Posts

ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు...

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : 1895 సెప్టెంబరు 28 గుంటూరు జిల్లా వినుకొండ 👉మరణం : 1971 జూలై 24 (వయసు 75) గుంటూరు 👉నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ 👉వృత్తి : రచయిత , కవి , సాహితీకారుడు 👉సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి 👉తండ్రి : వీరయ్య 👉తల్లి : లింగమ్మ 👉గుర్రం జాషువా జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు.జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు 19వ శతాబ్ధపు ప్రమ...

నేడు బాలీవుడ్ నైటింగేల్ "లతా మంగేష్కర్" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐🎙ఆ గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆ గొప్ప గాయణి.. బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్ గారు.. ఆమె పుట్టిన రోజు నేడు.. ఆమె గురించి కొన్ని విషయాలు🎙💐 💐🎙HAPPY BIRTHDAY LATHAMMA..🎙💐 👉జన్మనామం : లతా మంగేష్కర్ 👉జననం : 1929 సెప్టెంబరు 28 (వయస్సు: 89  సంవత్సరాలు) ఇండోర్, మధ్యప్రదేశ్ 👉ప్రాంతము : మహారాష్ట్ర 👉సంగీత రీతి : హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము 👉వృత్తి : గాయని 👉వాయిద్యం : నేపథ్య గాయిని 👉క్రియాశీలక సంవత్సరాలు : 1942 - ప్రస్తుతము 👉తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో.. ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తర...

నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ..

Image
 @శ్రీనివాస్@ నేడు సుప్రసిద్ధ గాయకులు, పద్మవిభూషణ్ బాలు గారి వర్ధంతి.. ఆ మహాగాయకులను స్మరించుకుంటూ.. సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ బాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించారాయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ.  తండ్రి హరికథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగి...

ఏ జన్మదో ఈ సంబంధమూ..

Image
@శ్రీనివాస్ @ ఏ జన్మదో ఈ సంబంధమూ.. చిత్రం:: రక్షణ సంగీతం:: కీరవాణి రచన:: వేటూరి గానం:: కీరవాణి,చిత్ర పల్లవి:: ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగామో ఈ సంగీతమో మనసే కోరే..మాంగళ్యం తనువే పండే..తాంబూలం  ఈ ప్రేమ యాత్రలో..ఓఓ ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం::1 ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యెళ్ళ తీపి బంధం మా ఇంటి లోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం::2 లతలు రెండు విరులు ఆరై విరిసె...బృందావని కళలు పండి వెలుగులాయె కలిసి...వున్దామని వేశంగి..మల్లె చిలకే సీతఅంగి వేళ చినుకై హేమంత సిగ్గులోలికి కవ్వింతలాయె కలతే ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలిదో..ఓ ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగామో ఈ సంగీతమో మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం  ఈ ప్రేమ యాత్రలో.. ఓఓ ఏ జన్మదో ఈ సంబంధమూ

టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు..

Image
 @శ్రీనివాస్@ టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు.. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఎనలేని సేవలు.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు.. కాసాని ఈశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో "ఈశ్వర్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు.పోస్టర్‌ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది. ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వచ్చింది. పాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్ధాంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్ద పెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారు.ఆయన భార్య పేరు వరలక్ష్మి. వీరికి ఇద్దరు ...