Posts

నేడు "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి  "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి నేడు... ఆ సాహితీవేత్త గురించి కొన్ని విషయాలు.. తెలుగువారి కళాసాహిత్య సంగీత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన అపురూప కళారూపం హరికథ. కేవలం ఒక్క కళాకారుడు సంగీత, సాహిత్య, నృత్య, అభినయ కళాభినివేశంతో మృదంగం, వయోలిన్‌ వాద్య సహకారంతో శ్రోతలను ఆధ్యాత్మిక, కళాసాగరంలో ఓలలాడించే ఈ కళారూప సృష్టికర్త శ్రీనారాయణదాసు. ఒకనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో 1864 ఆగస్టు 31న ఆదిభట్ల జన్మించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన బలిజపేట మండలంలోని అజ్జాడ ఆయన జన్మ స్థలం. తను జన్మించిన అజ్జాడ గ్రామనామాన్ని తన పేరులో ఇముడ్చుకుని ఆ గడ్డను ధన్యం చేసిన మహనీయుడు. ఆదిభట్ల వేంకటచయనులు, లక్ష్మీనరసమాంబలు తల్లితండ్రులు. వంశపారంపర్యంగా అబ్బిన సంస్కృతీ సంప్రదాయాల వలన చిన్ననాటినుంచి అరుదైన సంగీత జ్ఞానమబ్బింది. భక్తి భాగవత కీర్తనలతోనే బాల్యం ప్రారంభమైంది. ఆ సంగీత సాహిత్య జ్ఞానంతోనే కేవలం 19వ ఏటనే తొలి హరికథా గానం చేసిన సంగీతజ్ఞుడు. తల్లి...

నేడు బాపు గారి వర్ధంతి..

Image
 కొంటెబొమ్మల బాపు గారికి వర్ధంతి నివాళి 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, రమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్...

నేడు ఆరుద్ర గారి జయంతి..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర  గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : ఆగస్టు 31, 1925 విశాఖపట్నం 👉మరణం : జూన్ 4, 1998 👉మరణ కారణము : మూత్ర పిండాలు పనిచేయక 👉ఇతర పేర్లు : భాగవతుల సదాశివశంకర శాస్త్రి 👉వృత్తి : కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు 👉మతం : హేతువాది 👉భార్య / భర్త : కె.రామలక్ష్మి 👉రచయిత అన్నాక అక్షరం మీద పట్టు ఉండటం సహజమే! అందుకే కొందరు రచయితలు సాహిత్యానికి సంబంధించిన చాలా ప్రక్రియలలో అడుగుపెడుతూ ఉంటారు. కొండొకచో విజయాన్నీ సాధిస్తుంటారు. కానీ సాహిత్యంలో సవ్యసాచిలా ఎడాపెడా తన ప్రాభవాన్ని చూపగలిగే ప్రతిభ అతికొద్దిమందికే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అలాంటివారి గురించి చెప్పుకునే సందర్భం వస్తే బహుశా ఆరుద్రతోనే ఆరంభించాలేమో!@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@ 👉ఆరుద్ర శ్రీశ్రీతో పోటీపడుతూ విప్లవకవితలు రాశాడు; ‘త్వమేవాహం’తో దాశరథికి దీటుగా నిజాం అకృత్యాలను ఎండగట్టాడు; ...

నేడు ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు..

Image
 @🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 💐ప్రముఖ నటి "సుమలత" గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు💐 💐Happy birthday Sumalatha garu..💐 👉సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా  నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ  మరియు హిందీ చిత్రాలలో నటించింది. 👉1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది. 👉సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992  న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు....

నేడు అంజలీదేవి గారి జయంతి..

Image
 @🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​@ 🌹సినీపరిశ్రమలో తనదైన చెరగని ముద్రవేసి, సినీ రంగానికి అలుపెరుగని సేవ చేసిన అంజలీదేవి గారి జయంతి నేడు.. ఆమె గురించి కొంత సమాచారం మీకోసం..🌹 👉అభినవసీతమ్మ గా ప్రసిద్ది చెందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది. @శ్రీనివాస్@ 👉అంజలీ దేవి 1927 , ఆగష్ట్ 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.@శ్రీనివాస్@ 👉1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయిక గా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలన...