిచి ఆ పాత్రల గొప్పతనాన్ని ప్రేక్షకులకు పంచిన ఆదర్శనటుడాయన. తేజస్సు మూర్తీభవించిన స్ఫురద్రూపి. ఆయన రూపమే సమ్మోహనాకారం... అది ఒక గ్రీకు శిల్పం. చిత్రసీమలో ఆయన ఒక సంచలనం. ‘‘పుణ్యపురుషులు యుగానికొకరే పుడతారు’’ అన్నట్లు మన చలనచిత్ర యుగానికి ఆయనే యుగపురుషుడు.... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన అందరినీ సంభోంధించేది ‘‘బ్రదర్’’ అని కానీ అందరికీ ఆయనే పెద్దన్న. రాజకీయంలో బడుగు జీవులకు ఆపధ్బాంధవుడు. తిరుమల - తిరుపతి సందర్శించే భక్తజనకోటికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసిన అన్నపూర్ణుడు.@శ్రీనివాస్@ 👉పౌరాణికం.. జానపదం.. సాంఘికం... పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంల...